AP NEWS: రైతుల సంక్షేమంలో భారత్ లోనే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రం ఆంధ్ర.. కేరళ వ్యవసాయ శాఖ మంత్రి.. వైగా 2023 ఇంటర్నేషనల్ సెమినార్ ఆదివారం కేరళలో తిరుమంతపురంలో ప్రారంభమైంది.. వైగా అంతర్జాతీయ సదస్సు 2023లో కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్ రైతు సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పథకాలను చూసి రైతు సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. వారం రోజులపాటు జరగనున్నటువంటి …
Read More »సినీ ఇండస్ట్రీలో మరో విషాదం
సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన యువ నూతన దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ (31) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జోసెఫ్.. కేరళ అలువాలోని రాజగిరి ఆస్పత్రిలో హెపటైటిస్ కు చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. అయితే జోసెఫ్ మను ‘ఐయామ్ క్యూరియస్’ సినిమాతో …
Read More »కేరళకు ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే నెలలో కేరళలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు ఆమెను కల్సి ఆహ్వానం పలికారు.జనవరి 2వ తేదీ సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారు. 3వ తేదీన సంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొంటారు.
Read More »కేరళను వణికిస్తోన్న మరో వైరస్
కేరళలో ప్రజలను మరో వైరస్ వణికిస్తోంది. బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావిత ప్రాంతాలతో పాటు కి.మీ. పరిధి వరకు కోళ్లు, బాతులను చంపేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కొట్టాయంలోని అర్పూకర, తలయజమ్ పంచాయతీల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బర్డూ ప్రభావిత ప్రాంతాల నుంచి కోళ్లు, బాతులు, మాంసం అమ్మకాలు, దిగుమతులపై నిషేధం విధించారు.
Read More »జుట్టు ఊడిపోతోందని యువకుడి సూసైడ్!
కేరళలోని ఉత్తర్ కన్నూర్‌లో దారుణం జరిగింది. జుట్టు ఊడిపోతోందని మనస్తాపంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఓ క్లినిక్‌లో మందులు వాడడంతో కనుబొమ్మలపైనా ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోవడంతో యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయమై మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తర కన్నూర్‌కు చెందిన 26 …
Read More »ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
కేరళలోని పాలక్కాడ్ జిల్లా వడక్కంచేరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. బుధవారం అర్ధరాత్రి కేరళలోని ఆర్టీసీ బస్సును.. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల టూరిస్ట్ బస్సు ఢీ కొట్టింది. దీంతో టూరిస్ట్ బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులు, ఆర్టీసీ బస్సులోని 3 ప్రయాణికులు మృతిచెందారు. మరో 36 మందికి తీవ్ర గాయాలు అవ్వగా దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో 12 మంది కండీషన్ …
Read More »ఏనుగుల దెబ్బకి చెట్టెక్కిన యువకుడు.. వీడియో వైరల్!
ఏనుగుల గుంపు పరుగు పరుగున తన వైపునకు రావడంతో ఓ యువకుడు చెట్టెక్కిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. గజరాజుల నుంచి తప్పించుకునేందుకు ఆ యువకుడు ఏకంగా గంటన్నర పాటు చెట్టుపైనే ఉండిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇడుక్కికి చెందిన సాజి అనే యువకుడు స్థానిక చిన్నకనల్ ప్రాంతంలో ఏదో పనిలో ఉండగా ఏనుగులు స్పీడుగా తనవైపు దూసుకొచ్చాయి. దీంతో యువకుడు పరుగులు …
Read More »నక్కతోక తొక్కిన ఆటోడ్రైవర్.. ఒక్క రాత్రిలో కోట్లాధికారి
ఆటోడ్రైవర్‌కు అదృష్టం వరించింది. తాను చేసిన ఒక్క పనికి జాక్ పాట్ కొట్టి కోట్లు దక్కించుకున్నాడు. ఇంతకీ ఆటోడ్రైవర్ ఏం చేశాడో తెలుసా.. కేరళ రాజధాని తిరరువనంతపురానికి చెందిన ఆటో డ్రైవర్ అనూప్. శ్రీవరాహం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఓనం పండగ సందర్భంగా శనివారం అనూప్ ఓ లాటరీ టికెట్ కొన్నాడు. దాంతో ఆదివారం ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. టికెట్ కొనేందుకు నిర్ణయించుకున్న ఆటో డ్రైవర్ మొదట ఓ …
Read More »ఏవండీ.. ఇకపై ఆ జిల్లా బాధ్యత మీదే…!
ఆ ఇద్దరు దంపతులు వైద్యులుగా పనిచేసేవారు. తర్వాత ఇద్దరూ ఐఏఎస్ అధికారులుగా కొలువుతీరారు. తాజాగా భార్య తాను ఇదివరకు పని చేసిన జిల్లా బాధ్యతలను భర్తకు అప్పగించారు. ఎందుకో తెలుసా.. రేణురాజ్ కేరళలోని అలప్పుఝ కలెక్టర్‌గా పనిచేశారు. శ్రీరామ్ వెంకట్రామన్ కేరళ ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. తాజాగా రేణును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేణు స్థానంలో ఆమె …
Read More »కత్తి తీసినా.. ఎస్సై భయపడకుండా కుమ్మేశాడు!
ఓ ఎస్సై దుండగుడితో పోరాడి అతడిని నిలువరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కేరళలో జరిగింది. అలప్పుజ జిల్లా కాయంకులమ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడి ముందు పోలీసులు జీపు ఆపే ప్రయత్నం చేశారు. ఎస్సై అరుణ్‌కుమార్ కిందికి దిగుతుండగా.. దుండగుడు గమనించి వెంటన తన బైక్‌లో ఉంచి కత్తిని బయటకు తీసి ఎస్సైపైకి దాడికి యత్నించాడు. వెంటనే …
Read More »