తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతుందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణములో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నదని చెప్పారు. బతుకమ్మ పండుగ కి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు రంజాన్ క్రిస్మస్ పండుగలకు దుస్తులు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో …
Read More »‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 44వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 44వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్, సురేందర్ నగర్ కాలనీల్లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ దాదాపు 85 శాతం వరకు పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా మిగిలి ఉన్న భూగర్భడ్రైనేజీ, డ్రైనేజీ పూర్తైన వెంటనే సీసీ రోడ్లు, ట్రాన్స్ఫార్మర్ …
Read More »ఈ నెల 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయాన్ని ఈ నెల 30న ప్రారంభం కానున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి అన్ని ప్రభుత్వశాఖల కార్యాలయాల తరలింపును ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. BRK భవన్లో ఉన్న ఫర్నిచర్ తీసుకురావొద్దని, కొత్త సచివాలయంలో పూర్తిస్థాయిలో ఫర్నిచర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు అందుకున్న మహేశ్వర్ రెడ్డి.. ఇవాళ గురువారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. షోకాజ్ ఇచ్చే అధికారం TPCCకి లేదని, తాను పార్టీ మారడం లేదని ఆయన నిన్న స్పష్టం చేశారు. ఖర్గేతో తేల్చుకుంటానని ఢిల్లీ వెళ్లిన ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
Read More »కారేపల్లి ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
తెలంగాణలోని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి సమీపంలో ఊహించని రీతిలో సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలవడం బాధాకరమన్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో వున్న ఎంపీ నామా …
Read More »కారేపల్లి బాధితులకు సరైన వైద్యం అందించాలి- మంత్రి హారీష్ రావు అధికారులకు ఆదేశం
తెలంగాణలోని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందటం బాధాకరం అన్నారు. మృతులు, క్షతగాత్రుల గురించి మంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి, అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరం అయితే క్షతగాత్రులను నిమ్స్ ఆసుపత్రికి తరలించి, …
Read More »నేడు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు బుధవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందును ఇవ్వనున్నది. దీనికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా ఏటా రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంమంత్రి మహమూద్ అలీ మంగళవారం పరిశీలించారు. ఈ …
Read More »జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణలో గ్రామ పంచాయతీల్లో పని చేస్తోన్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలను క్రమబద్ధీకరణ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారిగా వివరాలను ఇవ్వాలని డిపివోలను ఆదేశించింది. కాగా 2019లో ‘రాష్ట్ర వ్యాప్తంగా 9352 మంది జేపీఎస్ నియామకాన్ని చేపట్టిన ప్రభుత్వం వారిని ఇప్పటివరకు రెగ్యులర్ చేయలేదు. దీంతో ఈ నెల 28లోగా రెగ్యులరైజ్ చేయకపోతే సమ్మెలోకి …
Read More »రెండో విడతలో 3.38 లక్షల గొర్రెల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీలో భాగంగా రెండో విడతలో 3.38 లక్షల గొర్రెల పంపిణీకి పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు గొర్రెలు, మేకలు అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బాలరాజు వెల్లడించారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రాన్స్ పోర్ట్ టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.6,100 కోట్లు కేటాయించిందని తెలిపారు. మొత్తంగా 73.50 లక్షల గొర్రెలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read More »మాజీ ఎంపీ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ నుంచి ఇప్పటికైనా తనను సస్పెండ్ చేయడం సంతోషంగా ఉందని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇన్నాళ్లకు దొరల గడీ నుంచి విముక్తి లభించిందని పేర్కొన్నారు. గత కొంతకాలంగా పార్టీతో విభేదిస్తున్న పొంగులేటి.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలతో రాజకీయ వేడిని పెంచుతున్న విషయం తెలిసిందే.
Read More »