తెలంగాణ రాష్ట్రంలో పది పరీక్షలకు రెగ్యులర్ విద్యార్థులు 4 లక్షల 86వేల 194 మంది దరఖాస్తు చేసుకోగా.. 4 లక్షల 84 వేల 384 మంది పరీక్షలు రాశారు. ఇప్పటికే ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో తెలంగాణ ఫలితాల విడుదల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 99.63 శాతం …
Read More »సోనియాగాంధీని బలిదేవత అన్న వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎంప్లాయిమెంట్ పాలసీని ప్రకటించి, దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య పైన అధికారంలో ఉన్నప్పుడు స్పందిస్తే దేశంలో ఇవాళ నిరుద్యోగ సమస్య ఉండేదే కాదన్నారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు. తాము అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్య పట్టించుకోకుండా యువతను కేవలం రాజకీయాలకు మాత్రమే వాడుకోవడం కాంగ్రెస్ పార్టీ కి అలవాటైందన్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో 2.2 లక్షల …
Read More »ఈ నెల 9న ఇంటర్ ఫలితాలు
తెలంగాణలో ఈ నెల 9వ తేదీన మంగళవారం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ …
Read More »మహరాష్ట్రలో బీఆర్ఎస్ సంచలనం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీ మహరాష్ట్రలో రోజురోజుకూ మరింత సంచలనం సృష్టిస్తున్నది. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ రాష్ట్ర నేతల చేరికల జోరు కొనసాగుతున్నది. ఈ క్రమంలో భాగంగా మహారాష్ట్రకు చెందిన ‘భూమి పుత్ర సంఘటన్’ ఆదివారం బీఆర్‌ఎస్‌లో విలీనమైంది. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో సంఘటన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్ వాడేకర్‌తోపాటు నేతలు కిరణ్ వాబ్లే, అవినాశ్ దేశ్‌ముఖ్, అశోక్ అందాలే, …
Read More »పెన్షన్ కు అర్హులైన లబ్దిదారులు అందరికి గుర్తింపు కార్డులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. శనివారం డాక్టర్ BR అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి నగరానికి చెందిన MLC లు, …
Read More »తెలంగాణకు హరితహారం అద్భుతమైన కార్యక్రమం -కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ జావేజ్ అక్తర్
కర్ణాటక రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ జావేద్ అక్తర్ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. తెలంగాణకు హరితహారం, అందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుపై అధ్యయనం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో పర్యటించిన ఆయన దూలపల్లి ఫారెస్ట్ రీసెర్చ్ నర్సరీ, కండ్లకోయ ఆక్సీజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు వెంట పచ్చదనం, అలాగే హైదరాబాద్ లో …
Read More »మొక్కలు నాటిన ఆర్.నారాయణమూర్తి.
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన ప్రముఖ దర్శకుడు,నటుడు,నిర్మాత ఆర్.నారాయణమూర్తి..ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టి ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఎందరినో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ పర్యవరణ …
Read More »మణిపూర్ లోని తెలంగాణ విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక విమాణం ఏర్పాటు
మణిపూర్‌లో నెలకొన్న శాంతిభద్రతల సమస్య నేపథ్యంలో, మణిపూర్ లోని తెలంగాణ విద్యార్థులు, మణిపూర్‌లో నివసిస్తున్న ప్రజల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.మణిపూర్ రాష్ట్రంలోని పరిస్థితిని పర్యవేక్షించడానికి, మణిపూర్‌లోని తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేక సెల్ తెరవబడింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్ మరియు పరిసర ప్రాంతాల్లోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారు. తెలంగాణ విద్యార్థులను ఇంఫాల్ …
Read More »అల్లూరి సీతారామరాజు పోరాటం స్ఫూర్తిదాయకం
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ లో క్షత్రియ సేవా సమితి తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్ ల ఆధ్వర్యంలో మన్యం వీరుడు, భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు గారి 99వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ట్యాంక్ బండ్ పై ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. …
Read More »గాయాల వీణపై అభివృద్ధిరాగాలు
నాడు అశోకుడు చెట్లు నాటించాడనేది ఒక చరిత్ర..కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్వించారనేది మరో గొప్ప చరిత్ర.. ఇవన్నీ మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. ఎన్ని తరాలైనా ఆ చరిత్ర పదిలంగా ఉన్నది. అదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ సృష్టించిన చరిత్ర గురించి కూడా మనం ఒకసారి తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. నాయకులు అందరూ అవుతారు. కానీ ప్రజల మనసుల్లో, భావితరాలకు ఆదర్శంగా నిలిచి చరిత్ర సృష్టించడం ఒక్క కేసీఆర్‌కే సాధ్యమైంది. …
Read More »