తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న గురువారం ప్రగతిభవన్‌లో పురపాలక ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో పురపాలక ఎన్నికలను కొత్త చట్టంతోనే నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 18, 19 తేదీల్లో శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై కొత్త పురపాలక బిల్లును ఆమోదించనుంది. గతంలో ఈనెల 15 లేదా 16 తేదీల్లో ఎన్నికల ప్రకటన ఇచ్చి ఈ నెలాఖరుకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లను చేసిన ప్రభుత్వం తాజాగా కొత్త చట్టం తర్వాతే …
Read More »అభాగ్యుడికి మంత్రి సింగిరెడ్డి భరోసా..!
తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం నరసింగపల్లి గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వారికి చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బాధితుడ్ని పరామర్శించారు. జిల్లా ఏరియా ఆస్పత్రి డాక్టర్ తో మంత్రి మెరుగైన చికిత్స ఇవ్వాలని సూచించారు. బాధితుడ్ని పరామర్శించిన వారిలో వనపర్తి మాజీ మున్సిపల్ …
Read More »నిరుద్యోగ యువతకు టీసర్కారు గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపి కబురును తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా రాష్ట్రంలో గురుకులాల్లో ఉన్న పలు పోస్టుల భర్తీకి సర్కారు పచ్చ జెండా ఊపింది. దీంతో రాష్ట్రంలో బీసీ గురుకులాల్లో ఉన్న 1698ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతులు జారీ చేసింది. గురుకులాల్లో ఉన్న 1071 టీజీటీ,119పీఈటీతో పాటుగా ముప్పై ఆరు ప్రిన్సిపల్ సహా పలు ఇతర పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ …
Read More »సిద్దిపేట హరిత సైనికుల ప్రతిజ్ఞ
రోజురోజుకు వాతావరణంలో ఉష్షోగ్రతలు పెరిగి పోతున్నాయి, ఎండలు మండిపోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవటం లేదు. మానవ మనుగడే దుర్లభంగా మారుతున్నది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినటమే ఈ అనర్థానికి ప్రధానమైన కారణం. ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు, భూ భాగంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణకు హరితహారం అనే పవిత్ర యజ్ఞం చేపట్టారు. విరివిగా చెట్లు పెంచటమే లక్ష్యంగా సాగే ఈ …
Read More »సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
సింగరేణికి చెందిన భూముల్లో అనధికారికంగా ఇళ్లు నిర్మించుకున్న కార్మికులు, కార్మికేతరులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ స్థలాలను రెగ్యులరైజ్ చేసేందుకు అనుమతిచ్చింది. వంద గజాలలోపు స్థలాలను ఉచితంగా అందించనుంది. వెయ్యి గజాల వరకూ మాత్రం నామమాత్రపు ధర చెల్లించాల్సి ఉంటుంది. జగిత్యాల జిల్లాల పరిధిలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్) విస్తరించి ఉంది. ఆయా జిల్లాల్లో కంపెనీకి వేలాది ఎకరాల భూములున్నాయి. ఉద్యోగ, ఉపాధి కోసం కోల్‌బెల్ట్‌లోని వివిధ …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లారని జగన్ ని ప్రశ్నించిన టీడీపీకి దిమ్మతిరిగే సమాధానం
సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు తన బావమరిది హరికృష్ణ శవాన్ని పక్కనే ఉంచుకొని టీఆర్ఎస్‌తో పొత్తుల గురించి ఆపార్టీ నేత కేటీఆర్‌తో చర్చించారని ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా విమర్శించారు. గురువారం ఏపీ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ హాజరుకావడంపై అధికార, విపక్ష పార్టీల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో చంద్రబాబునాయుడు చేసిన కామెంట్స్‌కు జగన్ కౌంటరిచ్చారు. గోదావరి జలాలను …
Read More »దసరా కానుకగా చిన్న కాళేశ్వరం…
రానున్న దసరా కానుకగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తానని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.. బుధవారం రాత్రి ఆయన తన నివాసంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పనులను 2014 వరకు అధికారంలో ఉండి కూడా పూర్తి చేయలే చేయలేదన్నారు. కనీసం అనుమతులు కూడా …
Read More »సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి..
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగుతాయనీ, అదే విధంగా జిల్లాలో కూడా సాగుతాయని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెరాస పాలేరు నియోజకవర్గ స్థాయి సమావేశం మండల పరిధిలో నాయుడుపేటలోని రాంలీల ఫంక్షన్‌హాల్లోలో బుధవారం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, జిల్లా నాయకురాలు స్వర్ణకుమారి వేదికపై కూర్చున్నారు. ఆ తరువాత కొంత సమయానికి ఖమ్మం, …
Read More »4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల విఆర్ ఓ అంతయ్య నాలుగు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా చిక్కాడు. నియోజకవర్గంలోని కేశంపేట మండలానికి చెందిన ఓ భూమి వ్యవహారంలో రికార్డుల్లో బాధితుని పేరు నమోదు చేయడానికి 8 లక్షల రూపాయలను డిమాండ్ చేశాడని తెలిసింది. అయితే డబ్బుల కోసం బాధితులను బాగా పీడించడంతో వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏసీబీ …
Read More »మాజీ ఎంపీ కవితకి పార్టీ సభ్యత్వం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ,నిజమాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గులాబీ పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. అందులో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని హైటెక్స్ లో మాజీ ఎంపీ కవిత నివాసంలో కలిసి పార్టీ సభ్యత్వం పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ”రాష్ట్ర వ్యాప్తంగా మరియు నిజామాబాద్ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా …
Read More »