తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమ చైతన్యం కలిగిన జిల్లాలో ఒకటి వరంగల్ ..ఈ క్రమంలో ఓరుగల్లు కేంద్రకారాగారం హరితాగారంగా రూపుదాల్చింది. దేశంలోనే అతిపెద్ద జైలు నర్సరీ నిర్వహణ కేంద్రంగా వరంగల్ కేంద్ర కారాగారం ఇప్పు డు సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నది. ఆరు ఎకరాల సువిశాల ప్రాంగణంలో 14 లక్షల మొక్కల పంపిణీ కేం ద్రంగా ఈ నర్సరీ రూపుదిద్దుకున్నది. 50 రకాల పండ్లు, పూలు, ఔషధ మొక్కలతో జైలు ఆవరణ …
Read More »సీఎం కేసీఆర్ కటౌట్లకు జలాభిషేకం
తెలంగాణ రాష్ట్ర వరప్రధాయిని కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాకే అందుతుందని అప్పట్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పిన మాట క్షేత్రస్థాయిలో వాస్తవరూపం దాల్చింది. కాళేశ్వరం నుంచి మొట్టమొదటిసారిగా జిల్లాలోని కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామంలోని కొచ్చెరువుకు నీళ్లు తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ఆ జలాలతో నిండుతున్న మొట్టమొదటి చెరువు ఇదే. దశాబ్దంన్నరగా చుక్కనీటికి నోచుకోని ఈ చెరువులోకి కాళేశ్వ రం జలాలు …
Read More »తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వాల సంఖ్య 60 లక్షలు
తెలంగాణలో ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదులో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వాల సంఖ్య 60 లక్షలకు చేరుకుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇవాళ్టితో పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం పూర్తయిందని కేటీఆర్ చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై పార్టీ ముఖ్య నాయకులతో కేటీఆర్ ఇవాళ సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. భారీగా సభ్యత్వాల నమోదుకు కృషి చేసిన అందరికీ అభినందనలు. టీఆర్‌ఎస్ సభ్యత్వ …
Read More »హైదరాబాద్ మెడలో మరో మణిహారం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మెడలో మరో మణిహారం చేరనుంది. ఇ-కామర్స్ రంగంలో అగ్రగామి సంస్థ అమెజాన్ నగరంలోని నానక్‌రామ్‌గూడలో ఏర్పాటు చేసిన ప్రాంగణం ప్రపంచంలోనే అతిపెద్దది. పదివేల మందికి ఉపాధి కల్పించేలా పది ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ప్రాంగణం బుధవారం ప్రారంభం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.అమెజాన్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్, సంస్థ …
Read More »పరీక్ష రాసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూర్ శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌ఎం చివరి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్ష రాశారు. హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఎల్‌ఎల్‌ఎం కోర్సులో చేరి దూర విద్యను అభ్యసిస్తున్నారు. ఎల్‌ఎల్‌ఎం దూర విద్యను అభ్యసిస్తున్న జీవన్‌రెడ్డి ఇవాళ ఉదయమే వరంగల్ పట్టణానికి చేరుకున్నారు. కళాశాలలో జరిగిన గ్రూప్ డిస్కషన్లో పాల్గొని పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటి వరకు రాసిన అన్ని సెమిస్టర్లలో ఎమ్మెల్యే …
Read More »జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్-హైటెక్‌సిటీ ప్రయాణికులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెట్రోరైల్ ద్వారా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్-హైటెక్‌సిటీ మార్గంలో ప్రయాణించేవారికి శుభవార్త. ప్రయాణికుల కోసం తగిన సౌకర్యాలను అందిస్తున్న మెట్రో ఇప్పుడు చెక్‌పోస్ట్-హైటెక్‌సిటీ మధ్య ప్రతి 4 నిమిషాలకు మెట్రోరైలును అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రయాణికులు ఎక్కువసేపు వేచిచూడాల్సిన అగత్యం తప్పింది. ఇప్పటివరకు ఆ మార్గంలో ట్విన్ సింగిల్‌లైన్ మెథడ్ కారణంగా ప్రతి 15 నిమిషాలకు ఓ రైలు అందుబాటులో ఉండేది. మంగళవారం నుంచి …
Read More »సిరిసిల్లలో నేడు కేటీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారకరామారావు నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. ఉదయం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.ఈ పర్యటనలో బతుకమ్మ చీరలు, మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధి, వర్క్‌టూ ఓనర్ పథకం, అపెరల్ పార్కు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించనున్నా రు. సమావేశంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, చేనేత జౌళీశాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, టెస్కో జనరల్ మేనేజర్ యాదగిరి, ఇతర అధికారులు …
Read More »బీజేపీ నడ్డా నాటకాలు నడవవు
”తెలంగాణ అడ్డాలో బీజేపీ నడ్డా నాటకాలు నడవవు. ఇతర రాష్ర్టాల్లో వేసిన ఎత్తుగడలు తెలంగాణలో వేస్తే ఊరుకోం. బీజేపీ నేతలు అధికార మత్తులో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. కర్ణాటకలో బీజేపీ చేసిన నాటకాలు ఇక్కడ సాగవు. ఇది కర్ణాటక కాదు.. తెలంగాణ అని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి”. అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి …
Read More »తెలంగాణలో 2వ గ్రామంగా కొండాయిలుపల్లి
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం,నల్లబెల్లి మండలంలోని నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయితీ అయిన కొండాయిలుపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచింది.ఈ గ్రామమంతా ఐక్యతగా రానున్న వినాయకచవితి నేపద్యంలో ఒకేచోట పండుగ జరుపుకుంటామని ఒకే విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని,అది కూడా పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని గ్రామపంచాయితి తీర్మాణం చేసింది. ఇటివల సిద్దిపేట లోని మిట్టపల్లి గ్రామంలో తొలిసారి ఈ తీర్మాణం చేసారు. రాష్ట్రంలోనే ఈ తీర్మాణం …
Read More »రెండు కోట్లకు చేరిన గ్రీన్ ఛాలెంజ్
హరా హై తో భరా హై(పచ్చగా ఉంటే ఇంపుగా ఉంటుంది) అంటూ గత ఏడాది మొదలైన గ్రీన్ ఛాలెంజ్ రెండు కోట్ల మొక్కలు నాటే దాకా చేరుకుంది. ఒకరు మొక్కనాటి మరో ముగ్గురు మొక్కలు నాటి, సంరక్షించేలా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తాను స్వయంగా మొక్క నాటి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, నటుడు నాగార్జున ను …
Read More »