నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్, తపాస్‌పల్లి, గండిపల్లి రిజర్వాయర్లు, కాలువలు, పిల్ల కాలువలపై చందలాపూర్ రంగనాయకసాగర్ నీటిపారుదలశాఖ కార్యాలయంలో అధికారులతో చర్చించారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో కాలువలు, పిల్ల కాలువల భూసేకరణ ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. కాల్వలద్వారా ఎగువ ప్రాంతాలకు సాగునీరు ఎత్తిపోసే అంశంపై చర్చించారు. స్థానికులకు శాశ్వత నీటి వనరుల కోసం పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి కాళేశ్వరం ప్రాజెక్టకుకు సంబంధించిన …
Read More »హైదరాబాద్ లో వలస కార్మికులకు బియ్యం, నగదు పంపిణీ
హైదరాబాద్ నగరంలోని చర్లపల్లిలో వలస కార్మికులకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ ఉదయం బియ్యం, నగదు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 మేయర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పేదలకు స్వచ్చంధ సంస్థలు, దాతలు ఆహారం పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో …
Read More »తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి గిరారాజ్ సింగ్ ప్రశంసలు
స్థానిక పరిస్థితుల దృష్యా లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ ఆయనకు ఫోన్ చేసి తెలంగాణలో లాక్‌డౌన్ పరిస్థితులను గురించి తెలుసుకున్నారు. స్థానిక పరిస్థితుల వల్లే లాక్‌డౌన్ పొడిగించామని తలసాని ఆయనకు వివరించారు. ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇప్పటికే పాడి, మత్స్య, పౌల్ట్రీ, మాంస పరిశ్రమ, రైతులకు మినహాయింపులు …
Read More »ఆ గీత దాటితే.. పట్టివేతే
కంటైన్‌మెంట్‌లో ఉన్నవారిపై నిరంతరం నిఘా పెట్టేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో కొత్తగా రూపొందించిన అప్లికేషన్‌తో ట్రయల్‌ను పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 వేల మంది క్వా రంటైన్లలో ఉన్నారు. వారితో పాటు కంటైన్‌మెంట్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీరందరికీ సంబంధించిన వివరాలతో డేటాబేస్‌ను తయారు చేశారు. కొత్త అప్లికేషన్‌తో క్వారంటైన్ నుంచి ఎవరైనా 50 మీటర్ల పరిధి దాటితే… వెంటనే పోలీసులకు సమాచారం వస్తుంది. అలాగే క్షేత్ర …
Read More »చేతులెత్తి మొక్కిన మంత్రి హారీష్ రావు
మనోహరాబాద్ సరిహద్దు ప్రాంతంలో…తమ స్వ రాష్ట్రాల కు కాలి నడకన వెలుతున్న వలస కార్మికులు.రోడ్డు పై పిల్లలతో నడుచుకుంటూ వెళుతున్న వారిని చూసి కారు ఆపి పరామర్శించిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఐదారు రోజుల నుంచి కాలినడకన ప్రయాణం చేస్తున్నామని, పని, ఆహారంలేదని ..ఈకారణంతో తమ స్వంత రాష్ట్రాలకు బయలుదేరినట్లు చెప్పిన వలస కార్మికులు.వారి మాటలకు చలించిపోయిన మంత్రి. లాక్‌డౌన్ నేపధ్యంలోఎక్కడికి వెళ్లవద్దని…మనోహరాబాద్ …
Read More »విలయంలోనూ విజయమే.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నేలలు కరువు రక్కసితో తండ్లాడినయ్..చుక్క నీరు దొరక్క రైతు మబ్బుమొకాన చూసిండు..కరువు విలయతాండవం చేస్తున్న వేల ఉరికొయ్యన వేలాడిండు..ఒక్క పంట పండితే చాలనుకున్నడు..యాసంగి పై ఆలోచన కూడా లేకుండే..కానీ నేడు స్వరాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.దరిద్రంలో బ్రతికిన రైతు దాన్య రాశులను పండించిండు.ఒక్కపంట పండితే అదే పదివేలు అనుకున్న చోట బంగారు యాసంగి పంటతో పసిడి సిరులు కురిపించిండు.ఉరికొయ్యలు పోయి గుమ్మి నిండా దాన్యంతో రైతు …
Read More »తెలంగాణలో నడి ఎండల్లోనూ తడి ఆరని నేల తల్లి
సాధారణంగా వర్షం పడితేనే చెరువుల్లోకి నీళ్లు. ఆ తర్వాత నాలుగైదు నెలల్లోనే ఖాళీ. ఇక.. ఎండాకాలంలో చెరువు నెర్రెలుబారి మళ్లీ వరుణుడి కోసం ఎదురుచూస్తుంటుంది. తెలంగాణలో ఇది ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడు మండువేసవిలోనూ కృష్ణా, గోదావరి బేసిన్లలోని చారిత్రక గొలుసుకట్టు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వర్షాకాలం మాదిరిగా నిండుకుండల్లా కళకళలాడుతున్నయి. రెండుబేసిన్లలో మొత్తం 43,759 చెరువులకుగాను ఇప్పటికీ రెండువేల చెరువులు అలుగు పారుతున్నాయి. మరో 25 శాతం చెరువుల్లో …
Read More »ప్రజలు, అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి
కరోనా వైరస్ మహమ్మారి ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా ప్రపం చం, దేశం, తెలంగాణలోనూ వ్యాప్తి చెందుతున్నదని, ప్రజలు ఇంతకుముందుకంటే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తిచేశారు. అప్రమత్తతే కొవిడ్ కట్టడికి ఆయుధమని పేర్కొన్నారు. కొవిడ్ వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలు, వైరస్ సోకినవారికి అందుతున్న చికిత్స, లాక్‌డౌన్ అమలవుతున్న తీరు, పేదలకు అందుతున్న సాయం, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »కరోనా వేళ ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు
తెలంగాణలో కొవిడ్-19 లాక్‌డౌన్ కొనసాగుతున్నా.. గంటకొట్టినట్టే అంగన్‌వాడీల ద్వారా గర్భిణుల ఇంటి కి ఠంచన్‌గా పౌష్టికాహారం చేరుతున్నది.. గర్భిణుల ఆరోగ్య స్థితిపై ఏఎన్‌ఎంలు ఎప్పటికప్పుడు వాకబుచేస్తూ సూచనలిస్తున్నారు.. ఆపత్కాలం లో అమ్మఒడి వాహనాలు గడప ముందుకొస్తున్నాయి. కరోనా వేళ ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్యులపై మరింత నమ్మకం ఏర్పడింది.. ఫలితంగా ఏప్రిల్, మే నెలల్లో వందశాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతాయని వైద్యారోగ్య, కుటుంబసంక్షేమశాఖ అంచనా వేస్తున్నది. …
Read More »కరోనా వ్యాప్తి నిరోధానికి ఇదే స్ఫూర్తి కొనసాగాలి
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రస్తుతం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. వైరస్ సోకినవారికి చికిత్స అందించడంతోపాటు వారితో కలిసినవారిని గుర్తించి, క్వారంటైన్ చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరికోతలు, ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లు యథావిధిగా కొనసాగించాలని సూచించారు. కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, లాక్‌డౌన్ అమలు, వ్యవసాయ …
Read More »