తుముకుంట మున్సిపాలిటీ పరిధిలో మరియు కీసరలో దత్తత తీసుకున్న ప్రాంతంలో మంత్రి మల్లారెడ్డి తో కలిసి మొక్కలు నాటిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతుంది .. మొక్కలు నాటే యజ్ఞం ప్రారంభమైంది , అందులో భాగంగా ఈరోజు తుముకుంట మున్సిపాలిటీ పరిధిలోని బిట్స్ పిలానీ వద్ద మరియు తాను దత్తత తీసుకున్న కీసరగుట్ట …
Read More »ఆదర్శంగా ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 5వ డివిజన్ ఖానపురం రోడ్ లో రూ.3.75 కోట్లతో నిర్మించిన రెండు వైపులా డబుల్ రోడ్, సెంట్రల్ లైటింగ్, నూతన బ్రిడ్జి, సైడ్ డ్రైన్ ను మేయర్ పాపాలాల్ గారితో కలిసి ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నడూ లేని విధిగా కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సుందర నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని …
Read More »తల్లిగా బాధగా ఉన్న గర్విస్తున్నాను-సంతోష్ తల్లి
భారత్ – చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు వీరమరణం పొందడంపై ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. అయితే, తమ కుమారుడి మరణంపై ఆ మాతృమూర్తి స్ఫూర్తిదాయకంగా స్పందించారు. ‘‘నా కుమారుడు దేశం కోసం పోరాడి అమరుడైనందుకు సంతోషంగా ఉంది.. కానీ తల్లిగా బాధగానూ ఉంది’ అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారా వీరమాత. తమకు ఉన్న ఒక్కగానొక్క …
Read More »తెలంగాణలో రైతుబంధు మార్గదర్శకాలు ఇవే
తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సాయం విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. వారం, పది రోజుల్లోనే ఈ నగదును రైతులందరికీ బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇందుకనుగుణంగా మంగళవారం మధ్యాహ్నం వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎకరానికి రూ.5వేలు చొప్పున రైతుబంధు సాయం అందించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనల సమయంలో జనవరి …
Read More »తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 269 కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5,675కు చేరుకుంది. తాజాగా మరో నలుగురు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 192కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకు 3,071మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రల్లో 2,412మంది చికిత్స పొందుతున్నారు. …
Read More »సంతోశ్ బాబు కుటుంబానికి అండగా ఉంటాం
భారత – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని… ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం అన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా …
Read More »తెలంగాణలో కరోనా పరీక్షలు చేసే ప్రైవేటు ల్యాబ్స్ ఇవే
అపోలో హాస్పిటల్స్ లాబొరేటరీ సర్వీసెస్, జూబ్లీ హిల్స్ విజయ డయాగ్నొస్టిక్ సెంటర్, హిమాయత్ నగర్ విమ్తా ల్యాబ్స్, చర్లపల్లి అపోలో హెల్త్ లైఫ్ ైస్టెల్, డయాగ్నొస్టిక్ లాబొరేటరీ, బోయినపల్లి. డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్, పంజాగుట్ట పాత్ కేర్ ల్యాబ్‌లు, మేడన్చల్ అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ ల్యాబ్ సైన్సెస్, లింగంపల్లి మెడ్సిస్ పాత్లాబ్స్, న్యూ బోయినపల్లి యశోద హాస్పిటల్ ల్యాబ్ మెడిసిన్ విభాగం, సికింద్రాబాద్ బయోగ్నోసిస్ టెక్నాలజీస్, మేడ్చల్, మల్కాజిగిరి …
Read More »ఉపాధి పని కూలీలకు మంత్రి ఎర్రబెల్లి భరోసా
ఉపాధి కూలీలకు కనీసం రూ.200 లకు తగ్గకుండా ప్రతి రోజూ వేతనం అందేలా చూడాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి నుంచి వరంగల్ అర్బన్ జిల్లాకు వెళ్తున్న మంత్రి మార్గ మధ్యంలో ఉప్పరపల్లి వద్ద ఆగి ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. కూలీలకు మాస్కులు పంపిణీ చేశారు. రోజు వారీగా ఎంత మేరకు ఉపాధి లభిస్తున్నదని …
Read More »పదిరోజుల్లో 50వేల మందికి కరోనా పరీక్షలు
కరోనా మహమ్మారిని రాష్ట్రంలో కట్టుదిట్టంగా కట్టడిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నామని వెల్లడించారు. ప్రైవేటు ల్యాబ్‌లు, ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అనుమతినిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, ధరలు …
Read More »వారికి ఇంటి వద్దనే చికిత్స
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లక్షణాలు లేకపోయిన లేదా కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయిన వారికి ఇంటి దగ్గరనే చికిత్వ నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.. అత్యవసరమైతేనే గాంధీ ఆసుపత్రికి రావాలి.అలాంటి వారికి చికిత్స అవసరం..కరోనా కట్టడికీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. జిల్లా ఆసుపత్రులల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలి..వర్షాకాలం మొదలైన సందర్భంగా సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలని ఆధికారులను …
Read More »