దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి దుబ్బాక ప్రజలకు, రాష్ట్రానికి, టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని తెలిపారు. ఎమ్మెల్యే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ శాసనసభ్యులు,అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి 2:15 గంటలకు తుదిశ్వాస విడిచారు. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన రామలింగారెడ్డి 1961లో మాణిక్యమ్మ, రామకృష్ణరెడ్డి దంపతులకు జన్మించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో …
Read More »తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన నిర్ణయాలివే…!
కేబినెట్ నిర్ణయాలు 1. తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టిఎస్ ఐపాస్ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం తెచ్చింది. దీని వల్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. అయితే ఇలా వస్తున్న పరిశ్రమల్లో తెలంగాణ యువకులకు ఎక్కువ అవకాశాలు దక్కేలా విధానం రూపొందించాలని …
Read More »హైదరాబాద్ నుంచే కరోనాకు టీకా-మంత్రి కేటీఆర్
తెలంగాణ నుంచే కరోనా వైరస్‌కు తొలి టీకా వస్తుందని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న భారత్‌బయోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్‌ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇవాళ సందర్శించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు డాక్టర్ ఎల్లా, శ్రీమతి సుచిత్రా ఎల్లా కూడా పాల్గొన్నారు. భారత్ బయోటెక్ …
Read More »కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనా వైరస్ సోకి మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు కుటుంబీకులు కరోనా పరీక్షలు చేయించారు. ఫలితాల్లో పాజిటివ్‌గా రావడంతో విజయవాడ దవాఖానకు తరలించగా, అక్కడే కన్నుమూశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడుసార్లు ఆయన సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని తన సొంత గ్రామంలోనే …
Read More »సర్కారు దవాఖానల్లో సేవలు భేష్
కరోనా బాధితులకు సర్కారు దవాఖానల్లో గొప్ప సేవలు అందుతున్నాయని, అక్కడి డాక్టర్లు బాగా పనిచేస్తున్నారని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కితాబిచ్చారు. సర్కారు దవాఖానల్లో నమ్మకంగా చికిత్స తీసుకోవచ్చని చెప్పారు. సోమవారం రాఖీ పండుగ సందర్భంగా కరోనా నుంచి కోలుకుని, ప్లాస్మా దానం చేసిన 13 మందికి గవర్నర్ రాఖీలు కట్టి, స్వీట్లు అందించారు. సర్కారు దవాఖానల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అంకితభావంతో సేవలు చేస్తున్నారని అభినందించారు. ప్రైవేటు దవాఖానలుసైతం …
Read More »మంత్రి హారీష్ రావు పిలుపు
అందరం కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొందాం అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పిలుపు ఇచ్చారు. బేగంపేటలోని మానస సరోవర్ హోటల్‌లో మహావీర్, జితో అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జితో కొవిడ్ కేర్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. 100 పడకల ఈ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కరోనా రోగులకు సహనం, మానవత్వంతో చికిత్సలు అందించాలని సెంటర్‌లోని వైద్యులకు, నర్సులకు సూచించారు. ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టడంలో జైనుల సంస్థ ఎప్పుడూ ముందుంటుందన్నారు. …
Read More »మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన జీవితాంతం కృషి చేసిన రాజయ్య, అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడిగా పనిచేశారు. ప్రజల హృదయాల్లో నిలిచి పోతారని సిఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »వంగపండు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు- సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతి వృత్తంగా పాటలు రాశారు.. రాసి పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం…
కరోనా చికిత్స పేరుతో ప్రజల నుంచి సోమాజిగూడ డెక్కన్ ఆస్పత్రి లక్షల్లో వసూలు చేసింది. ఇప్పటికే ఈ ఆస్పత్రికి సంబంధించిన పలు సంఘటనలు వెలుగు చూశాయి. అయితే ఇలా పదే పదే కరోనా రోగులను ఇబ్బంది పెట్టడం, లక్షల రూపాయిలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆ ఆస్పత్రి యాజమాన్యానికి కేసీఆర్ సర్కార్ ఊహించని షాకిచ్చింది. కరోనా వైద్యం అనుమతి రద్దు.. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు డెక్కన్ ఆస్పత్రికి …
Read More »