ప్రస్తుత రాజకీయాల్లో రామలింగారెడ్డి లాంటి నాయకులు అరుదని మంత్రి కేటీఆర్ అన్నారు. కలం వీరుడిగా ఉద్యమానికి మద్దతునిచ్చిన వ్యక్తి రామలింగారెడ్డి అని పేర్కొన్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రామలింగారెడ్డిది గొప్ప వ్యక్తిత్వమని, నిరాడంబరమైన జీవన విధానంతో ఉండేవారని చెప్పారు. అందరితో కలుపుగోలుగా ఉండేవారని తెలిపారు. 2004లో జరిగిన ఎన్నికల సందర్భంగా దొమ్మాట నియోజకవర్గానికి రామలింగారెడ్డి …
Read More »అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి సభ నివాళులర్పించింది. వారి సేవలను సభ్యులు గుర్తు చేశారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సభ్యులతో పాటు అసెంబ్లీ సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కు ధరించారు. కరోనా …
Read More »ప్రణబ్ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం
భారతరత్న, మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలిపింది. ప్రణబ్ మృతి పట్ల సంతాప తీర్మానాన్ని రాష్ర్ట సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రణబ్ మృతి పట్ల తెలంగాణ శాసనసభ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. భారతదేశం శిఖర సమానమైన నాయకుడిని కోల్పోయింది. 1970 తర్వాత దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ ముఖర్జీ పేరుకు …
Read More »సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
*వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశం* కొత్త రెవెన్యూ చట్టం దిశగా కసరత్తు వేగవంతం చేసిన ప్రభుత్వం వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశం మధ్యాహ్నం 12లోగా వీఆర్వోలు.. రికార్డులు అప్పగించాలని ఆదేశం మొత్తం ప్రక్రియ మధ్యాహ్నం 3లోగా పూర్తి కావాలని ఆదేశం సాయంత్రంలోగా కలెక్టర్ల నుంచి సమగ్ర నివేదిక రావాలని సీఎస్ ఆదేశం
Read More »దేశం మెచ్చిన పథకం రైతు బంధు
సాధారణ రైతునుంచి ఆర్థిక, వ్యవసాయ నిపుణులదాకా అందరి మన్ననలు పొందిన పథకం రైతుబంధు. రైతన్నకు ఆర్థికంగా అండ కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం దేశవ్యాప్తంగా సంచలనమే సృష్టిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట రైతుబంధు పథకాన్ని అమలు చేస్తుండగా.. కొన్నిరాష్ర్టాలు అదేబాటలో నడుస్తున్నాయి. అన్నిరాష్ర్టాల వ్యవసాయశాఖ మంత్రులతో ఇటీవల జరిగిన సమావేశంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఈ పథకాన్ని …
Read More »తెలంగాణ ఆర్టీఏలో మరో 6 ఆన్‌లైన్ సేవలు
మీ డ్రైవిగ్ లైసెన్సును రెన్యువల్ చేయించుకోవాలంటే ఇకపై మీరు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లనక్కర్లేదు. ఇంటినుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని.. మీ పనులు ముగించుకోవచ్చు. ఇప్పటికే 5 రకాల సేవలను ఆన్‌లైన్‌లో ఉంచిన రవాణాశాఖ.. తాజాగా బుధవారం మరో ఆరు ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటినుంచే ఆన్‌లైన్‌లో సేవలు పొందవచ్చని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ …
Read More »ఈ నెల 7 నుంచి మెట్రో..
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కేంద్రం విడుదల చేసిన నాలుగో విడత అన్‌లాక్ మార్గదర్శకాల మేరకు ఈ నెల ఏడో తేదీ నుంచి మెట్రో రైళ్లను అనుమతిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది. అయితే బార్లు, క్లబ్బులపై మాత్రం లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ మిగతా చోట్ల అన్ లాక్–4 మార్గదర్శకా లను కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఇటీవల …
Read More »తెలంగాణలో ఆవిష్కరణలకు ప్రాధాన్యం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో గ్రామీణ, వ్యవసాయ ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పిలుపునిచ్చారు. ఔత్సాహిక యువతకు సేవలు అందిస్తున్న స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘టీ హబ్’కార్యక్రమాలను ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, టీ హబ్ కార్యకలాపాలపై మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో …
Read More »కేటీఆర్ అన్ని పదవులకు అర్హుడే
మంత్రి కేటీఆర్ అన్ని పదవులకూ సమర్ధుడేనని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన్ను సీఎం చేయాలనుకుంటే చేస్తారన్నారు. ఉద్యమకారులకు కేసీఆర్ అన్యాయం చేయబోరన్నది తన నమ్మకమని పేర్కొన్నారు. శాసన మండలిలోని తన ఛాంబర్లో సోమవారం సుఖేందర్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని, అయితే ఎన్ని రోజులు నిర్వహించాలన్నది బీఏసీ సమావేశంలో చర్చించి, నిర్ణయం …
Read More »తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్ కీలక పాత్ర
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం ప్రకటించారు. భారతదేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు. 1991లో ఎంపీగా ఉన్న సమయం నుంచి తనకు ప్రణబ్ ముఖర్జీతో అనుబంధం ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. యావత్ తెలంగాణ సమాజం ప్రణబ్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
Read More »