తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజు సభాకార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు జీహెచ్ఎంసీ సహా నగరపాలికలు, శివారు మున్సిపాలిటిల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇక శాసనసమండలిలో విద్యుత్ అంశాలపై చర్చ జరగనుంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మండలిలోనూ తీర్మానం చేయనున్నారు.
Read More »త్వరలో వార్డు ఆఫీసర్ పోస్టుల భర్తీ: మంత్రి కేటీఆర్
త్వరలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ నియామకాలు చేపడతామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మొదటి మూడేండ్లు ప్రొబేషనరీ కాలపరిమితి ఉంటుందని చెప్పారు. వార్డు ఆఫీస్ కార్యాలయాలు కూడా నిర్మిస్తామని తెలిపారు. కార్పొరేటర్, వార్డు ఆఫీసర్ కలిసి పనిచేస్తారని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు శాసనమండలిలో మంత్రి సమాధానమిచ్చారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకున్నా, రాష్ట్రప్రభుత్వం …
Read More »8 బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ ఎనిమిది బిల్లులకు ఆమోదం లభించింది. తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ఆరవరోజు జరిగింది. ఈ సమావేశాల్లో భాగంగా 8 బిల్లులను ప్రవేశపెట్టగా మొత్తం బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. 8 బిల్లులు ఇవే.. 1) తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు- 2020కు అసెంబ్లీ ఆమోదం 2) తెలంగాణ విపత్తు మరియు ప్రజా ఆరోగ్య పరిస్థితి బిల్లు- 2020కు శాసన సభ ఆమోదం 3) తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ …
Read More »కొత్త రెవెన్యూ చట్టంపై శాసన మండలిలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
కొత్త రెవెన్యూ చట్టంపై తెలంగాణ శాసనమండలిలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సుమారు అరగంటకుపైగా మాట్లాడిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేశామని.. కోవిడ్ ప్రభావం వల్ల రెవెన్యూ చట్టం ఆలస్యమైందన్నారు. పాత రెవెన్యూ చట్టంతో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. పాత రెవెన్యూ చట్టంతో చాలా దారుణాలు చూశామని.. వీఆర్వోల విశేషాధికారాలతో చాలా మంది నష్టపోయారని కేసీఆర్ తెలిపారు. మోదీ ప్రభుత్వం నష్టం …
Read More »భూమి పుత్రుడా నీకు వందనం
వీర రుద్రుల భూమి యెవనిది? నీరు ఎవనిది? నింగి యెవనిది? భోగమెవనిది? యోగ మెవనిది? భుక్తి కరువుకు మూలమెవ్వడు? అని 69 తెలంగాణ ఉద్యమం నిగ్గదీసిన నాటి నుంచి.. ప్రశ్నల కొడవళ్లతో తెలంగాణ అలుపులేని పోరాటం చేసింది. అనన్య త్యాగాల ఫలంగా ఫలించిన తెలంగాణ… ఉద్యమ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సమస్యల చిక్కుముడులన్నింటినీ ఒక్కొక్కటిగా విప్పుకొంటున్నది. ఆ ప్రస్థానంలో భాగమే కొత్త రెవెన్యూ చట్టం. మన తెలంగాణ చరిత్రను మలుపు తిప్పగల …
Read More »తెలంగాణలో విప్లవాత్మక ప్రజా చట్టం
తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం అన్నది ఆరంభం మాత్రమేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. అన్ని వర్గాలవారికి భూ సంబంధిత ఇబ్బందులు తొలిగించేలా దశలవారీగా మరిన్ని మెరుగైన విధానాలను తీసుకొని రానున్నామని శుక్రవారం శాసనసభ వేదికగా ప్రకటించారు. శతాబ్దాలుగా ఉన్న భూముల సమస్యలకు సమగ్ర డిజిటల్ సర్వే ఉత్తమ పరిష్కారమని పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో వీలైనంత త్వరగా రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్వే చేస్తామని చెప్పారు. రికార్డులన్నీ పలు సర్వర్ల …
Read More »నగరాభివృద్ధికి రూ. 30 వేల కోట్లు : మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి) కింద చేపట్టిన పనులను రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి సభ ముందు ఉంచారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఎస్ఆర్‌డీపీ కింద 9 ఫ్లై ఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 3 ఆర్‌యూబీ, ఒక వంతెనతో పాటు ఒక కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసినట్లు మంత్రి …
Read More »లక్ష కేసులొచ్చినా వైద్యం చేసే సత్తా ఉంది
తెలంగాణ రాష్ట్రంలో లక్ష పాజిటివ్ కేసులొచ్చినా చికిత్స, వైద్యం అందించే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కరో నా రహిత రాష్ట్రంగా కాకపోయినా వైరస్ చావులు లేని తెలంగాణగా మార్చేందుకు అందరూ సహకారాన్ని అందించాలని కోరారు. ఆరు నెలలుగా తా ను ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తుంటే.. ‘ఏయ్ రాజేందర్, ఎన్ని వందల …
Read More »పంచాది లేకుండా పంపకాలు
తాతల నుంచి వచ్చిన భూములు పంచుడంటేనే పంచాదిలు. తిట్టుకునుడు, కొట్టుకునుడు దాకా పోతయి. కానీ, అట్లోంటి పంచాయితీలకు కొత్త రెవెన్యూ చట్టంతో సర్కారు చెక్ పెట్టింది. వంశపారంపర్య భూమిని (ఫౌతీ) పంచుకొనే హక్కును కుటుంబానికే అప్పగించింది.వారసులంతా కూర్చొని, మాట్లాడుకొని పంపకాలు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నది. లొల్లి.. కొట్లాటలు వారసత్వంగా వచ్చే భూమి పంపకాల్లో గొడవలకు కొదవేలేదు. ప్రస్తుత విధానంలో వారసులు ముందుగా అడంగల్, పహాణీ, పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్‌డీడ్ తదితర …
Read More »రెవిన్యూ చట్టం దేశంలోనే సంచలనం
తెలంగాణ వచ్చిన రోజున ఎంత సంతోషంగా ఉన్నానో.. ఇవాళ అంతే సంతోషంగా ఉన్నా. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి, రైతులకు, నిరుపేదలకు, నోరులేనివారికి అండగా నిలిచే చట్టాన్ని తీసుకొస్తున్నాం. సరళీకృతమైన, అవినీతిరహితమైన ఇంత గొప్ప చట్టాన్ని శాసనసభలో ప్రతిపాదిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నది’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం రాష్ట్ర శాసనసభలో చరిత్రాత్మకమైన రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ భావోద్వేగానికి …
Read More »