రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం చిన్నరావిరాల గ్రామానికి చెందిన కొలన్ సుధాకర్‌రెడ్డి ఇటీవల మరణించాడు. ఆయన భార్య కొలన్ విజయలక్ష్మికి రూ. 5లక్షల రైతుబీమా మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏడీ సత్యనారాయణ, రైతుబంధు …
Read More »కాంగ్రెస్సోళ్ల మాటలను నమ్మే స్థితిలో దుబ్బాక ప్రజలు లేరు
దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రజలను ఏమని ఓట్లు అడుగుతారు?.. రైతులకు కరెంట్ ఇవ్వక మోసం చేసినందుకా.. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని కోర్టులో కేసులు వేసినందుకా?.. కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు ఇచ్చినందుకా?.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రూపాయి ఇవ్వనందుకా?’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచి పనైనా చేశారా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి?.. మీ మాటలు కాయకొరుకుడు మాటలు.. మీ …
Read More »తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి హరీష్ దిమ్మతిరిగే షాక్
బీడీ కార్మికులకు ఇచ్చే రూ.2వేల పింఛన్‌లో కేంద్రప్రభుత్వమే రూ.1,600 ఇస్తున్నదంటూ కమలనాథులు గోబెల్స్‌ను మించి ప్రచారం చేస్తున్నారని ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం అందించే పింఛన్లతోపాటు, కేసీఆర్ కిట్లకిచ్చే డబ్బంతా కేంద్రానిదే అన్నట్టు వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దుబ్బాకలో ఎన్నికల పేరుతో బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ‘బీజేపీనేతలు చేస్తున్న ప్రచారం వాస్తవమైతే, వారు దుబ్బాక బస్టాండ్ సెంటర్‌కు వచ్చి ప్రజల మధ్య నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే …
Read More »మాజీ మంత్రి నాయినికి మంత్రి కేటీఆర్ పరామర్శ
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారక రామారావు పరామర్శించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానకు జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి వెళ్లి నాయినిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్సను అందించాలని కేటీఆర్ డాక్టర్లను కోరారు.
Read More »గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త
వారం రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, ముంచెత్తుతున్న వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుండటంతో బాధితులను ఆదుకొనేందుకు నేనున్నానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభయమి చ్చారు. భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన సోమవారం తెలిపారు. వరద ప్రభావానికి గురైన కుటుంబాలకు ఇంటికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. వర్షాలు, వరదల …
Read More »పటిష్ఠంగా సఖీ కేంద్రాలు
మహిళల సమస్యలన్నింటికి ఒకే కేంద్రంగా పరిష్కారం చేస్తున్న సఖీ కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేశామని, ఈ నెలాఖరు నుంచి అమలు చేయనున్నట్లు రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. సఖీ కేంద్రాలను పటిష్టం చేయడం, మహిళా పాలిటెక్నిక్ కాలేజీ అడ్మిషన్లు, ప్రైవేట్ ఎన్జీవోలలోని బాలికలకు భద్రత, భవిష్యత్ కల్పించడం వంటి అంశాలపై నేడు మహిళాభివృద్ధి, …
Read More »కరోనాను ఎదుర్కోవడంలో దక్షిణాది రాష్ర్టాలలోకెల్లా తెలంగాణ టాప్
కొవిడ్‌ను ఎదుర్కోవడంలో దక్షిణాది రాష్ర్టాలలోకెల్లా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పనితీరును కనబరిచిందని ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ), ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా), ఎఫ్‌టీసీసీఐ (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ స్ట్రీ) పేర్కొన్నాయి. వైరస్ సోకినవారిని గుర్తించడం, వ్యాధి విస్తరణను నియంత్రించడం, బాధితులకు చికిత్స అందించడంలో దక్షిణాదిలోని ఐదు రాష్ర్టాలకన్నా తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని …
Read More »వరద నష్టం రూ.5వేల కోట్లు
భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని చెప్పారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జిహెచ్ఎంసికి 5 …
Read More »తెలంగాణలో కొత్తగా 1,554కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గురువారం రాత్రి ఎనిమిది గంటల వరకు మొత్తం 43,916నమూనాలను పరీక్షించగా 1,554మందికి కరోనా పాజిటీవ్ అని నిర్థారణ అయింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 2,19,224కి చేరింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. అయితే గురువారం ఒక్కరోజే కరోనా చికిత్స పొందుతూ ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1256కి …
Read More »మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమం
తెలంగాణ రాష్ట్ర తొలి హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలోని అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరి 16 రోజులు చికిత్స పొందారు. వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ కూడా వచ్చింది. త్వరలోనే ఆయన …
Read More »