తెలంగాణ రాష్ట్రంలోని బీసీల గురించి కాంగ్రెస్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీలకు యాభైశాతం సీట్లంటూ కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రిజర్వేషన్లపై కోర్టుకు వెళతామనడం.. ఎన్నికల నుంచి కాంగ్రెస్ పారిపోయిందనేందుకు నిదర్శనమని చెప్పారు. హైదరాబాద్ నిర్వహించిన మీడియా సమావేశంలో తలసాని మాట్లాడారు. కేసీఆర్ పాలన బీసీలకు స్వర్ణయుగమని.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలను నిలబెట్టిన ఘనత తెరాసదేనన్నారు. కుల …
Read More »ధరణి సరికొత్త విప్లవం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ నూతన విప్లవాన్ని సృష్టిస్తున్నది. భూక్రయవిక్రయాలు.. సమస్యలతో రైతన్న ఎక్కడా.. ఎలాంటి ఇబ్బందికీ లోనుకాకూడదనే సీఎం కేసీఆర్ సంకల్పాన్ని సాకారంచేస్తున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దన్నుతో సమస్త సమాచారం అందుబాటులోకి వచ్చింది. కనీస పరిజ్ఞానముంటే ఇంటినుంచే భూక్రయవిక్రయాలను నిర్వహించుకొనే సౌలభ్యాన్ని కల్పించింది. సాధారణంగా ఎవరైనా సరే భూమి కొనుగోలుకు ముందుగా అది వివాదాల్లో ఉందా? లేదా? ఏమైనా కేసులున్నాయా? లేవా? వారి వారసులు …
Read More »ఇండ్లు లేని వారందరికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలి
నిరుపేదలైన ఎస్సీలకు రైతుబంధు, బీమాలకు ప్రత్యామ్నాయ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.ఎస్సీల ప్రత్యేక నిధి,ఉప ప్రణాళికల ద్వారా అమలవుతున్న పథకాలు,కొత్తగా ప్రవేశపెట్టాల్సిన కార్యక్రమాల గురించి సంబంధిత ఉన్నతాధికారులతో హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్షించారు. ఎస్సీల సర్వతోముఖాభివృద్ధికి మరింత మెరుగైన ప్రతిపాదనలు, ప్రణాళికలు రూపొందించాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఈ …
Read More »ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కరోనా
తెలంగాణ రాష్ట్రంలోనిమంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కరోనా వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా బుధవారం రాత్రి ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. తన వ్యక్తిగత సిబ్బందితో పాటు తనకు కొవిడ్ రిపోర్ట్‌లో పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం, తన సిబ్బంది క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు.
Read More »మోహిదీపట్నం స్కైవాక్‌కు మంత్రి కేటీఆర్ ఆమోదం
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో హైదరాబాద్‌ను అద్భుతంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దుర్గం చెరువును సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడ నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నగరానికి మణిహారంలా మారింది. ఇప్పుడు అలాంటి మరో స్టీల్ వంతెనను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మెహిదీపట్నం వద్ద పాదాచారుల కోసం స్కై వాక్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. …
Read More »దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది..!
దుబ్బాక ఉప ఎన్నికలో ఇప్పటికే రెండు సార్లు ఫీల్డ్ సర్వే చేసిన సీపీఎస్ టీమ్…పోలింగ్ రోజు కూడా ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది. ఇందులో టీఆర్ఎస్ 47.4% బీజేపీ 35.3% కాంగ్రెస్ 14.7% శాతం, ఇతరులు 2.6% ఓట్లు సాధించే అవకాశముందని అంచనా వేసింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికలో ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని సీపీఎస్ టీమ్ అంచనా వేసింది. …
Read More »నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని త్వరలో నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు ప్రస్తుతం యువత నిరుద్యోగంతో కొంత నిరుత్సాహంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి ఇద్దామనుకునే సమయానికి కరోనా వచ్చిందన్నారు. అటు యువత సైతం వ్యవసాయం చేయడానికి ముందుకొస్తున్నారని, ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్నవారే ఇప్పుడు పండుగ అంటున్నారని ఎర్రబెల్లి చెప్పారు
Read More »ఏక్షణంలోనైన జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితా ఈ నెల 13న రానుంది నవంబర్ 13 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి తెలిపారు. జీహెచ్ఎంసీ లో 150 వార్డులు, 30 సర్కిళ్లు ఉన్నాయని.. ప్రతీ సర్కిల్ కు ఒక డిప్యూటీ కమిషనర్ ఉన్నారు. 150 డివిజన్లకు 150 మంది ROలను …
Read More »తెలంగాణలో కొత్తగా 1,637 కరోనా కేసులు
తెలంగాణలో గత 24 గంటల్లో 45,526 కరోనా టెస్టులు చేయగా 1,637 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,44,143కు చేరింది. ఇందులో 18,100 మంది చికిత్స తీసుకుంటుండగా, 2,24,686 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనాతో ఆరుగురు చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 1,357కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 44,39,856 కరోనా టెస్టులు చేశారు
Read More »అందుబాటులోకి తెలంగాణ సోనా బియ్యం
తెలంగాణ సోనా బియ్యం వినియోగదారులకు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తినేందుకు అనుకూలంగా ఈ బియ్యం ఉండనుండన్నాయి.. ఈ మేరకు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో హైదరాబాద్ కు చెందిన బేపాక్ సంస్థ ఒప్పందం చేసుకుంది. తెలంగాణ సోనా వరి రకాన్ని 2015లో సృష్టించారు
Read More »