దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక డెస్క్ ను ఏర్పాటు చేయనున్నట్లు సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. మహిళ, శిశు భద్రత విభాగం ఆధ్వర్యంలో ఈ డెస్క్ పనిచేస్తుంది. ట్రాన్స్ జెండర్లకు ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని.. అయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇబ్బందులుంటే వాట్సాప్ నంబర్ 949067444కు తెలియజేయాలని సూచించారు
Read More »శ్రమించే అమ్మే.. చదివించే టీచర్.. ఓ అమ్మ కథ మీకోసం..
చదవడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఇదే నిజం. పై చిత్రంలో కన్పిస్తున్న మహిళ పేరు రమ. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం తడ్కల్ నుంచి ఇద్దరు పిల్లలతో కల్సి ఆమె కుటుంబం హైదరాబాద్ మహానగరానికి వలస వచ్చారు. నగరంలోని అంబర్ పేటలో ఉంటోంది. రమ భర్త రమేష్ చెప్పులు కుట్టడం ద్వారా వచ్చే కొద్దిపాటిసంపాదనతో జీవన గడుపుతూ ఉండేవారు. అయితే కరోనా మహమ్మారి ఎందరో …
Read More »ఇంటర్ ఫెయిలైన వారికి శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫెయిలైన వారికి ఇంటర్ బోర్డు ఊరట కల్గించింది. 2020 మార్చి పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరికి మే నెలలో నిర్వహించాల్సిన పరీక్షల్లో 70% సిలబస్, 50% ఛాయిస్ వర్తింపజేశారు. ఫస్టియర్ సప్లిమెంటరీతో పాటు సెకండియర్ పరీక్షలు ఒకేసారి రాయాల్సి ఉంటుంది కాబట్టి ఒత్తిడికి లోను కాకుండా ఈ అవకాశం కల్పించారు. సెకండియర్ లో ఫెయిలైన విద్యార్థులను ఇప్పటికే పాస్ చేశారు
Read More »గ్రేటర్ హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అర్గనైజేషన్ (ఎఫ్.ఏ.ఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ లు నగరాన్ని “ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ -2020” గా ప్రకటించాయి. పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచేందుకు తగు జాగ్రత్తలు చేపట్టడం ద్వారా. ఆరోగ్యకరమైన సంతోషకర నగరంగా రూపొందడానికి దోహదపడ్డాయి.
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రగతి అద్భుతం
వ్యవసాయం, విద్యుత్తు, నీటిపారుదలరంగాల్లో తెలంగాణ ఎంతో ప్రగతిని సాధించిందని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రశంసించారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లో పర్యటించిన ఆయన గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రగతిపై సమాలోచనలు చేశారు. కరోనా అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని ఫ్లెమింగ్ అడిగి తెలుసుకున్నారు. తాను స్వయంగా స్థానికంగా పర్యటించి, అమలవుతున్న …
Read More »రాజస్థాన్ రాళ్లతో తెలంగాణ సచివాలయం
తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణంలో రాజస్థాన్ రాళ్లను వినియోగించనున్నారు. పార్లమెంట్ లో ఉన్న ఫౌంటెయిన్ల మాదిరే ఇక్కడా ఏర్పాటు చేయనుండగా రాజస్థాన్ లోని ధోల్పూర్ రాతిని తెప్పించాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. భవనం మధ్య భాగంలో బీజ్ రంగు రాతి పలకలను వినియోగించేలా నమూనాలను రూపొందించారు. రాజస్థాన్ వెళ్లి యంత్రాల ద్వారా చెక్కించిన రాతి పలకలను కాకుండా మనుషులతో చెక్కించినవి పరిశీలించాలని సీఎం సూచించారు.
Read More »హమాలీల ఛార్జీలు పెంపు
తెలంగాణలో పౌరసరఫరాల సంస్థ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీల ఛార్జీలు పెంచుతున్నట్లు ఆ సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ పెంచిన హమాలీల ఛార్జీలు 2021 జనవరి నుంచి అమలు చేస్తామని ఆయన వెల్లడించారు
Read More »ఎంపీ రేవంత్ సంచలన నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ ఎంపీ,ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడేళ్ల పాటు తాను రైతుల కోసం ఉద్యమిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల అకౌంట్లలో వేస్తున్న సొమ్ము వారి అప్పుల వడ్డీకే సరిపోతుంది తప్ప పెట్టుబడికి సాయపడటం లేదన్నారు. ఫార్మాసిటీ పేరుతో ప్రజల భూములు లాక్కుని ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ …
Read More »తెలంగాణలో కొత్తగా 1400 వైద్యుల పోస్టుల భర్తీ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1400 వైద్యుల పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందులో.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులకు పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యే 500 పోస్టులతో పాటు ఇప్పటివరకూ భర్తీ జరగని 900 వైద్య పోస్టులు ఉన్నాయి. తెలంగాణ వైద్య సేవల నియామక మండలి ఆధ్వర్యంలో వీటిని భర్తీ చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఇక నుంచి ఏడాదికి కనీసం రెండుసార్లు నియామక ప్రక్రియ జరగనుంది.
Read More »తెలంగాణలో విద్యా వాలంటీర్ల నియామకాలు
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభమైన నేపథ్యంలో.. 9, 10 తరగతులకు బోధించేందుకు 4,967 మంది అదనపు టీచర్లు కావాలని విద్యాశాఖ తెలిపింది. దీనిలో ప్రాథమికోన్నత పాఠశాల నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన 2,816 మంది టీచర్లు ఉండగా, ఇంకా 2,151 మంది కావాల్సి ఉంది. దీంతో విద్యా వాలంటీర్ల నియామకాలకు అనుమతివ్వాలని. ఒక్కొక్కరికి నెలకు రూ.12వేల చొప్పున వేతనం చెల్లించాలని విద్యాశాఖ ప్రతిపాదనలు …
Read More »