తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న సీనియర్ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి గెలుపు పై మాజీ మంత్రి,భువనగిరి ఎంపీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్ మహానగరంలో జరిగిన అంబర్ పేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ” నాజీవితం కాంగ్రెస్ పార్టీకే అంకితం. …
Read More »టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ ఆస్తులు ఎంతో తెలుసా..?
తెలంగాణ రాష్ట్రంలో ఏఫ్రిల్ పదిహేడో తారీఖున జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య తనయుడు నోముల భగత్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసి పార్టీ బీ ఫాం కూడా ఇచ్చారు. నిన్న మంగళవారం మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,సీనియర్ నేత ఎంసీ కోటిరెడ్డిలతో కల్సి భగత్ నామినేషన్ దాఖలు చేశారు. …
Read More »మాజీ మంత్రి జానారెడ్ది ఆస్తులు ఎంతో తెలుసా..?
ఏఫ్రిల్ పదిహేడో తారీఖున జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ మాజీ మంత్రి అయిన కుందూరు జానారెడ్డి బరిలోకి దిగుతున్న సంగతి విదితమే. నిన్న మంగళవారం మార్చి ముప్పై తారీఖున జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో ఆయన తనకు ,తన కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తుల వివరాలను …
Read More »తెలంగాణ ఏర్పాటుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఏర్పాటు గురించి ఏపీ మంత్రి,ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి అప్పట్లో టీడీపీ అధినేత,నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవీ ఇచ్చి ఉంటే తెలంగాణ ఏర్పడదు.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు తన మంత్రివర్గంలోకి …
Read More »కరోనా సమయంలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ రైతులు శుభవార్త చెప్పారు. యాసంగిలో వరి ధాన్యం పూర్తిగా ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. కరోనా కారణంగా.. గతేడాదిలాగే కొనుగోలు చేస్తామని, 6,408 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొనుగోలులో కనీస మద్దతు ధర కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు ధాన్యం 17% తేమ మించకుండా తీసుకురావాలని రైతులకు సూచించారు. వచ్చే వర్షాకాలం 40లక్షల ఎకరాల్లో పత్తి పండించాలన్నారు.
Read More »కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో కవిత కరోనా టీకా మొదటి డోసు వేయించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు సూచించారు. అర్హులైన ప్రతిఒక్కరు టీకా తీసుకోవాలని కోరారు. ఇటీవల కవిత భర్త అనిల్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెతోపాటు కుటుంబ సభ్యులంతా …
Read More »నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరంటే..?
తెలంగాణ రాష్ట్రంలో ఏఫ్రిల్ 17న జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ పోటీ చేసే అవకాశం ఉంది. ఇతరులూ టికెట్ ఆశించినా.. నేతల అభిప్రాయం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నరు సీఎం కేసీఆర్… నోముల నర్సింహయ్య వారసుడికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై ఇవాళ ప్రకటన చేయనున్నారు.. ఇక బీజేపీ నుంచి …
Read More »తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖలో 10వేల ఉద్యోగ ఖాళీలు
తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ శాఖల్లో 10వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తేల్చారు అధికారులు ఇందులో గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులు 7వేలకు మించి ఉన్నాయి. త్వరలో 50వేల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న సర్కార్ నిర్ణయం మేరకు ఖాళీలను గుర్తించి వివరాలు సిద్ధం చేశారు. ఇక రాష్ట్రంలో వైద్య, పంచాయతీ గురుకుల, పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆయా శాఖల పరిధిలో.. మిగతా శాఖల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు
Read More »తెలంగాణలో భారీగా కరోనా కేసులు
తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయి తాజాగా.. రాష్ట్రంలో 535 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,06,339 కి చేరింది. తాజాగా మరో ముగ్గురు కొవిడ్ తో మరణించారు. మొత్తం మరణాలు 1688కి పెరిగాయి. మరో 278 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక యాక్టివ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మార్చి ఒకటో తేదీకి రాష్ట్రంలో 1907 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. నేటికి ఆ సంఖ్య 4,495కి పెరిగింది.
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ హోళీ పండుగ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ హోళీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, కరోనా వైరస్ మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు వీధుల్లో గుంపులుగా చేరకుండా ఎవరి ఇండ్లలో వారే ప్రశాంతంగా పండుగ చేసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడటంవల్ల కరోనా మహమ్మారి మరింత వేగంగా ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైరస్ కట్టడిలో తమ వంతు …
Read More »