దేశంలోనే తొలిసారిగా ఆక్సిజన్ సరఫరా కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు ఈ ఉదయం బయల్దేరి వెళ్లాయి. 8 ట్యాంకుల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు యుద్ధ విమానాలు తీసుకురానున్నాయి.
Read More »GWMC ఎన్నికలు-అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 66 డివిజన్లకు గానూ తొలి జాబితాలో 18 డివిజన్లకు టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ వెల్లడించింది. తొలి జాబితా అభ్యర్థులకు బీ ఫారాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు. 2వ డివిజన్ – బానోతు కల్పన సింగులాల్ 5వ …
Read More »సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యులు క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. సీఎంకు కొవిడ్ లక్షణాలు పూర్తిగా పోయాయని, ఆక్సిజన్ లెవల్స్ బాగానే ఉన్నాయని ఆయన వెల్లడించారు.సీఎం కేసీఆర్‌కు బుధవారం సాధారణ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. సిటీ స్కానింగ్‌లోనూ ఎలాంటి సమస్య కనిపించలేదని తెలిపారు. త్వరలోనే ఆయన విధులకుహాజరయ్యే అవకాశం ఉందని ఎంపీ రావు పేర్కొన్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌కు …
Read More »ఇది తెలంగాణ విజయం – మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్ విధానాన్ని కేంద్రం ఆమోదించడం సంతోషకరం అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కొత్త జోనల్ విధానానికి ఆమోదం పొందడం తెలంగాణ విజయం అని అన్నారు. ప్రభుత్వ నియామకాల్లో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. కొత్త జోనల్ విధానంతో యువత న్యాయమైన వాటా పొందొచ్చు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Read More »తెలంగాణలోని టీచర్లకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు
తెలంగాణలోని టీచర్లకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ యోచిస్తోంది. మే 26 చివరి వర్కింగ్ డే అని ఇది వరకు ప్రభుత్వం ప్రకటించింది. అయితే పది పరీక్షలను రద్దు చేసినా, టీచర్లు మాత్రం రోజూ డ్యూటీకి హాజరవుతున్నారు. కరోనా నేపథ్యంలో సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో ఏప్రిల్ 23ను చివరి పని దినంగా నిర్ణయించి, 24 నుంచి సెలవులు …
Read More »తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త
తెలంగాణలో కొత్త జోన్ల విధానం ఖరారు అయిన సంగతి విదితమే..దీంతో ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్-1, 2, 3 సహా ఇతర పోస్టుల భర్తీకి లైన్ క్లియరైంది. ఇక ప్రభుత్వ శాఖలు రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఖరారు చేయగానే నోటిఫికేషన్లు రానున్నాయి. గ్రూప్-1 వంటి పోస్టులు జోన్ల కారణంగానే భర్తీకి నోచుకోలేదు. ఇప్పుడిక 4వేలకుపైగా పోస్టులు పడే ఛాన్సుంది. ప్రభుత్వం చెప్పిన 50వేల ఉద్యోగాలకూ కొత్త జోనల్ …
Read More »తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో భారీగా కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,542 పాజిటివ్ కేసులు నమోదవగా.. 20 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా 2,887 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 యాక్టివ్ …
Read More »రాత్రిపూట కర్ఫ్యూతో ఏమి లాభం – విక్రమార్క భట్టీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూతో ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. జన సంచారం తక్కువగా ఉండే రాత్రి సమయంలో కర్ఫ్యూ పెట్టి ఏం లాభమని పశ్నించారు. ఈ నిర్ణయం కరోనా వ్యాప్తిని ఎలా అడ్డుకోగలదో అర్థం కావట్లేదన్నారు. కరోనా కట్టడికి పగటి పూట కర్ఫ్యూ విధించాలని సూచించారు. కనీసం 144. సెక్షన్ విధించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. …
Read More »తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు..!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఏటా వైభవంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా కారణంగా సామూహికంగా జరుపుకోలేక పోతున్నామని పేర్కొన్నారు. భద్రాచలంలో రాములోరి కల్యాణాన్ని నిర్వహిస్తున్నామని, భక్తులు టీవీల ద్వారా వీక్షించాలని కోరారు.
Read More »తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీ రామనవమి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువులో శుద్ధ నవమి నాడు ప్రతిఏటా వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా ప్రభావం చేత సామూహికంగా జరుపుకోలేక పోతున్నామన్నారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో పరిమిత సంఖ్యలో దేవాలయ పూజారులు అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న రాములవారి కళ్యాణమహోత్సవాన్ని ఆన్ లైన్ ప్రసారాల ద్వారా సీతారామభక్తులందరూ దర్శించుకోవాలని సిఎం కోరారు. లోక …
Read More »