ఈటెల ను నమ్ముకున్న వాళ్ళ … రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరమే !! రాజకీయంగా ముందు చూపు లేని వాళ్ళే అలాంటి వాళ్ళ వెంట వెళతారు అసలు కేసీఆర్ కు దూరం కావడమే ఈటెల దురదృష్టం అంటున్న రాజకీయ విశ్లేషకులు కనీసం మరో పదేళ్ళపాటు టి ఆర్ ఎస్ కు తిరుగులేదనే అభిప్రాయంతో ఏకీభవిస్తున్న మెజార్టీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ , బీజేపీ కానీ కొత్త పార్టీలు కానీ టి ఆర్ …
Read More »తెలంగాణలో కొత్తగా 3,816 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 3,816 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 27మంది కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 5,892 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 50,969 కోవిడ్-19 యాక్టివ్ కేసులున్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో 658, రంగారెడ్డి 326, మేడ్చల్ 293, కరోనా కేసులు బయటపడ్డాయి. తెలంగానలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
Read More »అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
అన్ని ప్రైవేట్ దవాఖానాల్లో 20 శాతం పడగలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వీటిలో పేదలకు కరోనా వైద్య సేవలు అందించేందుకు వినియోగిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రైవేట్ దవాఖానలలో కరోనా రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేటు దవాఖానలో కొవిడ్ ట్రీట్మెంట్ కోసం పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారని రోగి బంధువులు …
Read More »ప్రైవేట్ ఫీజులపై పర్యవేక్షణ : మంత్రి ఎర్రబెల్లి
కరోనా నియంత్రణ కోసం, వైరస్ బారిన పడిన వారి వైద్య సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లకు అవసరమైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను, ఆక్సిజన్‌ను పూర్తి స్థాయిలో సరఫరా చేస్తోందని చెప్పారు. కరోనా వైద్య సేవల కోసం కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని.. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు …
Read More »తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసిన గ్రీన్ కో సంస్థ
తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది. ఈ మేరకు చైనా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేకంగా విమానంలో వచ్చిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లలను మంత్రి శ్రీ కేటీఆర్ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సమక్షంలో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం …
Read More »నేడు రేపు తెలంగాణలో వ్యాక్సిన్ బంద్
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నేడు, రేపు నిలిచిపోనుంది. కొవిషీల్డ్ తొలి, రెండో డోస్ మధ్య వ్యవధిని 12-16 వారాలకు కేంద్రం మార్చడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను శని, ఆదివారాల్లో నిలిపివేసింది. ఈ నెల 17 నుంచి తిరిగి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Read More »తెలంగాణలో త్వరలోనే ప్రజలందరికీ టీకాలు
సాధ్యమైనంత త్వరగా ప్రజలందరికీ టీకాలు వేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. అవసరమైన వ్యాక్సిన్లను సేకరించేందుకు టీకా తయారు చేస్తున్న స్థానిక, అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. కొవిడ్ నియంత్రణకు అవసరమైన అన్ని మందుల ఉత్పత్తిని పెంచాలని, అందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఫార్మా సంస్థల ప్రతినిధులకు నిన్నటి సమావేశంలో చెప్పారు.
Read More »మంత్రి హారీష్ రావు ఔదార్యం
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఆదేశాలతో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సీటీ స్కాన్ రేట్లు తగ్గాయి. రూ.2 వేలకే స్కాన్ చేసేందుకు డయాగ్నోస్టిక్ కేంద్రాలు అంగీకరించాయి. సీటీ స్కాన్ కోసం రూ. 5,500 వసూలు చేయడంపై మంత్రి హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేట్లను సగానికి తగ్గించాలన్నారు. అందుకు వారు ఓకే చెప్పారు.
Read More »తెలంగాణలో కరోనా కేసుల్లేని ఏకైక గ్రామం అదే..?
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్యపేటలో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, వారానికి 2 సార్లు ఊరంతా శానిటైజేషన్, శుభకార్యాలకు కొద్దిమంది బంధువులకే పిలుపు, ఊర్లోకి ఎవరు వచ్చినా సాయంత్రానికే వెళ్లిపోవడం వంటి పంచాయతీ తీర్మానాలతో ఆ ఊరు భద్రంగా ఉంది. సెకండ్ వేవ్లో ఒక వ్యక్తికి స్పల్ప లక్షణాలు కనబడినా టెస్ట్ …
Read More »భైంసాలో బ్లాక్ ఫంగస్ కలవరం
తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ కి చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్క హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ఆస్పత్రి యాజమాన్యం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఈ ఫంగస్పై స్పందించిన గాంధీ సూపరింటెండెంట్ రాజారావు.. స్టెరాయిడ్స్ తీసుకున్న అందరికీ ఈ సమస్య రాదన్నారు.
Read More »