తెలంగాణలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2,493 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 6,00,318కి పెరిగాయి. వీరిలో 5,74,103 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇంకా 22,759 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు మొత్తం 3,456 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా …
Read More »TRSలో చేరిన BJP నేతలు
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలానికి చెందిన 50 మంది బీజేపీ నాయకులు శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నిజామాబాద్‌లోని ఎమ్మెల్యే ఇంటిలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి టీఆర్‌ఎస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
Read More »రేపు యాదాద్రికి ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రేపు యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ.. రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణతోపాటు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్ కూడా యాదాద్రికి వెళ్తారు. యాదాద్రీశుని దేవాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం పునఃనిర్మిస్తున్న విషయం తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణ నిన్న …
Read More »ఈటల రాజీనామాకు ముహూర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవి రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ నెల 14న ఈటల బీజేపీలో చేరతారని ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. శనివారం నాడు మొదట.. నగరంలోని గన్‌పార్క్ దగ్గర రేపు అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి …
Read More »ఐటీలో తెలంగాణ దేశానికి ఆదర్శం
కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంచి పురోగతి సాధించామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ విధానాలు, సమష్టి కృషితోనే ఇది సాధ్యమయ్యిందన్నారు. సీఎం దార్శనికతతో దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతున్నామని చెప్పారు. నగరంలోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో పరిశ్రమలు, ఐటీ శాఖ వార్షిక నివేదికలను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారదర్శకత కోసం వార్షిక నివేదికలు విడుదల చేస్తున్నామని …
Read More »డయాగ్నస్టిక్ హబ్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి ఐకే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలతో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వైద్యశాలలో రూ. 3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అంందించే …
Read More »ప్రముఖ గేయ రచయిత కందికొండ కు మంత్రి కేటీఆర్ చేయూత
ప్రముఖ గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి మరియు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆయనకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ఆయన ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన చికిత్స వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించి రెండు లక్షల 50 వేల రూపాయల సహాయం అందేలా చూశారు. …
Read More »కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు వైద్య రంగంలో అవసరమైన పలు పరీక్షల కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డయాగ్నస్టిక్ కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ నందు బుధవారం నాడు డయాగ్నస్టిక్ సెంటర్ ను ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారితో కలసి టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ …
Read More »గుండెజబ్బులకూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం
ఇకపై గుండె జబ్బులకూ ప్రభుత్వ ఆసుపత్రిలలో వైద్యం అందించనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.అందుకు అనుగుణంగానే ప్రభుత్వ ఆసుపత్రిలలో గుండె జబ్బులకు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు నిర్వహించ నున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకు సంబంధించిన సిబ్బంది నియామకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో 60 రకాల పరీక్షల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు …
Read More »ప్రజారోగ్యపరిరక్షణ లో తెలంగాణ టాప్
ప్రజారోగ్య పరిరక్షణ లో తెలంగాణా ప్రభుత్వం సత్ఫాలితలు సాధిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముందు చూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడమే అందుకు కారణమని ఆయన చెప్పారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్మించ తలపెట్టిన మెడీకల్ కళాశాల నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని బుధవారం రోజున ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »