తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎన్నమనేని జగన్మోహన్ రావు తల్లి పద్మావతి ఐటీవల మృతి చెందారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రైతు రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి శుక్రవారం జగన్మోహన్ రావును హన్మకొండలోని ఆయన నివాసంలో పరామర్శించారు. పద్మావతి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించారు.
Read More »సీఎం కేసీఆర్ హామీల అమలుకు నిధులు మంజూరు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హామీల అమలుకు నిధులు మంజూరయ్యాయి. సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సీఎం కేసీఆర్ ఇటీవల పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు పురపాలికలు, పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు ఇవాళ నిధులు మంజూరు అయ్యాయి. కామారెడ్డి పురపాలికకు రూ. 50 కోట్లు మంజూరు చేశారు. …
Read More »మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని సంజీవయ్య నగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాటిన మొక్కలను వృక్షంలా నీరు పోసి పెంచాలన్నారు. అనంతరం ఆ ప్రాంతంలో రోడ్డుకు …
Read More »తెలంగాణలో మున్సిపల్ – పట్టణాభివృద్ధి శాఖ వార్షిక నివేదిక విడుదల
తెలంగాణ మున్సిపల్ పరిపాలన – పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి.. 2020-21 సంవత్సరానికి వార్షిక నివేదికను రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జలమండలి ఎండీ దాన కిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
Read More »మరోసారి మానవతను చాటుకున్న మంత్రి కేటీఆర్
గతంలో ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ కి ప్రిపేర్ అవుతూ లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న షాద్ నగర్ కు చెందిన విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.అత్యంత పేదరిక నేపథ్యం నుంచి ఢిల్లీలోని ప్రముఖ లేడి శ్రీరామ్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఐశ్వర్య రెడ్డి లాక్డౌన్ కాలంలో తన కాలేజీ హాస్టల్ ఫీజులతోపాటు ఆన్లైన్ క్లాసులు హాజరయ్యేందుకు అవసరమైన …
Read More »ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి – మంత్రి కొప్పుల
ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొని వచ్చిన ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. ?గురువారం స్థానిక మిని పద్మనాయక కళ్యాణ మండపం లో జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లాప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గోన్నారు. కరోనా రెండవ దశ వ్యాప్తి నేపధ్యంలో గత సంవత్సరం లాగే రైతులకు అండగా ఉండే విధంగా గ్రామాల్లో కొనుగోలు …
Read More »టీడీపీకి ఎల్ రమణ రాజీనామా
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్ రమణ గురువారం ఉదయం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు రమణ పంపారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా, రాష్ర్ట ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను అని రమణ తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా తన ఎదుగుదలకు తోడ్పాటునందించిన …
Read More »ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ ను కలిసిన సోనూసూద్
ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ ను కలిసిన సోనూసూద్..ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్నసేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తు సోనుసూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమన్నారు. హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల …
Read More »బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కరణ
బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కరించింది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. కూలీల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని చాటిచెప్పారు. ఫ్లై ఓవర్ రిబ్బన్ కటింగ్‌ను ఓ కూలీతో చేయించారు. ఆ కూలీ ఎవరో కాదు.. మన వనపర్తి జిల్లాకు చెందిన శివమ్మ. ఆమె గత రెండేండ్ల నుంచి ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో నిమగ్నమైంది. శివమ్మ చేతుల మీదుగా …
Read More »బాలానగర్ ఫ్లై ఓవర్‌కు బాబు జగ్జీవన్ రామ్ పేరు : మంత్రి కేటీఆర్
తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో ఇవాళ ప్రారంభించుకున్న బాలానగర్ ఫ్లై ఓవర్‌కు బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్‌గా నామకరణం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు కేటీఆర్ ఘన నివాళులర్పించారు. బాలానగర్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. బాలానగర్ వాసుల …
Read More »