టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారు. కేటీఆర్ చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటారు. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొంటారు. ఈ నెల 16న ఎల్ రమణ తన అనుచరులు, టీడీపీ నేతలు, పెద్ద …
Read More »మంత్రి గంగుల కమలాకర్ గొప్ప మనసు
ఆపన్నులకు అందుబాటులో ఉంటూ ఆదుకునే కేటీఆర్ గారి చొరవతో మరో కుటుంబానికి అండ దొరికింది, కరీంనగర్‌కు చెందిన కదాసి అనూష కుమారుడు 17 నెలల విశ్వకు రెండు నెలల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. చాలా క్లిష్టమైన ఈ ఆపరేషన్‌కు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు అయింది. బాధిత కుటుంబం సహాయం కోసం మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా అర్థించింది. వెంటనే స్పందించిన కేటీఆర్ స్థానిక మంత్రి అయిన గంగుల …
Read More »మొక్కలు నాటిన మంత్రులు పువ్వాడ,ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ నందు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2వేల పండ్లు, పూలు, వివిధ రకాల మొక్కలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గారు మొక్కలు నాటి ప్రారంభించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, …
Read More »మత్స్యకారులందరికీ బీమా ధీమా
మత్స్య సహాకారం సంఘాల్లో నమోదైన సభ్యులందరికీ ప్రమాద బీమా పథకం వర్తింప జేయనున్నట్టు మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించి మత్స్యకారులు చెల్లించాల్సిన ప్రీమియ మొత్తాన్ని వారి తరఫున ప్రభుత్వమే చెల్లిస్తదని స్పష్టంచేశారు. మరణించిన మత్స్యకార కుటుంబాలకు శనివారం హైదరాబాద్ హరిత ప్లాజాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు. మొత్తం 105 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఇచ్చారు. ఈ సందర్భంగా …
Read More »బ్రాహ్మణుల సంక్షేమం కోసం 112 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. అర్చకుల దగ్గర్నుంచి విద్యార్థులు, నిరుద్యోగుల వరకు వివిధ పథకాలను అమలుచేస్తూ గత నాలుగేండ్లలో రూ.112 కోట్లకుపైగా ఖర్చుపెట్టింది. ఈ ఏడాది జనవరి నాటికి ఈ పథకాల వల్ల 3,637మందికి లబ్ధి చేకూరింది. ఈ ఏడాది బెస్ట్ స్కీమ్ కింద మరో 500మంది నిరుద్యోగులు, వివేకానంద విదేశీవిద్య పథకం కింద 100 మందికి ఆర్థిక సహాయం …
Read More »మాజీ మంత్రి ఈటలపై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్
పదవులన్నీ అనుభవించి తల్లిలాంటి పార్టీని, తండ్రిలాంటి కేసీఆర్‌ను ఈటల రాజేందర్ మోసం చేశాడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. గరీబోళ్ల భూములను కబ్జా చేసి, ఫిర్యాదులపై విచారణకు ఆదేశించగానే పార్టీ ఫిరాయించారని విమర్శించారు. నల్ల చట్టాలను చేసిన బీజేపీలో చేరి దొంగలతో దోస్తానా చేశాడని నిప్పులు చెరిగారు. శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి బాల్క సుమన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ …
Read More »వైఎస్ షర్మిలకు మంత్రి హారీష్ కౌంటర్
తెలంగాణ ఇచ్చేందుకు అదేమైనా బీడీయా? సిగరెట్టా? అంటూ వెటకారాలు చేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసులకు ఈ గడ్డపై స్థానం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సిగరెట్, బీడీలతో పోల్చిన వైఎస్ వారసులకు తెలంగాణ గడ్డ మీద జాగ ఉంటదా? అని ప్రశ్నించారు. శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఎంపీపీ యాదమ్మ, ఆరుగురు సర్పంచ్‌లతోపాటు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో …
Read More »తెలంగాణలోనే తొలిసారిగా మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్ వినూత్న కార్యక్రమం
తనదైన స్టైల్ లో వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు నిత్యం అండగా ఉండే రాష్ట్రంలోని మహబూబాబాద్ మునిపిపాలిటీ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్ త్వరలో ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వారి సన్నిహితుల ద్వారా తెలి సింది. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుం డా ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు అవ సరం. అవి సమయానికి అందక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కులం, ఆదాయం. నివాసం, పుట్టిన …
Read More »ఏపీతోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడి కృష్ణా నీళ్లు అందిస్తాం – మంత్రి కేటీఆర్
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు.. ఏపీతోనే కాదు.. దేవుడితోనైనా కొట్లాడి కృష్ణా నీళ్లు అందిస్తామని రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఉండగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరగనివ్వమని తేల్చిచెప్పారు. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదు.. చట్టప్రకారం రావాల్సిన నీటివాటాను సాధించుకుంటాం అని పునరుద్ఘాటించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తాము అని …
Read More »చిల్డ్రన్స్, సైన్స్ పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్
నారాయణపేట జిల్లాలో రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన చిల్డ్రన్స్, సైన్స్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, …
Read More »