తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహకారానికి ఎల్.రమణ పార్టీలో చేరారని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. తెరాసలో చేరిన ఎల్. రమణకు కేసీఆర్ హృదయపూర్వక స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. తెరాసలో చేనేత వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదన్న లోటు రమణతో తీరిందని చెప్పారు. చేనేత కార్మికులకు రైతు బీమా కోసం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. తెరాస పథకాలు ప్రతి …
Read More »టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లను టీఆర్‌ఎస్ ప్రభుత్వం హ్యాకింగ్ చేయిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన అధికారులు మూల్యం చెల్లిస్తారన్నారు. ఐజీ ప్రభాకర్‌రావు ఖాసిం రిజ్వీ మాదిరిగా వ్యవహరిస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్‌రావుకు పోస్టింగ్ ఇచ్చారన్నారు. ఐజీ ప్రభాకర్‌రావుపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. ప్రధాని మోదీ …
Read More »ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్ష
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి తండ్రి పెద్ది రాజిరెడ్డి గారు అనారోగ్యంతో మరణించడంతో నేడు నల్లబెల్లిలోని పెద్ది నివాసానికి వెళ్లి స్వర్గీయ పెద్ది రాజీ రెడ్డి గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ములుగు జెడ్పీ చైర్మన్ …
Read More »‘సంతోష్ ఫ్యామిలీ దాబా‘ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని మల్లారెడ్డి నగర్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సంతోష్ ఫ్యామిలీ దాబా‘ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు విజయ్ రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు ఇంద్రసేన గుప్త, కస్తూరి బాల్ రాజ్, రషీద్ బైగ్, కమలాకర్, పర్శ శ్రీనివాస్ యాదవ్, ఆబిద్, నవాబ్, మసూద్, …
Read More »శంషాబాద్ టు వైజాగ్ ఆర్టీసీ కార్గో సేవలు
టీఎస్‌ఆర్టీసీ కార్గో సేవలను మరింత విస్తరిస్తున్నది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఏపీలోని విశాఖపట్నం వరకు సేవలను గురువారం ప్రారంభించింది. హైదరాబాద్‌లో బయలుదేరే కార్గో వాహనాలు కనెక్టెడ్ పాయింట్లు కోదాడ, సూర్యాపేట, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, తుని మీదుగా విశాఖపట్నం చేరుకుంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 10 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ కార్గో వాహనాలు పటాన్‌చెరు, మెహిదీపట్నం, లక్డీకాపూల్, సీబీఎస్ నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. వినియోగదారులు తమ …
Read More »సీఎం కేసీఆర్ సమక్షంలో నేడు టీఆర్‌ఎస్ లోకి ఎల్ రమణ
టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎలగందుల రమణ శుక్రవారం టీఆర్‌ఎస్‌లో లాంఛనంగా చేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటల కు తెలంగాణభవన్‌లో నిర్వహించనున్న సభలో సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి ప్రసంగిస్తారు. ఈ నెల 8న సీఎం కేసీఆర్‌తో సమావేశమైన అనంతరం రమణ టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతులమీదుగా …
Read More »తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం తెలిపారు. జూలై 26 నుంచి 31 తారీఖు …
Read More »తెలంగాణలో పల్లెలకు పునర్జీవం
ప్రజల ఆసక్తులు, ప్రజా ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. సామాజిక చైతన్యం కొరవడిన చోట ప్రజల ఆసక్తులు కేవలం వ్యక్తిగత లబ్ధితో ముడిపడి ఉంటాయి. ఇలాంటప్పుడే పాలకులకు దీర్ఘ దృష్టి, సామూహిక చింతన, మానవీయ దృక్కోణం ఎంతో అవసరం. అలా ఉంటేనే ప్రజా ప్రయోజనాలు నెరవేర్చేపథకాలు అమల్లోకి వస్తాయి. సమాజ సంక్షేమం కోసం, దళితులను, వెనుకబడిన తరగతుల ప్రజలను అభివృద్ధి వైపు నడిపించటం కోసం పడుతున్న తపన, ఆరాటం కేసీఆర్ రూపొందించిన …
Read More »ఎమ్మెల్యే భగత్ విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ సానుకూల స్పందన
నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ గురువారం రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని హాలియా, సాగర్ మున్సిపాలిటీల అభివృద్దికి రూ.5 కోట్ల చొప్పున అదనంగా నిధులు కేటాయించాల్సిందిగా కోరారు. అదేవిధంగా హాలియా మున్సిపాలిటీలో మెయిన్ డ్రైనేజ్, మినీ స్టేడియానికి నిధులను కేటాయించాల్సిందిగా విన్నవించారు. ఎమ్మెల్యే భగత్ విజ్ఞప్తులపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు నిధుల విడుదలకు హామీ ఇచ్చారు. దీనిపై …
Read More »తిరుమణి కొండల్ కుటుంబాన్ని ఆదుకుంటాం : మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంతో పాటు పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన నల్లగొండ జిల్లా చండూరు మండలానికి చెందిన దివంగత తిరుమణి కొండల్ కుటుంబాన్ని ఆదుకుంటామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారక రామారావు అన్నారు. కొండల్ ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇటీవలే మృతిచెందాడు. బాధిత కుటుంబం సాయం కోరుతూ బుధవారం మంత్రి కేటీఆర్‌ను తెలంగాణ భవన్‌లో కలిసింది. తన భర్త కొండల్ 2001 …
Read More »