తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మానవత్వం చాటుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఆరెపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువకుడిని కాపాడారు. శనివారం ఆయన ఎంపీ బండా ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించి తిరిగి వస్తుండగా, ఆరెపల్లి వద్ద ఒక యువకుడు ప్రమాదంలో గాయపడి, రోడ్డు పక్కన పడి ఉండటం గమనించారు. వెంటనే …
Read More »ఈటల రాజేందర్ కి షాక్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డికి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో చేదు అనుభవం ఎదురైంది. శనివారం సాయంత్రం హుజూరాబాద్‌లోని గ్యాస్ గోదాం ఏరియాలో ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఓ వ్యక్తి గతంలో తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించాడు. ఇటీవల ఈటల పంపిణీ చేసిన గోడ గడియారాన్ని నేలకేసి బాది ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఓట్లు అడిగేందుకు వస్తే తరిమికొడతానని హెచ్చరించాడు. వివరాలు ఇలా.. పట్టణానికి చెందిన టేకుమట్ల …
Read More »టీఆర్ఎస్ లోకి చేరికలు
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు శనివారం ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటనలో ఉన్న మంత్రి వద్దకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు, మాజీ మార్కెట్ డైరెక్టర్, మైనారిటీ నాయకులు తదితరులు గులాబీ కండువా కప్పుకొన్నారు
Read More »తెలంగాణ రాష్ట్రంలో 19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి
తెలంగాణ రాష్ట్రంలో 19,413 పల్లె ప్రకృతి వనాలు పూర్తి అయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. 99.69 శాతం లక్ష్యం సాధించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. దీనితో పాటుగా 10 ఎకరాల్లో ఒకేచోట ప్రతి మండలానికి ఒక బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటి కోసం 5300 ఎకరాల స్థలాన్ని గుర్తించి ఒక్కోదానికి రూ.40 లక్షలు కేటాయించామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఒక పల్లె …
Read More »‘తెలంగాణ బ్రాండ్’ పేరుతో చేపలు మార్కెటింగ్
తెలంగాణ వ్యాప్తంగా ఉన్నమత్స్యకారులను ఆర్థికంగా ఆదుకొనేందుకు ప్రభుత్వమే వారి నుంచి చేపలు కొనుగోలుచేసి ‘తెలంగాణ బ్రాండ్’ పేరుతో మార్కెటింగ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపల కొనుగోలు, మార్కెటింగ్, ఎగుమతి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. …
Read More »మూడో బోనం నేడే
చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం ఆషాఢ మాసం మూడో బోనం ఆదివారం జరగనున్నది. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల నుంచి తొట్టెల ఊరేగింపు కోటకు రానుందని ఆలయ ట్రస్టు చైర్మన్ కోయల్‌కార్ గోవింద్‌రాజ్ తెలిపారు. కోటలో మూడో బోనం జరుపుకోవడానికి వచ్చే భక్తులకు ప్రభుత్వం తరఫున సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని, భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
Read More »ధరణితో రైతుల సమస్యలు పరిష్కారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఆధారంగా పెండింగ్ మ్యుటేషన్లు వేగంగా పరిష్కారం అవుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 99.65 శాతం పరిష్కారమయ్యాయి. అదనంగా రూపాయి చెల్లించాల్సిన, ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేకుండానే ప్రక్రియ పూర్తవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో రిజిస్ట్రేషన్ జరిగి మ్యుటేషన్ చేసుకోని భూములకు డబుల్ రిజిస్ట్రేషన్లతో భూ వివాదాలు తలెత్తేవి. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం గతేడాది నవంబర్ చివరి వారంలో ధరణి …
Read More »కేంద్రంపై పోరాడాలి- సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం ప్రగతి భవన్ లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో ప్రస్తావించాల్సిన తెలంగాణ అంశాలు, సమస్యలపై సిఎం కెసిఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపై సిఎం వారితో చర్చించారు. ముఖ్యంగా…సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వకూడదని …
Read More »వెనుకబడిన తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త
వెనుకబడిన తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త తెలిపింది. ఇప్పటివరకూ బీసీ గురుకులాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచితవిద్య పొందుతుండగా, తాజాగా ఇంటర్మీడియట్ ను కూడా అక్కడే చదివేలా అన్ని ఏర్పాట్లకు సిద్ధమైంది. ఈ ఏడాది 119 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు తెలిపారు. బీసీ గురుకులాలపై శుక్రవారం …
Read More »దత్తత గ్రామానికి రూ.6కోట్లు మంజూరు
తన దత్తత గ్రామమైన కీసరలో సమస్యల పరిష్కారానికి మొదటి విడతగా రూ.6 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు తెలిపారు. ఈనెల 1 నుంచి 10వరకు కీసర గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంతోష్‌కుమార్ కీసర గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి విధితమే. అదే సమయంలో గ్రామాభివృద్ధికి ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నానని, గ్రామంలో నెలకొన్న …
Read More »