జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేనేత మరియు జౌళి శాఖ అధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాల భవనంలో సభ నిర్వహించారు..ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారు పాల్గొని మాట్లాడారు…జాతీయ చేనేత దినోత్సవ వేడుకలుజాతీయ చేనేత దినోత్సవం ఆగష్టు 7న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు.. భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి,జాతీయ చేనేత దినోత్సవం స్వాతంత్య్ర సమపార్జనకు …
Read More »తెలంగాణ నేతన్నలకు దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు : మంత్రి కేటీఆర్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవాన్ని ( National Handloom Day ) తెలంగాణలో ఘనంగా జరుపుకుంటున్నాం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ నేతన్నలకు దేశంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉందని స్పష్టం చేశారు.నగరంలోని పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ( National Handloom Day ) నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ …
Read More »నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుంది-సీఎం కేసీఆర్
జాతీయ చేనేత దినోత్సవం ( National Handloom Day ) సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ప్రత్యేక కళ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో చేనేత రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ది చేసుకుంటూ వస్తున్నదన్నారు. మారిన సాంకేతిక యుగంలో పవర్ లూమ్‌లు నడుపుతూ వాటిలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతున్నదన్నారు. ప్రభుత్వ దార్శనికతతో, మంత్రి …
Read More »రైతు బీమాకు రూ. 800 కోట్లు విడుదల
తెలంగాణలో రైతు బీమాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.800 కోట్లు విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రైతుబీమా కోసం రైతుల పక్షాన చెల్లించాల్సిన ప్రీమియం కోసం రూ. 800 కోట్లను ముందస్తుగా విడుదల చేసింది.ఈ మేరకు బడ్జెట్ విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రీమియం గడువు ఈ నెల 13వ తేదీతో ముగుస్తుంది. 14వ తేదీ నుంచి కొత్త ప్రీమియం …
Read More »కృష్ణా, గోదావరి జలాల వాటాపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష
కృష్ణా గోదావరి బోర్డుల పరిథిని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించిన నేపథ్యంలో, త్వరలో ఏర్పాటయ్యే బోర్డుల సమావేశాల్లో తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహం పై ప్రగతి భవన్ లో శుక్రవారం సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో అత్యున్నత సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణకు హక్కుగా కేటాయించబడిన న్యాయమైన నీటివాటాల కు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులను క్షుణ్ణంగా మరోసారి ఈ సమావేశంలో సమీక్షించారు. కేంద్రం జారీ …
Read More »దుబ్బాక ఓ మంచి ఉద్యమ నేతను కోల్పోయింది
దుబ్బాక ఓ మంచి ఉద్యమ నేతను కోల్పోయిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాకలోని తెలంగాణ విగ్రహం వద్ద దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సోలిపేట చిత్రపటానికి ఎంపీ, సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత, కుటుంబీకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పోరాడిన సోలిపేట రామలింగారెడ్డి …
Read More »రూ. 1280 కోట్లతో 17 ఎస్టీపీలు
హైదరాబాద్ మహానగరంలోని ఫతేనగర్‌లో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 317 కోట్లతో 100 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రూ. 1280 కోట్లతో 17 ఎస్టీపీలు నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు. 17 ఎస్టీపీ కేంద్రాల్లో 376.5 ఎంఎల్‌డీల మురుగునీరు శుద్ధి చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
Read More »టీఆర్‌ఎస్‌తోనే దళితుల అభివృద్ధి
టీఆర్‌ఎస్‌తోనే దళితుల అభివృద్ధి సాధ్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకం అమలు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి టీఆర్ఎస్ ఎస్సీ సెల్ నేతలు పాలాభిషేకం చేశారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పట్ణంలోని మినీ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. దళితుల కోసం ప్రభుత్వం …
Read More »ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన
ఆచార్య కొత్త పల్లి జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 87 వ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఉన్నజయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ స్ఫూర్తి, వారి భావ …
Read More »జయశంకర్ సారు ఆశయసాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన నిరంతర కృషిని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరచిపోదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను అనేక వేదికల ద్వారా తన గళాన్ని వినిపించారని, తెలంగాణ భావజాల వ్యాప్తికి జయశంకర్ …
Read More »