ప్రకృతిలో భాగమై నివసించే ఆదివాసీలు అత్యంత స్వచ్ఛమైన మనుషులని, మానవ సమాజంలో ఇంకా తరిగిపోని మమతానురాగాలకు, కల్మశంలేని మానవీయ సంబంధాలకు ప్రతీకలని సీఎం కేసీఆర్ కొనియాడారు. స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. అటవీ భూముల సర్వేను చేపట్టడంతో పాటు.. త్వరలోనే పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించనున్నామని చెప్పారు. పోడు భూములకు కూడా రైతుబంధును అందిస్తున్నామన్నారు. …
Read More »కళ్యాణ లక్ష్మీ ,షాదీ ముబారక్ చెక్ లను అందించిన ఎమ్మెల్యే నోముల భగత్
తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో గుర్రంపోడు మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణలక్ష్మి/షాదీముభారక్ 86 మంది లబ్ధిదారులకు చెక్ లు అందజేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు…ఎమ్మెల్యే భగత్ గారు మాట్లాడుతూ పేదవారి యింట్లో జరిగే పెండ్లికి ప్రభుత్వం అందిస్తున్న తాంబూలమే కళ్యాణలక్ష్మీ/షాదీముభారక్ లని పేదలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గతంలో నిరుపేదలు పెండ్లి చేయాలంటే అష్టకష్టాలు పడేవారని గుర్తు చేశారు. …
Read More »వేములవాడలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మంగళవారం మంత్రి కేటీఆర్‌ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో చేపట్టే పనుల వివరాలను మంత్రికి అందించారు. అనంతరం మంత్రి కేటీఆర్ వేములవాడ అభివృద్ధిపై సమీక్షించి, అభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ చేశారు. రూ.20కోట్ల విలువైన పనులు ప్రారంభించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు …
Read More »దళితబంధులో ‘భోపాల్’ స్ఫూర్తి…
దళిత బంధు పేరుతో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ఒక చారిత్రక నిర్ణయాన్ని ప్రకటించి కొత్త చర్చకు తెరలేపారు. కొందరు విమర్శిస్తున్నట్టు అది హడావుడిగా తెచ్చిన పథకం కాదు. ఈ పథకంపై ఏడాది కాలంగా ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఇటువంటి పథకం రాబోతుందన్న సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. గడిచిన ఆరు నెలల్లో అనేక చర్చలు, సంప్రదింపులూ జరిపారు. దళిత శాసన సభ్యులు ఇప్పటికే ఒకసారి కడియం …
Read More »హుజూరాబాద్ లో దళితబంధు సంబురాలు
దళితబంధు పథకం అమలుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదలచేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా జారీచేశారు. నియోజకవర్గంలోని దళితులందరికీ వర్తించేలా (సాచురేషన్ మోడ్) పథకాన్ని ప్రభుత్వం చేపడుతున్నదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదలచేసిన నిధులను హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదువేల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందజేసి ఉపాధి కల్పిస్తారు. ఉత్తర్వులు వచ్చిన వెంటనే హుజూరాబాద్ …
Read More »హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
తెలంగాణ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా కేశవరావు, పేదలకు అందించిన న్యాయ సేవలను సీఎం స్మరించుకున్నారు. కేశవరావు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని, సీఎస్ సోమేశ్ కుమార్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
Read More »చేర్యాలలో రూ. కోటి 25 లక్షలతో బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనo
సిద్దిపేట జిల్లా చేర్యాలలో రూ. కోటి 25 లక్షలతో అన్ని హంగులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనo నిర్మిస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇవాళ అంబేద్కర్ కమ్యూనిటీ భవనానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు …
Read More »దళితులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ లో హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఎన్నెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా దళితులను వ్యాపారులుగా మార్చేందుకు దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్నారు ముఖ్యమంత్రి.ఈ క్రమంలో హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం రూ. 500 కోట్లు విడుదల చేస్తూ …
Read More »కుల వృత్తుల మనుగడకు సీఎం కేసీఆర్ పెద్దఎత్తున నిధులు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కుల వృత్తుల మనుగడకు సీఎం కేసీఆర్ పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీకి రూ.10 వేల కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నర్సింగాయిపల్లి కాలనీలో గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పౌల్ట్రీఫాం మాదిరిగానే గొర్రెల పెంపకానికి ప్రోత్సాహకాలు అందించేలా …
Read More »దళిత బంధు ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష
కరీంనగర్ జిల్లా కేంద్రంగా దళిత బంధు పథకాన్ని ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి దళిత బంధు ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. గొప్పగా ఆలోచించి దళితవర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్నేళ్లలో రాలేదన్నారు. …
Read More »