తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకుండానే 10 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలుచేస్తున్నట్టుగానే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో భవిష్యత్తులో రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తామని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు హామీ ఇచ్చారు. రెడ్డి కులస్తుల్లోని పేదలకు కూడా కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్స్ వంటివి అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అన్ని వర్గాల్లోని పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. హుజూరాబాద్‌లో న్యాయానికీ అన్యాయానికీ.. ధర్మానికీ అధర్మానికీ మధ్య …
Read More »పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలి
ఏపీ ప్రభుత్వం అనుమతుల్లేకుండా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్‌నగర్ జిల్లాకు తీరని నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు విజ్ఞప్తిచేశారు. తాము చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులివ్వాలని కోరారు. కేంద్రమంత్రితో సీఎం కేసీఆర్ శనివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ సాగునీటి పారుదలకు సంబంధించిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఏపీ …
Read More »విద్యుత్తు రంగాన్ని పటిష్ఠపరిచేందుకు రూ.32,705 కోట్లు ఖర్చు
కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజలకు సకల సదుపాయాలు సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆయా రంగాల కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. వీటిలో ప్రధానమైనది విద్యుత్తురంగం. రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్ నుంచి గ్రామాల వరకు గంటల తరబడి విద్యుత్తు కోతలు విధిస్తున్న పరిస్థితి. సరైన కరెంట్ సదుపాయం లేక అప్పటికే ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. కరెంట్ కోసం పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసిన పరిస్థితి. కానీ రాష్ట్రం ఏర్పడిన ఆరు …
Read More »డీసీసీబీ మాజీ చైర్మన్ “మువ్వా” మాయాజాలం
ఖమ్మం డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి కోట్లు రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు.. ఖమ్మం NST, రోటరీ నగర్, హెడ్ ఆఫీస్ బ్రాంచ్లలో జరిగిన ఫేక్ డాక్యుమెంట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.. నకిలీ పత్రాలు సృష్టించి భారీ మొత్తంలో కోట్ల రూపాయలు దోచుకున్నారు.. కేటుగాళ్లు ఎంతలా దోచుకున్నారు అంటే ఫారెస్ట్ భూములకు సైతం ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి డబ్బులు కొట్టేశారు.. 2016-2017 సంవత్సరంలో …
Read More »ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ
ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కేసీఆర్ కలవనున్నారు. ఈ భేటీలో రాష్టానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చిస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలలో రెండోసారి షెకావత్‌తో కేసీఆర్ భేటీ అవుతున్నారు. గతంలో ఐదు అంశాలపై షెకావత్‌కి కేసీఆర్ లేఖ ఇచ్చారు. రేపు కేంద్రహోంశాఖ నేతృత్వంలో సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 2వ తేదీన …
Read More »Telangana లో నిన్న ఒక్కరోజే 5 లక్షల మందికి Covid Vaccine
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. నిన్న ఒక్కరోజే ప్రభుత్వ, ప్రయివేటు కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో 5 లక్షల మందికి టీకాలు వేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. శుక్రవారం రోజు మొత్తం 5,02,519 మందికి వ్యాక్సిన్ వేయగా, ఇందులో 3,71,169 మంది ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. 1,31,350 మంది సెకండ్ …
Read More »Civils విజేతలకు మంత్రి KTR శుభాకాంక్షలు
సివిల్స్ -2020 ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని కేటీఆర్ ట్వీట్ చేశారు. 100 లోపు ర్యాంకు సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు 9 మంది ఉన్నారు. వరంగల్‌కు చెందిన శ్రీజకు 20వ ర్యాంకు, వై మేఘస్వరూప్ …
Read More »అసెంబ్లీ ప్రజాసమస్యలపై అర్థంతమైన చర్చకు వేదిక మాత్రమే
అసెంబ్లీ ప్రజాసమస్యలపై అర్థంతమైన చర్చకు మాత్రమే వేదిక అని.. కుస్తీ పోటీలకు కాదనే విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సభ్యులకు సూచించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అన్ని రంగాల్లోనూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలోనూ దానిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించేలా అసెంబ్లీని వీలైనన్ని ఎక్కువ రోజులు నడిపించాలని బీఏసీ (శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ) సమావేశంలో సూచించారు. శుక్రవారం శాసనసభ వాయిదాపడిన …
Read More »కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి మధ్య సరదా సంభాషణ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ముగిసిన అనంతరం అసెంబ్లీ బయట కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి మధ్య సరదా సంభాషణ జరిగింది. రసమయి గొంతు మూగబోయిందని జగ్గారెడ్డి అన్న వ్యాఖ్యలకు సమాధానంగా.. అవసరాన్ని బట్టి బయటకు వస్తుందని రసమయి అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లను గుర్తించి పాడొచ్చని జర్నలిస్టుల సలహాతో కొత్త పీసీసీపై పాట పాడే స్టేచర్ లేదన్నారు. తన పాట తెలంగాణ …
Read More »ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు ఉచితంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంలో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెట్ సిల్వర్ కాంపౌండ్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా …
Read More »