హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల …
Read More »ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం తెలంగాణే- మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో పురోగమిస్తుందని, ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం తెలంగాణే అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగాల ప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ చేపట్టారు. సభ్యులు మాట్లాడిన అనంతరం కేటీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తెలంగాణ యొక్క పారివ్రామిక పురోగతి రెండు మాటల్లో చెప్పాలంటే.. ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా, ఎర్రబస్సు నుంచి …
Read More »మూడు తరాల ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ
మూడు తరాల ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. కన్న కల తీరకముందే తుదిశ్వాస విడిచారు. అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలచిన బాపూజీ.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా తన సర్వస్వం ధారబోసారు. తన జీవిత కాలం అంతా ప్రజల కోసమే పరితపించారు. ఎన్నో ఏండ్లు జైలు జీవితం గడిపారు. ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో 1915 సెప్టెంబర్ 27న జన్మించిన బాపూజీ.. …
Read More »ఎస్ఆర్డీపీ కింద అనేక ప్రాజెక్టులు చేపట్టాం
హైదరాబాద్‌లో చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టు ప్రస్తుత దశపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు. ఎస్ఆర్డీపీ కింద ఇప్పటికే రూ . 19వందల 46కోట్ల 90లక్షలతో 22 పనులు పూర్తి చేశామన్నారు. ఎస్ఆర్డీపీ కింద రూ. 5,693 కోట్ల 51 లక్షల వ్యయంతో 24 పనులు …
Read More »వ్యర్థం నుండి విద్యుత్ ఉత్పత్తి సులభతరమే
నగరీకరణ పెరుగుతున్న కొద్దీ వ్యర్థపదార్దాలు ప్రపంచానికి పెను సవాల్ గా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి వ్యర్థపదార్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి సులబతరమౌతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనీ పురపాలక సంఘాలలో లభించే వ్యర్థ పదార్థాలనుండి సంప్రదాయేతర ఇంధనం ఉత్పత్తి చేసే ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా అంటూ శాసన మండలి సభ్యులు ఊళ్ళోల్ల గంగాధర్ గౌడ్,కే. నవీన్ కుమార్ లతో పాటు అలుగుబెల్లి నర్సిరెడ్డి …
Read More »నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
బిజినపల్లి మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన కాశీం అనే వ్యక్తి గత నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతనికి వెన్నుముక, మరియు నడుము భాగంలో ఎముకలు బాగా దెబ్బతినడంతో వెంటనే ఆపరేషన్ చేయాలని నిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు సూచించడంతో అతని కుటుంబ సభ్యులు వెంటనే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారిని కలవడంతో వెంటనే కాశీం ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నాలుగు లక్షల …
Read More »బీజేపీ వాళ్లు ఓటుకు రెండు వేలు ఇస్తారు
బీజేపీ వాళ్లు ఓటుకు రెండు వేలు ఇస్తారు.. తెల్లారితే వంట గ్యాస్ సిలిండర్ ధర మూడు వేలు పెంచి.. మనవద్ద నుంచే వసూలు చేస్తారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీకి ఓటేస్తే.. పెంచిన ధరలకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని అంటారని, ఈ కారణంతో మంచి నూనె ధరను కూడా లీటరుకు 300 రూపాయల వరకు పెంచుతారని ఎద్దేవా చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విద్యుత్ కనెక్షన్లు, ఇంటి అనుమతుల …
Read More »తెలంగాణ మహిళా చైతన్యానికి ప్రతీక ఐలమ్మ: మంత్రి సత్యవతి
సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ.. తెలంగాణ తెగువకు నిదర్శనమని, మహిళా చైతన్యానికి ప్రతీక అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మాటల్ని తూటాలుగా మలిచి.. దోపిడీదారుల గుండెల్లో ఫిరంగిగా పేలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ జీవితం భవిష్యత్ తరాలకు స్పూర్తిదాయకమైందని చెప్పారు. చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ నివాళులర్పించారు.ఐలమ్మ జయంతి, వర్థంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆమె చేసిన …
Read More »మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ
మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వకారణమని చెప్పారు. సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ …
Read More »ఈటల కంటే రెండేండ్లు ముందుగానే టీఆర్‌ఎస్‌లోకి గెల్లు
అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణతో పోటీపడే రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంటే చెప్పాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో వ్యవసాయాభివృద్ధికి ఏ పథకాలు అమలుచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నిర్మించనున్న రెడ్డి స్కిల్ డెవలప్‌మెంట్ భవనానికి శనివారం …
Read More »