కొద్ది రోజుల క్రితం మణికొండలోని ఓ డ్రైనేజీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రజనీకాంత్ కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రజనీకాంత్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలుపుతూ.. ఆయన కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రజనీకాంత్ మృతి చెందిన ఘటనకు సంబంధించి ఇప్పటికే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. శాఖాపరమైన …
Read More »దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.97 శాతం : మంత్రి Harish Rao
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన నాడు దేశం యొక్క జీడీపీలో మన రాష్ట్రం యొక్క జీఎస్‌డీపీ శాతం 4.06గా ఉండేంది. అయితే గత ఏడు సంవత్సరాల వరుస పెరుగుదలతో దేశం యొక్క జీడీపీలో మన రాష్ట్రం వాటా 4.97 శాతం పెరిగిందన్నారు. దేశం యొక్క ప్రగతి రేటు కంటే మన ప్రగతి …
Read More »Telangana Assembly-భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ చురకలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ చురకలంటించారు. సర్పంచ్‌ల విషయంలో భట్టి మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచ్‌లను పట్టించుకోలేదు. గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచ్‌లకు స్వేచ్ఛ ఇచ్చి, అన్ని హక్కులు కల్పించామన్నారు. శాసనసభలో సభ్యులు సత్యదూరమైన విషయాలు మాట్లాడారు అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ కాదు.. దీర్ఘకాలిక …
Read More »రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని కాలాలపాటు దేశానికి సేవలు అందించేలా రాష్ట్రపతికి భగవంతుడు ఆయురారోగ్యాలు, శక్తిని అందించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.
Read More »నేడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం
మూడు రోజుల విరామం తర్వాత తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు తిరిగి శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రశ్నోత్తర కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, కౌన్సిల్‌లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అధిక మొత్తంలో పంట నష్టం, రైతుకు అపారమైన నష్టం వాటిల్లిందని, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. …
Read More »సంగమేశ్వర ఎత్తిపోతల పథకం కింద 2 లక్షల 19 వేల ఎకరాలకు సాగునీళ్ళు
సంగారెడ్డి జిల్లా పరిధిలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం కింద 2 లక్షల 19 వేల ఎకరాలకు, బసవేశ్వర ఎత్తిపోతల పథకం కింద ఒక లక్షా 65 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతోందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగమేశ్వర ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2,653 కోట్లు, బసవేశ్వర ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1,774 కోట్లతో నిర్మిస్తామని తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై సభ్యులు …
Read More »ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు జాతీయ స్థాయి గుర్తింపుపై -మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు రావడం పట్ల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని మంత్రి పువ్వాడ అభినందించారు.దేశంలోని జిల్లా ఆస్పత్రుల పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ విడుదల చేశారు. …
Read More »‘తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం’ అంటే ఎలా ఉంటుందో రుజువు చేసిన ఈటల రాజేందర్
‘తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం’ అంటే ఎలా ఉంటుందో ఈటల రాజేందర్ రుజువు చేశాడు. అక్కున చేర్చుకొని అందలమెక్కించిన పార్టీకి వెన్నుపొడిచిన రాజేందర్ తనకు అన్యాయం జరిగిందని నమ్మబలుకుతున్నాడు. నిజానికి ఈటలకు పార్టీలో, ప్రభుత్వంలో మరెవ్వరికీ దక్కని ప్రాధాన్యం లభించింది. ప్రజలను ఆదరించి అభివృద్ధి చేయమని పదవులిస్తే.. పార్టీకి, ప్రజలకు ద్రోహం చేశాడు. తన ఆస్తులపెంపుకోసం ఆరాటపడి భూ ఆక్రమణలకు పాల్పడ్డాడు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై …
Read More »ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే నన్నపునేని..
పెరుకవాడకు చెందిన ఆటో డ్రైవర్ వల్లెపు మదుసూదన్ ఇటివల రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.. మదుసూదన్ బార్య లతకు,పిల్లలకు 25 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శివనగర్ లోని క్యాంపు కార్యాలయంలో వారికి అందజేసారు.. వారి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమంలో ఐక్యత ఆటోయూనియన్ బొల్లం సంజీవ్,నాగరాజు,మహేష్,రాజేందర్,కుమార్,నరేష్,రాకేశ్,శివ,కిషోర్,దేవరాజ్,నబి తదితరులు పాల్గొన్నారు..
Read More »తైవాన్ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత
తైవాన్ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇన్వెస్ట్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తైవాన్ – కనెక్ట్ తెలంగాణ స్టేట్ సమావేశంలో మంత్రి కేటీఆర్ వర్చువల్‌గా పాల్గొన్నారు. తైవాన్ – తెలంగాణ మధ్య వ్యాపార వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో పెట్టుబడి అవకాశాలను కంపెనీలకు అవగాహన కల్పించే నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. …
Read More »