యార బాలకృష్ణ అధ్యక్షతన హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కేయూ JAC చైర్మన్ బొల్లికొండవీరెందర్ KU JACకన్వినర్ కత్తెరపెల్లి దామోధర్ మాట్లాడుతూ….ఈటెల రాజేందర్ తన స్వార్థ ప్రయోజనాల కోసమే రాజీనామా చేసాడేగాని నియోజక వర్గ అభివృద్ధి కోసం కాదని…. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలిస్తనన్న మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేస్తూ నిరుద్యోగులనోట్లో మట్టికొడుతుందని…విద్యార్థి ఉద్యమకారుడైన గెల్లు శ్రీనివాస్ ని గెలిపించుకొని అభివృద్ధికి …
Read More »గూగుల్‌కు గుండెకాయ..అమెజాన్‌కు ఆయువుపట్టుగా హైదరాబాద్
గూగుల్‌కు గుండెకాయ..అమెజాన్‌కు ఆయువుపట్టుగా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ కట్టుకథలకు పెట్టుబడులు రావన్నారు. ‘‘పరిశ్రమలు అంటే టాటా బిర్లాలు కాదు…కులవృత్తులు కూడా కుటీర పరిశ్రమలే. ఏడున్నర ఏళ్ల ప్రస్థానంలో తెలంగాణలో స్వర్ణయుగం. ధరణి ఒక సంచలనం. దేశానికి దిక్సూచిగా మారింది. టీఆర్ఎస్ తెచ్చిన ప్రతి చట్టం తెలంగాణ ప్రజలకు చుట్టం. కేసీఆర్ అంటే కాలువలు..కుంటలు..చెరువులు.’’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
Read More »టీఆర్ఎస్ ప్లీనరీలో టీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో ఎన్నారై ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతున్నారని ప్రశంసించారు. రైతుబంధు, దళిత బంధు పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకల్లో టీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు పాల్గొనున్నట్లు మహేశ్ బిగాల తెలిపారు. అలాగే ఎన్నారైలకు మొట్టమెదటి సారి కేసీఆర్ …
Read More »జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం
టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. దళిత బంధు కేవలం రూ.10 లక్షలిచ్చి మమ అనే కార్యక్రమం కాదు అని సీఎం అన్నారు. దళితుల బాగు గురించి అనేక ప్రయత్నాలు జరిగాయని, మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సర్పంచ్‌గా పని చేసిన కాలంలో ఆయన సొంత గ్రామంలో 10 ఎకరాల భూమి(ఇప్పుడు రూ. 50 లక్షల విలువ) …
Read More »బీజేపీకి ఓటువేయడం మన వేలితో మన కన్నునే పొడుచుకోవడమే
పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డివిరుస్తున్న బీజేపీకి ఓటు వేయడమంటే మన వేలితో మన కన్నునే పొడుచుకోవడం అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో సోమవారం ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. వీణవంకలో సమావేశంపెట్టిన బీజేపీ నాయకులు అన్ని మొండి మాటలు.. తొండి మాటలు చెప్పారని ధ్వజమెత్తారు. కేంద్ర సర్కారు …
Read More »కేంద్ర ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
కేంద్ర ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ కూడా రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తుంది అని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేశారు భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలి. గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, బాధ్యత గల పార్టీ అద్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగాభారత ఎన్నికల సంఘానికి ఒక సలహా ఇస్తున్నాను. చిల్లరమల్లర ప్రయత్నాలు …
Read More »దొంగే దొంగ అన్నట్లు ఉంది బీజేపీ తీరు
బీజేపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని దీనిని ప్రజలు గమనించాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ కార్యకర్తలని బీజేపీ నాయకులు ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని, గత పదిహేను రోజులుగా వారి వ్యవహారం చూస్తే అలాగే కనబడుతుందని అన్నారు. దీనికి సంబంధించి తాము ఎలక్షన్ కమిషన్ తో పాటు …
Read More »వరుసగా 9వ సారి గులాబీ దళపతిగా కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి ప్లీనరీ వేదికగా ప్రకటించారు. అనంతరం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ మొత్తం 18 సెట్ల నామినేషన్లు దాఖలైన …
Read More »రాజీలేని పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నాం – సీఎం కేసీఆర్
అనేక అవమానాలు ఎదుర్కొని, రాజీలేని పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని, మన పథకాలను ఇతర రాష్ట్రాలు మాత్రమే కాకుండా, కేంద్రం కూడా కాపీ కొడుతుందని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేశారు. ప్లీనరీ వేదికలో ఆశీనులైన టీఆర్ఎస్ ప్రజాప్రతినిదులకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. 20 సంవత్సరాల ప్రస్థానం …
Read More »సీఎం కేసీఆర్‌ది చలించిపోయే హృదయం- కడియం శ్రీహరి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ది చలించిపోయే హృదయం అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా సంక్షేమ తెలంగాణ సాకారం అనే తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ కడియం శ్రీహరి మాట్లాడారు. ఉద్యమ సమయంలో లక్షలాది మంది ప్రజలను కేసీఆర్ కలుసుకున్నారు. వారి బాధలు, కష్టాలు, ఆకలిచావులు, ఆత్మహత్యలను స్వయంగా చూసి చలించిపోయారు. ఉద్యమంలో ఆయన చూసిన సన్నివేశాల నుంచి పుట్టినవే ఈ సంక్షేమ పథకాలు. దేశమే అబ్బురపడే …
Read More »