తెలంగాణ జలకిరీటం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మల్లన్నసాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కొమురవెల్లి మల్లన్నకు కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్విచ్ఛాన్ చేసిన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లోకి సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు …
Read More »మల్లన్నసిగలో గంగమ్మ తాండవం
తెలంగాణకే తలమానికంగా సీఎం శ్రీ కేసీఆర్ సాధించిన ఘనత.. నేడు సాక్షాత్కరించనున్నది. అదే మల్లన్నసాగరం.. తెలంగాణ నెత్తిన నీళ్ల కుండ ఎత్తినట్టు.. తలాపున గంగాళం పెట్టినట్టు.. నదిలేని చోట.. నడిగడ్డపై సముద్రాన్ని తవ్వినట్టు.. నేడే తెలంగాణ నడిబొడ్డున గంగావతరణం ఇది నదినే ఎత్తిపోసిన కాళేశ్వర ఘట్టంలో తుది అంకం తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో మరోపర్వం. ఎక్కడి మేడిగడ్డ.. ఎక్కడి కొండపోచమ్మ.. ఏడేండ్ల కింద ఎట్లుండె తెలంగాణ.. ఇప్పుడెట్లయ్యె తెలంగాణ.. గడ్డమీదకు …
Read More »జాతీయ రాజకీయాల్లో ఎంట్రీపై సీఎం కేసీఆర్ క్లారిటీ
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్‌ఖేడ్ బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణను ఎలా తయారు చేసుకున్నామో.. బంగారు భారతదేశాన్ని కూడా తయారు చేసుకుందామన్నారు. నారాయణ్‌ఖేడ్‌లో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాల్లో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తానని తెలిపారు. నేను జాతీయ రాజకీయాల్లో కూడా పోయి మాట్లాడుతున్నా. పని చేస్తా ఉన్నా. పోదామా మారి.. జాతీయ …
Read More »సీఎం కేసీఆర్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ప్రాంతం సన్యశ్యామలం
పురాణాల్లో రాముడు ఎక్కడ కాలు పెడితే అక్కడ రాయి అహల్య అయిందని.. నేడు సీఎం కేసీఆర్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ప్రాంతం సన్యశ్యామలం అవుతోందని మంత్రి హరీశ్ రావు కొనియాడారు. జిల్లాలోని నారాయణ్‌ఖేడ్‌లో సీఎం కేసీఆర్ ఇవాళ పర్యటించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణ్‌ఖేడ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు …
Read More »హెచ్ఎండిఏ పరిధిలో చెరువుల అభివృద్ధి, సంరక్షణ కోసం మరిన్ని చర్యలు
హెచ్ఎండీఏ కార్యకలాపాలు, చేపట్టిన ప్రాజెక్టుల పైన మంత్రి కే తారకరామారావు ఈ రోజు నానక్ రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో సుదీర్ఘమైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎండిఏ పరిధిలో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు మరియు భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన అంశాలపైన అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల సంరక్షణపైన ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా చెరువుల …
Read More »ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు : మంత్రి తలసాని.
ప్రైవేటుకు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, బలోపేతం చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన ‘మన బస్తి – మన బడి’ కార్యక్రమంపై మంత్రి మసబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన …
Read More »బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఆశలపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి నీళ్లు
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఆశలపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి నీళ్లు చల్లారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రిగా.. కేంద్రం నుంచి విభజన హామీలను సాధించుకొని రావాల్సిన బాధ్యతను విస్మరించి, అది సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో స్టీల్‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్న విషయాన్ని తమ ప్రభుత్వం ఇప్పటికే చెప్పిందని పేర్కొన్నారు. …
Read More »కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హారీష్ రావు లేఖ
తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరోసారి లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను మరోసారి గుర్తుచేశారు. కేంద్రం నుంచి గ్రాంట్లు, బకాయిల రూపంలో రాష్ర్టానికి సుమారు రూ.27,350 కోట్ల వరకు రావాల్సి ఉన్నది. మంత్రి లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ …
Read More »మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న మంత్రి తలసాని
మేడారం సమ్మక్క, సారలమ్మలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తులాభారం వేసి అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మేడారం జాతర కుంభమేళాను తలపించేలా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. …
Read More »వన దేవతలు సమ్మక్క – సారలమ్మను దర్శించుకోవడం అదృష్టం -కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుక సింగ్
వన దేవతలు సమ్మక్క – సారలమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుక సింగ్ పేర్కొన్నారు. వనదేవతల దర్శనానికి కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి, గిరిజన శాఖా మంత్రి రేణుక సింగ్ కలిసి శుక్రవారం ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి వారికి స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా వారు తల్లుల దర్శనానికి గద్దెల వద్దకు చేరుకున్నారు. నిలువెత్తు …
Read More »