తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమిళ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి,డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ కు ఫోన్ చేశారు. మంగళవారం ఫోన్ చేసిన సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి స్టాలిన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలతో కలకాలం జీవించాలని.. కోరుకున్న లక్ష్యాలను సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.ఈ సందర్భంగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు.
Read More »విజయపథంలో తెలంగాణ-మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ అన్నింటిల్లోనూ వెలిగిపోతోందని, ఆ వైభవమే కాదు.. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం విజయపథంలో దూసుకువెళ్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని, దీనికి కేంద్రం విడుదల చేసిన గణాంకాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని తెలిపారు. తలసరి ఆదాయం 2014 నుంచి 2021 వరకు 125 శాతం పెరిగినట్లు కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. జీఎస్డీపీ 130 శాతం పెరిగినట్లు తెలిపారు. దేశంలోనే …
Read More »యూపీ ఆఖరి విడత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారా..?
ఉత్తరప్రదేశ్ ఆఖరి విడత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి అసెంబ్లీ స్థానం పరిధిలో ప్రచారం ఉండవచ్చు. ఈ సెగ్మెంట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, శరద్ పవార్ వంటి నేతలు క్యాంపెయిన్ చేయనున్నారు..తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వారితో కలిసి వెళ్తారా? లేక ప్రత్యేకంగా ప్రచారంలో పాల్గొంటారా? అనేది తెలియాల్సి …
Read More »మార్చి 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలను మార్చి 7 తేదీ (సోమవారం) నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.కాగా., రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెల్పేందుకు మార్చి 6 వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. మార్చి 7 వ తేదీన ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ …
Read More »ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి అండ -మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు.. ప్రతి ఊరిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి అండ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న నల్లచెరువు, తాళ్ల చెరువు, ఈదుల చెరువు, రాజనగరం చెరువు, శ్రీనివాసపూర్ లక్ష్మీకుంటలను పునర్నిర్మించి పటిష్టం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు …
Read More »జాతీయ టైలర్స్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే Kp
జాతీయ టైలర్స్ దినోత్సవంను పురస్కరించుకొని ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాష్ట్ర మేర కుల సంక్షేమ సంఘం వారితో కలిసి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు తన నివాసం వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ ఓదెల వీరేశం, మారిశెట్టి సత్యనారాయణ, రామగిరి కిషన్, రాచర్ల నరసింహ, వీరప్ప, కొత్తూరి వీరప్ప, మ్యాతరి గంగాధర్, మారిశెట్టి విశ్వనాథ్, కీర్తి, చంద్రమౌళి, కొత్తూరు భాస్కర్, కొత్తూరు …
Read More »ప్రగతిభవన్ ను అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తా-రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతిభవన్ ను అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రంగా మారుస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో నిరుద్యోగ నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదని, మరో కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
Read More »మధ్యాహ్నం 2గంటలకు సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ నగరంలోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా అత్యున్నత స్థాయి ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారులు హాజరు …
Read More »కాళేశ్వరం ముక్తిమర్గం ..యాదాద్రి భక్తిమార్గం..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ముక్తి మార్గం, యాదాద్రి పునర్నిర్మాణంతో భక్తిమార్గాన్ని భావితరాలకు గుర్తిండిపోయేలా సీఎం కేసీఆర్ రెండు గొప్ప పనులు చేశారని సీనియర్ జర్నలిస్ట్ కే రామచంద్రమూర్తి కొనియాడారు.ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొన్నారు. అనంతరం నూతన ఆలయాన్ని పరిశీలించారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సైతం యాదాద్రీశుడిని దర్శించుకొన్నారు. సీఎం కేసీఆర్.. అత్యంత పురాతనమైన యాదాద్రిని పునర్నిర్మించి గొప్ప గౌరవాన్ని సంపాదించుకొన్నారని కొనియాడారు. ఈ …
Read More »రాజేంద్రనగర్ లో రూ.7వేల కోట్లతో ‘అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం’
తెలంగాణ రాష్ట్రంలో రాజేంద్రనగర్ లో రూ.7వేల కోట్లతో నిర్మించిన ‘అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాన్ని’ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలే వ్యవసాయంలో కీలకమని చెప్పారు. వ్యవసాయాభివృద్ధి, అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణికమన్నారు. దేశంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రెండో విత్తన పరీక్ష కేంద్రంగా తెలంగాణ ల్యాబ్ గుర్తింపు పొందింది.
Read More »