Home / Tag Archives: kcr (page 179)

Tag Archives: kcr

రామ్‌గోపాల్‌ వర్మ సంచలన ప్రకటన

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (ఆర్జీవీ) మరో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ బయోపిక్‌ను తీస్తానని చెప్పారు. త్వరలోనే దాన్ని తీస్తానని ప్రకటించారు. తన డైరెక్షన్‌లో రూపొందిన బాలీవుడ్‌  ‘డేంజరస్‌’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ కేసీఆర్‌ జీవితంపై  బయోపిక్‌ తీస్తానని చెప్పారు. తనకు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా బాగానచ్చిందని రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. తాను తీసే సినిమాలను థియేటర్‌, ఓటీటీ …

Read More »

ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్‌ ఉభయసభల్లో టీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం

షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణపై చర్చించాలని పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణ చాలా ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్నదని, ఉభయ సభల్లో కార్యకలాపాలు సస్పెండ్‌ చేసి ఈ అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానంలో లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పార్టీ పక్ష నేత నామా నాగేశ్వరరావు కోరారు. ఇదే అంశంపై రాజ్యసభలో టీఆర్ఎస్ నేత కే కేశ‌వరావు నోటీసులు ఇచ్చారు.వర్గీకరణతో వారి జనాభా ప్రకారం చట్టబద్ధమైన ప్రయోజనాలు …

Read More »

విద్యుత్‌ ఛార్జీలు మ‌న ద‌గ్గ‌రే త‌క్కువ‌- రైతుల‌కు 24 గంట‌లు ఉచిత క‌రెంట్ ఇచ్చేదీ తెలంగాణ మాత్రమే

మానవ దైనందిన జీవితంతో పెనవేసుకుపోయిన అత్యంత కీలక అంశం విద్యుత్తు. కరెంటు సరఫరాలో చిన్న అంతరాయం ఏర్పడినా జన ప్రవాహం ఎక్కడికక్కడ స్తంభించిపోయేంతగా విద్యుత్‌ అవసరాలు పెరిగిపోయాయి. అంతటి ప్రాధాన్యం గల విద్యుత్తు ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజల, రైతుల జీవితాలను అతలాకుతలం చేసింది.రెండు, మూడు విడుతల 6 గంటల విద్యుత్తుతో నాడు వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టివేయబడింది. గృహ, వాణిజ్య వినియోగదారులు గంటల తరబడి అంధకారంలో జీవించారు. 2, …

Read More »

కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఒక చెరువు నిండేది కాదు.. ఒక ఎకరం నీళ్లు ఉండేవి కావు..

మండుటెండల్లో చెరువుల్లో.. చెక్ డ్యామ్ ల్లో మత్తళ్లు దుంకుతున్న చరిత్ర నేటి తెలంగాణ ప్రభుత్వం లో..సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో అవిష్కృతం అయిందని మంత్రి హరీష్ రావు గారు అన్నారు.. సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూర్ మండల కేంద్రంలో గంగమ్మ దేవాలయ 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి హరిశ్ రావు గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చూస్తే ఎండాకాలం..కానీ గంగమ్మ ఒడిలో చిన్నకోడూర్ చెరువులో …

Read More »

రేవంత్ కు ఎమ్మెల్యే కెపీ వివేకానంద్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు..మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిపై అధికార టీఆర్ఎస్ కు చెందిన కుత్భుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కెపీ వివేకానంద్ అగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నిన్న బుధవారం నగరంలో టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వెనకబడిన వర్గాలు ముఖ్యంగా బీసీలంటే రేవంత్ రెడ్డికి చులకన భావం. ఆయన వెంటనే వాళ్లకు భేషరత్ గా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల …

Read More »

వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి

తెలంగాణ రైతాంగం రబీ సీజన్ లో పండించిన వరి ధాన్యం అంతటిని కేంద్రం కొనుగోలు చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో సభ్యులు ఏకవాక్య తీర్మానం చేశారు. బుధవారం జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్, డి.రాజేశ్వర్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన …

Read More »

ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు పొడిగింపు – హోంమంత్రి మహమూద్ అలీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు మార్చి 1 నుండి 31వ తేదీ వరకు పెండింగ్లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు.ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని, వీటి విలువ 840 కోట్ల …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులే టీఆర్ఎస్  ప్రభుత్వానికి భరోసా

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులే సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్  ప్రభుత్వానికి భరోసా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని  అన్నివర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధే  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు.  సంక్షేమ పథకాల అమలులో దేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్నారు. వనపర్తిలోని మంత్రి సింగిరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో రూ.30 లక్షల 60 వేల విలువైన …

Read More »

యాదాద్రికి ఆర్టీసీ బస్సులు… చార్జీలు ఎంత అంటే..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జంట నగరాల నుండి.. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రం నుండి ఉప్పల్ సర్కిల్ కు అక్కడ నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయానికి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. యాదాద్రిలోని లక్ష్మీనరసింహ స్వామివారి మూలవిరాట్‌ దర్శనాలు పునఃప్రారంభమైన నేపథ్యంలో భక్తుల కోసం యాదాద్రి దర్శిని పేరుతో ఆర్టీసీ మినీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉప్పల్‌ …

Read More »

ఆ విద్యార్థుల భవిష్యత్‌ కాపాడండి: మోడీకి కేసీఆర్‌ లేఖ

రష్యా-ఉక్రెయిన్‌ మ ధ్య యుద్ధం జరుగుతున్న కారణంగా భారత్‌కు తిరిగివచ్చిన వైద్య విద్యార్థులు స్వదేశంలోనే చదువుకునేందుకు అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. ఈ విషయంపై హ్యూమన్‌ యాంగిల్‌లో ఆలోచించి ప్రత్యేక కేసుగా ట్రీట్‌ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సుమారు 20వేలకు పైగా ఇండియన్‌ స్టూడెంట్స్‌ ఉక్రెయిన్‌ నుంచి వచ్చేశారని.. వీరంతా దేశంలోని వివిధ మెడికల్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat