తెలంగాణ రాష్ట్ర సీఎం ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు. రంజాన్ మాస్ క్రమశిక్షణాయుత జీవనశైలిని పెంపొందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రంజాన్ పండుగ మానవసేవ చేయాలనే సందేశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక అని.. లౌకికవాదం, మత సామరస్యంలో …
Read More »ముస్లిం మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు మంగళవారం ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాం చౌరస్తా వద్ద ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. అన్ని మతాల వారిని సమానంగా గౌరవిస్తూ, వారి శ్రేయస్సు కోసం …
Read More »వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారు
వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారు. సీఎం కేసీర్ తెలంగాణలో వ్యవసాయానికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో సోమవారం నిర్వహించిన వానకాలం పంటల సాగు సన్నద్ధత- అవగాహన సదస్సులో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నారని తెలిపారు. …
Read More »రాబోయే పదేండ్లలో 16 లక్షల ఉద్యోగాలు
ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగంలో రాబోయే పదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకుడు ఉన్నందునే ఇది సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని రావిర్యాల ఈ-సిటీలో రేడియంట్ ఎలక్ర్టానిక్స్ యూనిట్‌లో మరో నూతన …
Read More »మైనారిటీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి : మంత్రి అజయ్
ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మైనారిటీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ముస్లింలను గౌరవంగా …
Read More »మోదీ సర్కారుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్
కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,యువమంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఎనిమిదేళ్ళుగా మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో ఆక్సిజన్ దగ్గర నుంచి బొగ్గు వరకు అన్నీ కొరతేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల కొరత అని మంత్రి …
Read More »తలసేమియా రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం
తలసేమియా వ్యాధి బారిన పడిన పిల్లలను చూస్తుంటే బాధ కలుగుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ కింద అలాంటి పిల్లలందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు.తలసేమియా, సికెల్ సెల్ సోసైటీ ఆధ్వర్యంలో కమలా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సదస్సుకు మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో కమలా సోసైటీ తలసేమియా రోగులకు మంచి సేవ అందిస్తోందని …
Read More »పంట మార్పిడితో అధిక దిగుబడులు : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి
రేగొండ మండల కేంద్రంలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో చిరుధాన్యాలకు సంబంధించిన పంటలను వేయాలని సూచించారు. అదే విధంగా పంట మార్పిడితో …
Read More »తెలంగాణలో 24గంటల కరెంటు
తెలంగాణలో ఎక్కడ కూడా కనురెప్ప పాటు కరెంట్ పోవడం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ‘‘నేను హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాను… హైదరాబాద్‌లో జెనరేటర్ పెట్టుకునే పరిస్థితి లేదు’’ అని తెలిపారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు పెళ్లిలో జెనరేటర్ వాడినట్టు ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో తాగు నీరు, కరెంట్ సమస్య ఎక్కడా లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు అంటే …
Read More »మన ఊరు- మన బడిపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం భేటీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »