తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేండ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలి అని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సిఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు …
Read More »తెలంగాణలో మద్యం ధరలు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. లిక్కర్‌పై 20 నుంచి 25 శాతం పెంచారు. వెయ్యి ఎంఎల్ లిక్కర్‌పై రూ. 120 పెంచడంతో.. ధర రూ. 495 నుంచి రూ. 615కు పెరిగింది. లిక్కర్ క్వార్టర్ సీసాపై రూ. 20 పెంచింది. అన్ని రకాల బీర్లపై రూ. 10 చొప్పున ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read More »మహిళా సంఘాలకు 18 వేల కోట్ల రుణాలు
మహిళా సంఘాలకు బ్యాంకులు ఇచ్చే రుణాలను క్రమపద్ధతిలో చెల్లిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సెర్ప్, స్త్రీనిధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు రూ.18,069 కోట్ల రుణాలను అందించనున్నట్టు వెల్లడించారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చే రుణాల వార్షిక ప్రణాళికను విడుదల …
Read More »తడిచిన ధాన్యంతో సహా చివరి గింజ వరకు కొంటాం’- సీఎం కేసీఆర్
తడిచిన వరిధాన్యాన్ని కూడా కొంటామని… ఈ విషయంలో ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్… రైతులకు భరోసానిచ్చారు. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వరిధాన్యం సేకరణపై సీఎం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వరిధాన్యం సేకరణపై ఆరా తీశారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతి తదితర వరిధాన్య సేకరణ ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని… …
Read More »యూకేలోని ప్రవాసులకు థ్యాంక్స్- మంత్ర్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్ పర్యటనకు వెళ్తోన్న తెలంగాణ మంత్రి కేటీఆర్, యూకేలో ఉన్న ప్రవాస భారతీయులు థ్యాంక్స్ చెప్పారు. దావోస్‌లో జరిగే సమావేశానికి హాజరవడానికి ముందు ఆయన యూకేలో కూడా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యూకేలో ఉన్న తెలంగాణ ఎన్నారైలు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. లండన్ నగరంలో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. నంబర్ ప్లేట్ కేటీఆర్ అని ఉన్న కారులో ఆయన్ని ఎయిర్‌పోర్టులో రిసీవ్ …
Read More »టీఆర్‌ఎస్ రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ.. ఆశావహులు వీళ్లే!
టీఆర్‌ఎస్ పార్టీలో రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. బండ ప్రకాశ్ రాజీనామాతో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది. దీనికి రేపటిలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ అభ్యర్థిని ప్రకటించేందుకు టీఆర్‌ఎస్ అధిష్ఠానం సిద్ధమవుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థిత్వంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఆశావహులు ఉన్నప్పటికీ నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావుకు రాజ్యసభ …
Read More »నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌హైలెవల్ మీటింగ్
తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంటనష్టం సహా వివిధ అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో సీఎం హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాల్లో జరిగిన పంట నష్టం, దానికి సంబంధించిన ఎస్టిమేషన్లతో రివ్యూ మీటింగ్‌కు రావాలని ఇప్పటికే సీఎంవో నుంచి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు వెళ్లాయి. దీంతో పాటు పల్లె, పట్టణ ప్రగతి …
Read More »ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష
జనగామ జిల్లా పాలకుర్తి నియోజక వర్గంలోని పలు గ్రామాలకు ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై హన్మకొండ కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. నవాబుపేట, ఉప్పుగల్లు, రిజర్వాయర్ల పూర్తి, మండలాల వారీగా నీటి సరఫరా, గ్రామాల వారీగా సమస్యలను చర్చించారు. సాధ్యమైనంత వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసి నీరు అందించాలని అధికారులను ఆదేశించారు.సమావేశంలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, …
Read More »TRSలో చేరిన BJP నేతలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మకద్రోహానికి పాల్పడుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాలోని బేలలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే రామన్న సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో సీసీఐని సందర్శించిన కేంద్ర మంత్రులు సిమెంట్ పరిశ్రమ ప్రారంభిస్తామని చెప్పినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు.సీసీఐ ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ …
Read More »సీసీఐ పునరుద్ధరణపై సానుకూల నిర్ణయం తీసుకోండి-కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి
ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి చేశారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పున:సమీక్షించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కేటీఆర్ కోరారు. పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్నారు. ఉపాధి కల్పించే పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఇస్తామని కేటీఆర్ తెలిపారు
Read More »