తెలంగాణ రాష్ట్రమేర్పడిన దాదాపు 8ఏండ్ల తర్వాత ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కండ్లు తెరిచింది. అందులో భాగంగా రేపటి జరగనున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన గిరిజన వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. రేపటి పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 24 బిల్లులను కేంద్రంలోని మోదీ సర్కారు ప్రవేశపెట్టనుంది. అయితే తెలంగాణలో కేంద్ర గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేంద్ర యూనివర్సిటీల సవరణ బిల్లు-2022ను తీసుకురానున్నట్లు …
Read More »ప్రధాని మోదీకి రేవంత్ లేఖ
గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలంగాణను ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరారు. వరదల కారణంగా సుమారు 11 లక్షల ఎకరాల్లో పంట నీటమునిగిందని.. ముంపు ప్రాంతాల్లో ప్రజలను, అన్నదాతలను ఆదుకునేలా రాష్ట్రానికి సాయం చేయాలని ప్రధానికి రాసిన లేఖలో రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు .
Read More »IIIT విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి : మంత్రి హరీశ్‌రావు
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును స్పందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, కలెక్టర్, జిల్లా వైద్యాధికారులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక వైద్య బృందాలను పంపడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.
Read More »IIIT విద్యార్థులకు అస్వస్థత.. విచారణకు మంత్రి ఆదేశం
బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ దవాఖానకు తరలించాలని ఆర్జీయూకేటీ డైరెక్టర్, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు
Read More »70 అడుగులకు పైగా గోదావరి ప్రవాహం
కుండపోత వర్షాలు, భారీ వరదల నేపథ్యంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. నదీ ప్రవాహం 70 అడుగులు దాటి పోయింది. నదీ ప్రవాహాన్ని చూసి స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. భద్రాచలం పరిసరాల్లో ఎటు చూసినా వరద ప్రవాహామే కనిపిస్తోంది. దీంతో భద్రాచలం రామాలయంతో పాటు సమీప కాలనీలు నీట మునిగాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద …
Read More »గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ రేపు ఆదివారం ఏరియల్ సర్వే
తెలంగాణ రాష్ట్రంలో గత వారంతం భారీ వర్షాలు కురిసిన సంగతి విదితమే. దీంతో రాష్ట్రంలోని గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ రేపు ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఎన్నడు లేని విధంగా కురిసిన వర్షాలతో కడెం నుంచి భద్రాచలం వరకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితిని సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. రెండు, మూడు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమీక్ష చేయనున్నారు. ముంపు …
Read More »నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి- ఎమ్మెల్యే Kp
అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు కృషి చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు ఈరోజు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలు ఆహ్వాన పత్రికలు మరియు సమస్యలపై ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు అందజేయగా.. సమస్యలపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారు …
Read More »భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో సంభవిస్తున్న వరదలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద బాధితులకు అండగా నిలవాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని …
Read More »భద్రాచలం కు హెలికాప్టర్ పంపండి -సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి 68 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో వరదలకు జలమయం అవుతున్న లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్ఎస్, రెస్క్యూ బృందాలు సహా హెలికాప్టర్లను భద్రాచలానికి తరలించాలని సీఎస్ …
Read More »నెలరోజులకు బొగ్గు నిల్వలు సిద్ధంగా ఉంచండి: కేసీఆర్ ఆదేశం
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో గోదావరి ఉద్ధృతి, వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. విద్యుత్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి వస్తున్న వరదను అంచనా వేయాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా మరో నెలరోజులకు సరిపడా బొగ్గు నిల్వలను సిద్ధం …
Read More »