Home / Tag Archives: kcr (page 133)

Tag Archives: kcr

సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు .. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. నిన్న సోమవారం పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ ను వదిలేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరిగితే నేను పాదయాత్రను విరమిస్తాను అని అన్నారు. సెప్టెంబర్ నెల పన్నెండో తారీఖు నుండి నేను …

Read More »

గోల్‌మాల్‌ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే: కేసీఆర్‌

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించి రైతు ప్రభుత్వాన్ని తీసుకొస్తారని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇటీవల 26 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలు వచ్చి తనను కలిశారని.. జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని చెప్పారు. పెద్దపల్లిలో జిల్లా కలెకర్ట్‌ కార్యాలయం, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లోకి పోదామా? అని ప్రజల్ని ఆయన …

Read More »

బీజేపీ నాయకుల మాటలు విని ఆగమవొద్దు: మంత్రి ఎర్రబెల్లి

బీజేపీ నాయకుల రెచ్చగొట్టే మాటలు విని ఆగం కావొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం వరంగల్‌ జిల్లాలోని రాయపర్తి మండలం కొండూరులో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయో …

Read More »

మునుగోడు ఉప ఎన్నికల్లో BJP గెలిస్తే TRS సర్కారు పడిపోతుందా.?

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలిస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందా..?. ఒక్క ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచినంత మాత్రాన మిత్రపక్షం  ఎంఐఎంతో కల్సి 109 స్థానాలున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి కేవలం మూడంటే మూడు స్థానాలకు మరోక స్థానం యాడ్ అయితే నాలుగు సీట్లతో బీజేపీ సర్కారు ఏర్పాటు అవుతుందా..?. ఎందుకంటే ఇటీవల మునుగోడులో జరిగిన …

Read More »

సిద్దిపేటలో అన్ని క్రీడలకు కావాల్సిన మౌలిక వసతులను కల్పిస్తా- మంత్రి హరీష్ రావు

రానున్న రోజుల్లో సిద్దిపేటలో అన్ని క్రీడలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక & వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. త్వరలోనే 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్‌ను అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి హరీష్ తెలిపారు. జిల్లా కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2కే రన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతో …

Read More »

నేడు పెద్దపల్లికి సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు సోమవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రోడ్డు మార్గాన హైదరాబాద్ నుండి పెద్దపల్లికి చేరుకోనున్నారు. మొదట రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న పెద్దకల్వల వద్ద సుమారు నలబై తొమ్మిది కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నుండి మంథనికి వెళ్ళే దారిలో నిర్మించిన టీఆర్ఎస్ …

Read More »

వైద్యవిద్యలో సీఎం కేసీఆర్  చరిత్ర

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  వైద్యవిద్యలో   చరిత్ర సృష్టించారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో 2014కు ముందు 67 ఏండ్ల కాలంలో ఐదు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను మాత్రమే ఏర్పాటు చేశారన్నారు. కానీ గత ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్‌ కొత్తగా 16 వైద్య కళాశాలలు మంజూరు చేశారని వెల్లడించారు. జిల్లాకు ఒకటి చొప్పున మరో 13 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీల నిర్మాణం …

Read More »

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పెరుగుతున్న మద్ధతు

తెలంగాణలో త్వరలో జరగనున్నమునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌  కి క్రమంగా మద్దతు పెరుగుతున్నది. ఉపఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రకటించింది. ఈమేరకు కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ రావు ప్రకటించారు. ఆయన నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మునుగోడు నియోజకవర్గం కేంద్రంలో మంత్రి జగదీశ్‌ రెడ్డితో భేటీ అయింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ …

Read More »

రూ.50.58 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 102 మంది ముఖ్యమంత్రి సహాయనిధి పథకం లబ్ధిదారులకు రూ.50,58,500/- విలువ గల చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సుపరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరం …

Read More »

26 రాష్ట్రాల రైతు సంఘ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం

తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు పలు రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దేశంలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకుల అధ్యయన కార్యక్రమం రెండోరోజు కొనసాగుతున్నది. ఇందులో భాగంగా శనివారం ఉదయం ప్రగతి భవన్ కు చేరుకున్న రైతు సంఘాల నేతలకు అల్పాహారం ఏర్పాట్లు చేశారు. అనంతరం వారంతా వ్యవసాయం, సాగునీటి రంగం తదితర తెలంగాణ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat