తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం, తల్లడ పిఎసిఎస్ ఆధ్వర్యంలో రైతుల పండించిన ధాన్యం కొనుగోలు చేయుట కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు, జిల్లా అదన కలెక్టర్ మధుసూదన్ గారు ప్రారంభించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని మద్దతు ధర కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు …
Read More »మంత్రి కేటీఆర్ కృషితో 1500 కొత్త కంపెనీలు : మంత్రి సబిత
అన్ని రంగాలు అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో టీసీఎస్ అయాన్.. టీఎస్ ఆన్ లైన్ సహకారంతో ఏర్పాటు చేసిన ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ టు ఆగ్మెంట్ ఎంప్లాయిబిలిటి సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీజయేష్ రంజన్,ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, వివిధ యూనివర్సిటీల వీసీలు, విద్యావేత్తలు, పారిశ్రామిక …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే Kp కృషి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై ఎమ్మెల్యే గారు వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »దేశానికి దిక్సూచిగా, మోడల్ రాష్ట్రంగా తెలంగాణ
తెలంగాణను సీఎం కేసీఆర్ దేశానికి దిక్సూచిగా, మోడల్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించే మాటను నిలబెట్టుకొని, వ్యవసాయరంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించామన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌తో కలిసి ఆయన వేములవాడ రాజన్నను దర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో అత్యధికంగా ధాన్యం పండించే పంజాబ్‌ను కూడా మనం అధిగమించామని చెప్పారు. మూడు కోట్లకుపైగా …
Read More »సీనియర్ జర్నలిస్ట్ మురళీ మోహన్ రావు మృతిపట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఇలపావులూరి మురళీ మోహన్ రావు మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం తెలిపారు. పత్రికా రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు సద్గతులు చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన మురళీ మోహన్ రావు.. …
Read More »త్వరలో 2 వేల పల్లె దవాఖానలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్‌లో ఉన్న బస్తీదవాఖానల మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా 2 వేల పల్లె దవాఖానలు ఏర్పాటుచేస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. వీటిని ఈ నెలలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుత ఏఎన్‌ఎం సెంటర్లను పల్లెదవాఖానలుగా అప్‌గ్రేడ్ చేస్తామని వివరించారు. నిన్న ఆదివారం ఆయన హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన ఏఎన్‌ఎంల 2వ మహాసభల్లో ముఖ్య అతిథిగా మాట్లాడారు. కరోనా సమయంలో ఏఎన్‌ఎంలు చేసిన …
Read More »ఎంపీ అరవింద్ ఒక ఫేకర్
తెలంగాణలోని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అరవింద్‌పై అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం టీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ అరవింద్ ఒక ఫేకర్ అని, వాళ్ళ నాన్న ఒక జోకర్ అని ఎద్దేవా చేశారు. అరవింద్ చదివింది ఫేక్, రాసిచ్చిన బాండ్ ఫ్రాడ్, మాట్లాడేది ఫాల్స్ అంటూ విమర్శలు చేశారు. సీఎం …
Read More »బీఎల్ సంతో్‌ష్ ను అరెస్ట్ చేయద్దు
ఏపీ తెలంగాణతో పాటు యావత్ దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బొమ్మరబెట్టు లక్ష్మీ జనార్దన్ సంతోష్ (బీఎల్ సంతో్‌ష)ను తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అరెస్ట్ చేయరాదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు హైకోర్టు నిర్దేశించింది. సంతోష్ కూడా సీఆర్పీసీ 41ఏ నిబంధనలను పాటించాలని, సిట్ ఎదుట హాజరై దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. …
Read More »వైద్య విద్య కేరాఫ్ తెలంగాణ
తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్న తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్య విషయంలో కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. జిల్లాకో మెడికల్ కాలేజీని నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు పీహెచ్‌సీ నుంచి అన్ని స్థాయిల దవాఖానలను పటిష్ఠం చేస్తున్నది. ఈ క్రమంలో గత ఎనిమిదేండ్లలో 12 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రాగా.. యూజీ, పీజీ సీట్లు గణనీయంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా పెరిగిన …
Read More »తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా
తెలంగాణ రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోతుండటంతో క్రమంగా చలి తీవ్రత పెరుగుతున్నది. ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి అధికంగా ఉంటున్నది. దీంతో ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా కుమ్రం భీం జిల్లాలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 7.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 8.3, నిర్మల్ జిల్లాలో …
Read More »