తెలంగాణరాష్ట్రంలో గత ఇరవై నాలుగంటల్లో కరోనా పాజిటీవ్ కేసులు పెరిగాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 608 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 329 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 5,146కు చేరింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి 459 మంది బాధితులు కోలుకున్నారు.
Read More »ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష
జనగామ జిల్లా పాలకుర్తి నియోజక వర్గంలోని పలు గ్రామాలకు ఎస్సారెస్పీ, దేవాదుల నీటిని అందించడంపై హన్మకొండ కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. నవాబుపేట, ఉప్పుగల్లు, రిజర్వాయర్ల పూర్తి, మండలాల వారీగా నీటి సరఫరా, గ్రామాల వారీగా సమస్యలను చర్చించారు. సాధ్యమైనంత వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసి నీరు అందించాలని అధికారులను ఆదేశించారు.సమావేశంలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, …
Read More »TRSలో చేరిన BJP నేతలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మకద్రోహానికి పాల్పడుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాలోని బేలలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే రామన్న సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో సీసీఐని సందర్శించిన కేంద్ర మంత్రులు సిమెంట్ పరిశ్రమ ప్రారంభిస్తామని చెప్పినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు.సీసీఐ ప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ …
Read More »సీసీఐ పునరుద్ధరణపై సానుకూల నిర్ణయం తీసుకోండి-కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి
ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి చేశారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పున:సమీక్షించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కేటీఆర్ కోరారు. పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్నారు. ఉపాధి కల్పించే పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఇస్తామని కేటీఆర్ తెలిపారు
Read More »పిల్లలకు మంచి ఆరోగ్యానివ్వాలి-మంత్రి హరీశ్‌రావు
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ 9వేల మందిపై చేసిన సర్వే ఫలితాలను వైద్యారోగ్యశాఖ మంత్రి తాజ్ డెక్కన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వ్యాధిపై అవగాహన కల్పించడానికి ప్రపంచవ్యాప్తంగా హైపర్ టెన్షన్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎస్‌ఐ ఇచ్చిన సర్వే …
Read More »గంజాయి సాగు చేస్తే రైతు బంధు కట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు సంక్షేమాభివృద్ధి పథకాల్లో ఒకటి రైతుబంధు. ఏడాదికి ఎకరాకు రూ పదివేల చొప్పున పంట పెట్టుబడి కింద ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ అధికారులు ఒక నివేదికను పంపారు. ఈ నివేదిక ఆధారంగా అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న దాదాపు 131మంది రైతుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్రంలో ఎవరైన …
Read More »హైదరాబాద్ ప్రజలకు న్యూ ఇయర్ కానుక
న్యూ ఇయర్ కానుకగా హైదరాబాద్ ప్రజల కోసం షేక్ పేట్ ఫ్లైఓవర్ ను ఈ రోజు మంత్రి కేటీ రామారావు ప్రారంభించనున్నారు. రూ. 333.55 కోట్ల అంచనాతో నిర్మించిన 2.8కి.మీ ఈ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి JNTU జంక్షన్ వరకు 17 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్యలు లేకుండా సులభతరం చేయనుంది.
Read More »మరోసారి మానవతను చాటుకున్న మంత్రి కేటీఆర్
గతంలో ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ కి ప్రిపేర్ అవుతూ లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న షాద్ నగర్ కు చెందిన విద్యార్థిని ఐశ్వర్య రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.అత్యంత పేదరిక నేపథ్యం నుంచి ఢిల్లీలోని ప్రముఖ లేడి శ్రీరామ్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఐశ్వర్య రెడ్డి లాక్డౌన్ కాలంలో తన కాలేజీ హాస్టల్ ఫీజులతోపాటు ఆన్లైన్ క్లాసులు హాజరయ్యేందుకు అవసరమైన …
Read More »హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్-అమెరికా తర్వాత అతి పెద్ద ఆఫీస్
హైదరాబాద్‌లో మరో బహుళజాతి కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్ (ఎంఈఐసీ)ను బుధవారం నానక్‌రామ్‌గూడలో ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. అమెరికాకు బయట మెడ్‌ట్రానిక్ సంస్థ ఏర్పాటుచేసిన అతి పెద్ద ఇన్నోవేషన్ సెంటర్ ఇదే కావటం విశేషం. హైదరాబాద్ సెంటర్‌లో 160 మిలియన్ డాలర్ల (రూ.1200 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. రానున్న ఐదేండ్లలో దాదాపు వెయ్యిమందికి ఈ సెంటర్‌లో …
Read More »రాజస్థాన్ రాళ్లతో తెలంగాణ సచివాలయం
తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణంలో రాజస్థాన్ రాళ్లను వినియోగించనున్నారు. పార్లమెంట్ లో ఉన్న ఫౌంటెయిన్ల మాదిరే ఇక్కడా ఏర్పాటు చేయనుండగా రాజస్థాన్ లోని ధోల్పూర్ రాతిని తెప్పించాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. భవనం మధ్య భాగంలో బీజ్ రంగు రాతి పలకలను వినియోగించేలా నమూనాలను రూపొందించారు. రాజస్థాన్ వెళ్లి యంత్రాల ద్వారా చెక్కించిన రాతి పలకలను కాకుండా మనుషులతో చెక్కించినవి పరిశీలించాలని సీఎం సూచించారు.
Read More »