ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవితకు తెరాస సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. కవిత గెలుపు నిజామాబాద్ జిల్లాకే కాకుండా రాష్ట్రాభివృద్ధికి కూడా మరింత దోహదం చేస్తుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ప్రజలకు, రైతులకు తప్పుడు హామీలతో బాండు పేపర్లు రాసిచ్చి మోసం చేసిన వ్యక్తిని గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించి పొరపాటు …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన కవిత
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. మొత్తం 824 ఓట్లకు గాను, 823 ఓట్లు పోలవ్వగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత, 728 ఓట్లు సాధించి చరిత్ర సృష్టించారు. పోతాంకర్ లక్ష్మీనారాయణ (బీజేపీ)- 56, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి( కాంగ్రెస్)-29 ఓట్లు సాధించి, డిపాజిట్ కోల్పోయారు. 10 ఓట్లను చెల్లనవిగా ప్రకటించారు ఎన్నికల సంఘం అధికారులు. మొత్తం రెండు …
Read More »ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కల‍్వకుంట్ల కవిత ఘన విజయం
తెలంగాణ రాష్ట్రంలోనిఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీలు ఆమెకు కనీసం పోటీకూడా ఇవ్వలేకపోయాయి. మొత్తం 824 ఓట్లలో 823 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కవితకు 728 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చాయి. మొత్తం పది ఓట్లు చెల్లబాటు కాలేదు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో భారీ ఆధిక్యం దిశగా కవిత
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. భారీ ఆధిక్యం దిశగా ఉద్యమ పార్టీ అభ్యర్థి కవిత దూసుకెళ్తున్నారు. ఈ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ ముగిసే సరికి 600 ఓట్లకుగాను టీఆర్ఎస్‌కు 542 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్‌లో పోలైనా రెండు ఓట్లు టీఆర్ఎస్‌కే వచ్చాయి. మిగిలిన 221 ఓట్లను రెండోరౌండ్‌లో లెక్కించనున్నారు. …
Read More »దర్గాలో మాజీ ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నాంపల్లిలోని యుసిఫియన్ దర్గాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాదర్ సమర్పించారు. ముస్లిం మతపెద్దల ఆశీస్సులు అందుకున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఈరోజు సోమవారం వెలువడనున్న నేపథ్యంలో ఆమె దర్గాను సందర్శించారు. కవిత వెంట హోంమంత్రి మహమూద్ అలీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బాబా …
Read More »నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకి చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆరు టేబుళ్లపై రెండు రౌండ్‌ల పాటు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 823 ఓట్లు పోలవగా, మొదటి రౌండ్‌లో 600 ఓట్లను లెక్కించనున్నారు. రెండో రౌండ్‌లో 223 ఓట్లను లెక్కిస్తారు. పోలైన ఓట్లలో వాలిడ్ ఓట్లు తీయగా సగానికంటే ఒక ఓటు ఎక్కువ పోలైన అభ్యర్థిని …
Read More »నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక: అప్‌డేట్స్
నిజామాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అధికార యంత్రాంగం ఇందుకు సంబంధించి 50 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె, మాజీ ఎంపీ కవిత ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వి.సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా …
Read More »నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో భారీ మెజారిటీయే లక్ష్యం
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో భారీ మెజారిటీయే లక్ష్యం… జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో సమావేశాలు..నియోజకవర్గాల వారీగా నేతలకు భాద్యతలు. మాజీ ఎంపీ కవిత అభ్యర్థిత్వానికి మద్దతుగా, టీఆర్ఎస్ వైపు నిలుస్తున్న కాంగ్రెస్, బీజేపీ ల స్థానిక ప్రజాప్రతినిధులు పోలింగ్ నాటికి 90% ఓటర్లు టీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం… అక్టోబర్ 9 న జరగనున్న నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందేందుకు పకడ్బందీ వ్యూహం రచించింది …
Read More »పేద విద్యార్థులకు తెలంగాణ జాగృతి అండ
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన, దళిత, పేద విద్యార్థులు ఆన్‌లైన్‌లో చదువును కొనసాగించేందుకు తెలంగాణ జాగృతి సాయం చేసింది. తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులతో ఏర్పడిన విలేజ్ లెర్నింగ్ సర్కిళ్ల (వీఎల్‌సీ)కు.. మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో 50 కంప్యూటర్లు, 500 కుర్చీలను వితరణ చేశారు. ఈ సాయం కొనసాగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కవితకు మంత్రి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ …
Read More »సచివాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారు
కొత్త సచివాలయ భవనాన్ని ఏడాది కాలంలోనే సిద్ధం చేయాలన్న లక్ష్యంతో వేగంగా పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే దసరా రోజున పనులు ప్రారంభించి తదుపరి దసరా వరకు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తోంది. దాదాపు 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడంతస్తుల భారీ భవనం, చుట్టూ పచ్చికబయళ్లు, రోడ్లు.. ఇంత పెద్ద ప్రాజెక్టు 12 నెలల్లో పూర్తి చేయటం అంత సులభం కానప్పటికీ, వీలైనంత తొందరలో …
Read More »