కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని అపురూప కాలనీ కాపు సంఘం కమిటీ హాల్ లో రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా పవర్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 6వ సారి ఏర్పాటు చేసిన ‘రక్తదాన శిబిరాన్ని‘ ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ఎమ్మెల్యే గారు పండ్లు, జ్యూస్ అందజేశారు. …
Read More »ఫిల్మ్ సిటీలో అమిత్ షా -రామోజీ రావు భేటీ… ఎందుకంటే..?
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటనలో భాగంగా ప్రముఖ మీడియా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తో నిన్న ఆదివారం భేటీ అయ్యారు. ఆదివారం మునుగోడులో జరిగిన సభ తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా రామోజీ రావుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇదే ఏడాది డిసెంబర్ నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం గురించి చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా వర్తమాన భవిష్యత్ …
Read More »కేంద్ర మంత్రి అమిత్ షా కు స్వహస్తాలతో బండి సంజయ్ షూ స్ అందించడం వెనక అసలు కారణం ఇదేనా..?
తెలంగాణలో త్వరలో జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల సమరభేరీలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న ఆదివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయపు జెండా కప్పుకున్నారు. ఆ …
Read More »సమస్యల పరిష్కారంలో ముందుంటా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కు చెందిన బస్తీ వాసులు ఈరోజు ఆదివారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో మిగిలి ఉన్న భూగర్భడ్రైనేజీ మరియు సీసీ రోడ్లు పూర్తి చేసేలా కృషి చేయాలని ఎమ్మెల్యే గారిని కోరారు. దీంతో ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో …
Read More »పార్టీలకు అతీతంగా సీఎం కేసీఆర్ పారదర్శక పరిపాలన
తెలంగాణలో ఉన్నఅన్ని పార్టీలకు అతీతంగా పారదర్శక పరిపాలన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొనసాగిస్తున్నారని,ఆసరా పెన్షన్లతో వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత కేసీఆర్ గారిదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం నడికూడ మండలం చర్లపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటుచేసిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ల గుర్తింపు కార్డులను అందచేశారు. అర్హులందరికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందివ్వడమే లక్ష్యంగా, అన్ని వర్గాల ప్రజల …
Read More »బీజేపీకే మీటర్ పెట్టాలే..! ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్..
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే.. రైతు, ప్రజావ్యతిరేక విధానాలే ప్రధాని మోదీకి శత్రువు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ప్రజా ఆశీర్వాద సభలో కేంద్రంలోని బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న వైఖరిపై ధ్వజమెత్తారు. వ్యవసాయ కరెంటు మోటార్లకు కేంద్రం ఎందుకు మీటర్లు పెట్టమంటున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. కారణాలు ఏంటో చెప్పాలని నిలదీశారు. ‘ఎదుకు పెట్టమంటున్నవ్ మీటర్.. ఏం కారణం.. నిన్ను మేం అడుగుతలేమే.. నిన్ను బతిమిలాడినమా పైసలు …
Read More »మొక్కలు నాటిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
వజ్రోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆదివారం తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇవాళ ఒక్కరోజే 75 లక్షల మొక్కలు నాటుతున్నామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ బొటానికల్ గార్డెన్‌లో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా అన్ని పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.స్వతంత్ర భారత వజ్రోత్సవాలను దేశంలోనే ఇంత ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే.గతంలో …
Read More »కాళేశ్వరం పంప్ హౌజ్ లు మునగడం ప్రకృతి వైపరిత్యమా..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రాణహిత, గోదావరి నదుల సంగమ ప్రాంతంలో నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా నిర్మించిన ఈ ప్రాజెక్టులో లక్ష్మి పంప్ హౌజ్, సరస్వతి పంప్ హౌజ్, గాయత్రి పంప్ హౌజ్ కీలకమైనవి. అయితే ఎన్నో ఏండ్ల తర్వాత కురిసిన అతి భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులో పంప్ హౌజ్ …
Read More »రేపు మునుగోడుకు అమిత్ షా
తెలంగాణలో నల్లగొండ జిల్లా మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేందుకు రేపు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నేరుగా బహిరంగ సభకు బయలుదేరనున్నారు. అనంతరం సాయంత్రం రామోజీ ఫిలిం సిటీని సందర్శించేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అమిత్ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Read More »మునుగోడుకు సీఎం కేసీఆర్
త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న మునుగోడులో అధికార పార్టీ టీఆర్‌ఎస్ ప్రజాదీవెన సభకు సర్వం సిద్ధమయింది. సభా ప్రాంగణంతోపాటు మునుగోడు అంతా గులాబీమయం అయింది. సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో ఇప్పటికే సభా ఏర్పాట్లు పూర్తిచేశారు. సభావేదికగా గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికకు సమరశంఖం పూరించనున్నారు.ప్రజాదీవెన సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నది. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో మునుగోడు చేరుకుంటారు. సుమారు …
Read More »