ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసి తీరతామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పంట ఉత్పత్తి తగ్గించే తీరుపై తిరోగమన విధాలను అవలంభిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని.. ఏఈవోలకు నిరంతర ట్రైనింగ్ క్లాసులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ అధికారులు …
Read More »తెలంగాణలో అద్భుత జల దృశ్యం… సంద్రంలా.. సుందిల్ల…!
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మంథని మండలం సిరిపురంలో నిర్మించిన సుందిల్ల బరాజ్ సంద్రాన్ని తలపిస్తున్నది. కాసిపేటలోని అన్నారం పంపుహౌస్‌లో నాలుగు మోటర్లు రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎత్తిపోస్తుండడంతో సోమవారం సాయంత్రానికి బరాజ్‌లో నీటినిల్వ 5.82 టీఎంసీలకు చేరుకున్నది. దిగువన మేడిగడ్డ బరాజ్‌లో సోమవారం సాయంత్రం 4 గంటల సమయానికి 4.584 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. అన్నారం బరాజ్‌లో 7.77 టీఎంసీలుగా నమోదైంది. సుందిల్ల బరాజ్ బ్యాక్‌వాటర్ గోలివాడ పంప్‌హౌస్‌కు …
Read More »జయహో కేసీఆర్… తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చనున్న కాళేశ్వరం..!
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ఆయన ఏదైనా అనుకుంటే సాధించే వరకు పట్టు విడువరు. లక్ష్యాన్ని చేరుకునే దాకా విశ‌్రమించరు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, నేడు బంగారు తెలంగాణ సాధనలో ఆయన ఎన్నో అడ్డంకులు అధిగమిస్తూ అజేయుడిగా నిలుస్తున్నారు. ఎవరైనా అనుకున్నారా…తెలంగాణ రాష్ట్రం వస్తుందని..ఎవరైనా అనుకున్నారా..బీడు వారిన తెలంగాణ మాగాణుల్లో గోదావరి జలాలు పారుతాయని, అసలు ఎవరైనా ఊహించారా…పల్లానికి ప్రవహించే నీటిని పైకి …
Read More »20 జిల్లాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు ఎలా చేకూరనున్నాయి.?
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.. తాగునీటి కోసం 40 టీఎంసీలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టీఎంసీలు వినియోగిస్తారు.. నీటిని సరఫరా చేసే మార్గం పొడవు 1,832 కి.మీ గ్రావిటీ ప్రెషర్ కాలువ పొడవు 1,531 కి.మీ గ్రావిటీ టన్నెల్ పొడవు 203 కి.మీ లిఫ్టులు 22, పంప్ హౌజులు 22 అవసరమయ్యే విద్యుత్ 4,627 మెగావాట్లు అవసరమయ్యే విద్యుత్ స్టేషన్లు 19 400 …
Read More »దేశంలోనే అసాధారణమైన ఎత్తిపోతల..ఇది ఒక చారిత్రాత్మక సన్నివేశం
రాష్ట్రంలోని దాదాపు 13 జిల్లాల్లో సుమారు 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవం పోసేందుకు నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధమైంది. జూన్ 21న ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర్‌రావు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో నీటి ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణకు ఎగువన ఉన్న మహారాష్ట్ర, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ మహత్తర కార్యక్రమానికి ముఖ్య …
Read More »కోటీ ఆశలతో కాళేశ్వరం నీళ్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.. కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం పరశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు కోటీ ఆశలతో కాళేశ్వరం నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. దశాబ్దాల తరబడి అనుభవించిన సాగునీటి కష్టాలకు తెరపడుతుందని నమ్మకంతో వున్నారు. రైతులకు సాగునీరందించడమే ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నది. కోటికి పైగా ఎకరాలకు సాగునీరందించేందుకు పాలమురు-రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ ఎత్తపోతల పథకాలను నిర్మిస్తున్నది. వీటిలో కాళేశ్వరం ప్రాజెక్టు …
Read More »