తెలంగాణ రాష్ట్ర వరప్రదాని అయిన కాళేశ్వర ప్రాజెక్టు పరిధిలోని చివరి దశలో పూర్తైన కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి నీరు విడుదల కానున్నది. గత నెల మే ఇరవై తొమ్మిదిన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభమైంది.మర్కూర్ పంప్ హౌజ్ ద్వారా నీళ్లను ఎత్తిపోస్తున్నారు. మంగళవారం మూడు పంపుల ద్వారా 1250క్యూసెక్కుల నీళ్లను ఎత్తిపోశారు.నేడు విడుదల కానున్న నీళ్లు జగదేవ్ పూర్,తుర్కపల్లి కాలువల్లో పారనున్నది.గజ్వేల్,ఆలేరు మండలాలకు నీళ్లు రానున్నాయి.
Read More »జలపుష్పాలకు అడ్డా తెలంగాణ
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జలకళ ఉట్టిపడుతున్నది. గోదావరి జలాలను ఒడిసిపట్టి రిజర్వాయర్లు, గొలుసు చెరువులను నింపుతుండటంతో రైతులు ఆనంద పరవశం చెందుతున్నారు. నిండు వేసవి రోజుల్లో ఎన్నో చెరువులు మత్తడి దుంకుతుండటంతో గ్రామీణ ప్రజల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. గోదావరి జలాలతో ఒక్క రైతులే కాకుండా మత్స్యకారులు కూడా ఎంతో లాభపడుతున్నారు. రిజర్వాయర్లు, చెరువులు సమృద్ధిగా నీటితో …
Read More »కాళేశ్వరం డ్యాష్‌బోర్డు
ఒక ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రణాళిక అవసరం. అదే అనేకప్రాజెక్టుల సమాహారంగా రూపుదిద్దుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణకు కేవలం ప్రణాళిక సరిపోదు. అందుకు భారీవ్యూహం కావాలి. అటు ప్రధాన గోదావరి.. ఇటు ప్రాణహిత.. నడుమ కడెం.. ఎప్పుడు వరద ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించాలి. వర్షపాతం, వరద రాకను ముందే పసిగట్టాలి. రోజుకు 2-3 టీఎంసీల జలాలను ఎత్తిపోసే అనేకదశల్లో ఉన్న భారీమోటర్లను సక్రమంగా నిర్వహించాలి. ఎక్కడ ఏ …
Read More »రంగనాయక్ సాగర్ కు నేడు కాళేశ్వర నీళ్లు
కాళేశ్వర ప్రాజెక్టు మహోజ్వల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కారమవుతున్నది. నాలుగేండ్ల క్రితం మేడిగడ్డ వద్ద వెనుకకు అడుగులు వేయడం మొదలుపెట్టిన గోదావరి.. రంగనాయకసాగర్‌లో కాలుమోపడంతో సప్తపదులు పూర్తిచేసుకోనున్నది. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఆరోదశ ఎత్తిపోతతో అన్నపూర్ణ జలాశయాన్ని చేరుకున్న గోదావరిజలాలు.. రంగనాయకసాగర్‌లోకి వస్తున్నాయి. పది దశల ఎత్తిపోతలలో ఏడోదశ సంపూర్ణం కాబోతున్నది. శుక్రవారం చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ శివారులోని రంగనాయకసాగర్ పంప్‌హౌజ్‌లోని నాలుగుమోటర్లలో ఒక మోటర్ వెట్ రన్ …
Read More »త్వరలోనే సిద్దిపేట ప్రజల స్వప్నం సాకారం…
సిద్ధిపేట జిల్లా ప్రజల అద్భుతమైన కల ఆవిష్కృతం కాబోతున్నది. రెండు రోజుల్లో రంగనాయ సాగర్ కు గోదావరి జలాలు వస్తాయి. కరోనా రావడంతో నీళ్ల పండుగ జరపడం లేదు. కరోనా పోయినంక నీళ్ల పండుగ జరుపుకుందామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, జిల్లా అడిషనల్ …
Read More »తెలంగాణలో 25లక్షల ఎకరాలకు సాగునీరు
తెలంగాణ రాష్ట్రంలో 2021ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే మహోత్తర లక్ష్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుకుంది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 12.71లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మరోవైపు రానున్న ఏడాది పూర్తయ్యేలోపు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే ఇది సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. సీతరామ ప్రాజెక్ట్ ద్వారా 2.88లక్షల ఎకరాలకు … దేవాదుల కింద 2.56లక్షల ఎకరాల అయకట్టును …
Read More »లక్ష్మి పంప్‌హౌజ్‌లో ఎత్తిపోతలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రా జెక్టులో భాగంగా దిశను మార్చుకొని ఎదురెక్కుతూ వందల కిలోమీటర్లమేర పాలకడలిలా గోదావరి నది విస్తరిస్తున్నది. ఇక్కడి లింక్ -1,2లో మోటర్లు దిగ్విజయంగా నడుస్తుండగా, గోదావరి అజేయంగా రైతన్న బీళ్లకు పరుగులు తీస్తున్నది. దిగువన భూపాలపల్లి జిల్లాలో లక్ష్మి పంప్‌హౌజ్‌లో ఎత్తిపోతలు కొనసాగుతుంది. ఇక్కడ పెద్దపల్లి జిల్లాలోనూ పంపులు నిర్విరామంగా నడుస్తున్నాయి. మంథని మండలం కాసిపేటలోని సరస్వతి పంప్‌హౌజ్‌లో మంగళవారం …
Read More »మరో అద్భుతం ముంగిట కాళేశ్వరం ప్రాజెక్టు
‘తలాపున పారుతుంది గోదారి.. మా చేను, మా చెలక ఎడారి..’ అనే ఉద్యమ గీతాన్ని పూర్తిగా మార్చేసిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టం సాక్షాత్కారానికి ముహూర్తం సమీపించింది. తలాపున పారుతున్న గంగమ్మను ఒడిసిపట్టి.. దాదాపు పది దశల్లో ఎత్తిపోసి.. తెలంగాణలోనే గరిష్ఠ ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు తరలించే ప్రక్రియ త్వరలో ప్రారంభంకానున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ జలసంకల్పంలో భాగంగా ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలతో ఫిబ్రవరిలోనూ …
Read More »విద్యుత్ వినియోగంలో తెలంగాణ కొత్త రికార్డు
తెలంగాణ రాష్ట్రం విద్యుత్ వినియోగంలో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ రోజు ఉదయం ఏడు గంటల యాబై రెండు నిమిషాలకు రికార్డు స్థాయిలో మొత్తం 13,168 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఇది అప్పటి ఉమ్మడి ఏపీ 2014లో వినియోగించిన 13,162మెగా వాట్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. సాగువిస్తీర్ణం పెరగడం, వ్యవసాయానికి ఉచిత …
Read More »కాళేశ్వరంలో సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా శ్రీ ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం ఆలయంలో పండితుల వేద మంత్రోచ్ఛారణలతో పూజలు చేశారు. అంతకుముమ్దు గోదావరిలో నాణేలు వదిలి.. చీర..సారె సమర్పించి ఉద్యమం నాటి మొక్కులను చెల్లించుకున్నారు. …
Read More »