ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కల్సి పోటి చేస్తాయని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెల్సిందే. తాజాగా జనసేన బీజేపీ పొత్తుపై బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి క్లారిటీచ్చారు. టీడీపీ జనసేన పొత్తుపై ఢిల్లీలోని బీజేపీ జాతీయ ఆధిష్టానానికి వివరిస్తాను అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మేము తప్పుగా చూడటం …
Read More »సీఎం జగన్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఆయన సతీమణీ వైఎస్ భారతిరెడ్డిలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఉన్న వార్డు వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల ను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హైకోర్టు పిటిషన్ వేసింది. ఆ సంస్థ …
Read More »హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు కావడం గర్వకారణం -CM KCR
భారతదేశంలో ప్రప్రథమంగా హైదరాబాద్‌లో ఐఏఎంసీ ఏర్పాటు కావడం, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మనల్ని దీవించడం మనందరికి గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణను హృదయపూర్వకంగా, చేతులు జోడించి అభినందిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.నానక్‌రామ్‌గూడలోని ఫోనిక్స్ వీకే టవర్స్‌లో 25 వేల చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి …
Read More »రేపు యాదాద్రికి ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రేపు యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ.. రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. జస్టిస్ ఎన్వీ రమణతోపాటు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్ కూడా యాదాద్రికి వెళ్తారు. యాదాద్రీశుని దేవాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం పునఃనిర్మిస్తున్న విషయం తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణ నిన్న …
Read More »తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా హిమా కోహ్లీ ప్రమాణం
తెలంగాణ రాష్ర్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జస్టిస్ హిమా కోహ్లీ చేత గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరుకాగా, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం జస్టిస్ హిమా …
Read More »ఏపీ తప్పకుండా న్యాయం జరుగుతుంది..కేంద్ర మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ రెండూ వేరువేరు అంశాలన్నారు. ఆర్టికల్ 371 రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్‌ను యూటిగా చేశామని పేర్కొన్నారు. శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ చాలా బాగుందన్నారు. ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఈ దశబ్దానికి తొలి బడ్జెట్ అంటూ కొనియాడారు. కేంద్ర బడ్జెట్లో …
Read More »అయోధ్య తీర్పు విషయంలో వదంతులు వ్యాప్తి చేస్తే బేడీలే
యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉదయం ఈ తీర్పును వెలువరించనుంది. అయోధ్య వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో మీకొచ్చిన సందేశాన్ని మరొకరికి పంపించారంటే కోరి చిక్కులు తెచ్చుకున్నట్లే. అయోధ్య తీర్పుపై వచ్చే సందేశాలను ‘డిలీట్’ చేయాలని శాంతిభద్రతల అదనపు డీజీ …
Read More »అయోధ్య వివాదం నేపథ్యంలో ఈరోజు సెలవులు ప్రకటించిన రాష్ట్రాలు ఇవే..!
అత్యంత వివాదాస్పద అయోధ్య కేసులో తీర్పు ఇస్తున్న నేపద్యంలో ఇవాళ ఢిల్లీ, జమ్ముకశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. యూపీలో విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇవాళ అయోధ్య కేసు తుది తీర్పు నేపథ్యంలో సెలవులు ప్రకటించినట్టు తెలుస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం అయోధ్య వివాదం ఏర్పడింది. అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన …
Read More »అయోధ్యపై తుది తీర్పు నేడే.. దేశమంతా హై అలెర్ట్..!
కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓ వివాదం ఒక ముగింపునకు వచ్చే సమయం ఆసన్నమైంది. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మ భూమి-బాబ్రీమసీదు వ్యాజ్యంపై శనివారం తుది తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ వ్యాజ్యంపై 40 రోజులపాటు రోజువారీ విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరు 16న తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబరు 17న పదవీ విరమణ చేయనున్న …
Read More »దేశ రాజధానిలోనే ఇన్ని సమస్యలా..కొలిక్కి వచ్చేనా..?
దేశ రాజధాని ఢిల్లీ లో ఏర్పడిన వాతావరణ ఇబ్బందులు రోజురోజికి పెరుగుతున్నాయి పెరుగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో ఎందరో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రమాదకర ప్రాంతాల్లో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. ప్రస్తుతం ఆ ప్రాంతాలు మొత్తం ఎమర్జెన్సీ లో ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం దేశ రాజధానిలో మరో ఇబ్బంది తలెత్తింది. ఒక పక్క లాయర్స్ మాకు న్యాయం చెయ్యాలని పోరాడుతుంటే, మరోపక్క పోలీసులు సెక్యూరిటీ కావాలని …
Read More »