ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి తుమ్మల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న తుమ్మల ఈసారి పాలేరు టికెట్ ఆశించారు. అయితే గులాబీ బాస్, సీఎం కేసీఆర్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే మళ్లీ టికెట్ ఖరారు చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ …
Read More »ఢిల్లీలో, గల్లీలో మోకరిల్లడమే కాంగ్రెస్ పార్టీ నైజం.. ఎమ్మెల్సీ కవిత ఫైర్
తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు షురూ అయినయి..తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వెన్నుముక ఉండదు..అధికారం కోసం జీ గులాం అంటూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకుల పాదాల వద్ద తాకట్టు పెడుతుంటారని తరచుగా విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. అధికారంలో ఉన్నా…లేకున్నా కాంగ్రెస్ నాయకులకు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా హస్తినకు వెళ్లాల్సిందే..అక్కడ తమ బాసులకు వంగి వంగి సలాంలు కొట్టాల్సిందే..కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు ఊహల పల్లకీలలో …
Read More »పవన్ కల్యాణ్ కు భారీ షాక్….వైసీపీలో చేరిన జనసేన అభ్యర్థి..!
ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది…అధికార వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయనే ధీమాతో ఉండగా…ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం పట్టణ ప్రాంతాల్లో ఉన్న కాస్త ప్రభుత్వ వ్యతిరేకతను పచ్చ మీడియా సహకారంతో మరింత పెంచి ఎన్నికల్లో విజయం సాధించి తీరాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ పార్టీని మూసివేయాల్సి వస్తుందని..లేకుంటే పార్టీ జూ. ఎన్టీఆర్ చేతిలోకి వెళ్లిపోతుందని చంద్రబాబు భయం..అందుకే తాను 70 ఏళ్ల …
Read More »చంద్రబాబుకు షాక్..వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది…మరో కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు దూకుడు పెంచాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలు, ఆయన తనయుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రతో, బాబుగారి దత్తపుత్రుడిగా ముద్రపడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు వారాహియాత్ర పేరుతో ఎన్ని విమర్శలు చేసినా…ఎంత రచ్చ చేసినా…ప్రజల్లో మాత్రం సీఎం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి …
Read More »అదే జరిగితే రాజకీయాలకు గుడ్ బై…రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..!
బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజకీయ భవితవ్యంపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే విజయశాంతి వంటి బీజేపీ నేతలు రాజాసింగ్ ను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించకపోవడంపై హైకమాండ్ పై అసహనం వ్యక్తం చేశారు. కాగా ఇటీవల మంత్రి హరీష్ రావును కలిసిన తర్వాత రాజాసింగ్ బీఆర్ఎస్ లోకి చేరడం ఖాయమని వార్తలు వచ్చాయి. 115 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, …
Read More »బీజేపీలోకి జయసుధ..బీఆర్ఎస్ లోకి జయప్రద..!
సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి జయసుధ ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గంలో క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి కూడా అక్కడ నుంచే పోటీ చేయించాలని కాషాయ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. కాగా జయసుధ సమకాలీనురాలు, మరో ప్రముఖ సినీ నటి జయప్రద అధికార బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్టీఆర్ హయాంలో టీడీపీ …
Read More »రేవంత్ రెడ్డికి భారీ షాక్…పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీనామా…త్వరలో బీఆర్ఎస్‌లో చేరిక..!
గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అందరికంటే ముందుగా 115 నియోజకవర్గాల అభ‌్యర్థులను ప్రకటించి ఎన్నికల భేరీ మోగించడంతో అధికార బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాంచి జోష్ మీద ఉన్నాయి..అయితే గులాబీ బాస్ కేసీఆర్ ముందుగా అభ్యర్థులను ప్రకటించడంతో అధికార బీఆర్ఎస్ అభ్యర్థులకు గాలం వేద్దామన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలినట్లైంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు వందలాదిగా వెల్లువెత్తుతుండడంతో ఎవరికి సీటు ఇవ్వకపోయినా కష్టమే …
Read More »రేవంత్ రెడ్డికి భారీ షాక్…బీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ కీలక నేత…!
జనగామ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమెరుగని నేతగా కొనసాగుతున్నారు. ఈసారి కూడా ఆయనే పాలకుర్తి నుంచి పోటీ చేయబోతున్నారు..అసలు ఎర్రబెల్లికి పోటీ ఇచ్చే నాయకుడే కాంగ్రెస్ లో కనపడడం లేదు. జనగామ డీసీసీ అధ్యక్షుడు డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి గత ఎన్నికల్లో ఎర్రబెల్లి చేతిలో ఓటమి పాలయ్యారు.. ఇప్పటికే పొన్నాల, కొమ్మూరి ప్రతాపరెడ్డితో విబేధాలతో జంగా రాఘవరెడ్డి సతమతమవుతున్నారు..ఈసారి ఆయన పాలకుర్తి నుంచి …
Read More »బీజేపీకి భారీ షాక్..బీఆర్ఎస్ లో చేరనున్న సీనియర్ నేత..!
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రానురానూ దిగజారిపోతుంది.. బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ మెల్లమెల్లగా పడిపోతుంది. ఎన్నికలకు ముందు రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడంతో కాషాయనేతల్లో గందరగోళం నెలకొంది. నిన్నటి వరకు అధికార బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీకొట్టిన బీజేపీలో ఇప్పుడు స్తబ్దు నెలకొంది. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో కాషాయ నేతలు, క్యాడర్ …
Read More »కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్..ఈ నెల 18 న బీఆర్ఎస్ లోకి ఉత్తమ్ దంపతులు..?
తెలంగాణ రాజకీయవర్గాల్లో అతి పెద్ద సంచలనం చోటు చేసుకోబోతుంది… కాంగ్రెస్ పార్టీకి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ షాక్ ఇవ్వబోతున్నారని, త్వరలో బీఆర్ఎస్ లో చేరడం ఖాయమని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సీనియర్లకు మధ్య గత కొన్నాళ్లుగా తీవ్ర విబేధాలు చోటు చేసుకున్నాయి. తన సీఎం సీటుకు పోటీ రాకుండా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా …
Read More »