తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజవర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు వైసీసీలో చేరారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సమక్షంలో టీడీపీకి చెందిన నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీలో చేరినవారిలో టీడీపీ కీలక నేతలు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎనికల్లో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీ సాధిస్తుందని …
Read More »టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిక..!
నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైసీపీలో చేరారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. …
Read More »చంద్రబాబుకు మరోసారి ఝలక్ 10 మంది పార్టీ నుండి జంప్
చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మరోసారి ఝలక్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం చంద్రబాబు నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి డుమ్మా కొట్టారు. చంద్రబాబుతో సమావేశానికి పది మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉండటం గమనార్హం. తాను నిర్వహించిన ఇసుక దీక్షకు ఒకేసారి 15 మంది ఎమ్మెల్యేలు రాకపోవడంతో ఆందోళన చెందిన చంద్రబాబు వెంటనే శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.ఇది ముఖ్యమైన సమావేశమని, అధినేత కీలక …
Read More »వైసీపీలో చేరిన దేవినేని అవినాష్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కృష్ణాజిల్లాలో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు యువత అధ్యక్ష్య పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన దేవినేని అవినాష్ గురువారం వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిశారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో దేవినేని అవినాష్‌తో పాటు టీడీపీ సీనియర్ …
Read More »టీడీపీకి రాజీనామా చేసిన దేవినేని అవినాశ్..!
ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు ,టీడీపీ నేత దేవినేని అవినాశ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతే కాదు గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో దేవినేని అవినాష్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తన రాజీనామా లేఖను ఆయన టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపారు. ఆయనతో పాటు కడియాల బచ్చిబాబు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం వైసీపీ అధినేత, ఏపీ సీఎం …
Read More »నవంబర్ 3న వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన వల్లభనేని వంశీ..!
రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు కారణమైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఎట్టకేలకు తన నిర్ణయం ఏంటో తేల్చేసారు. ఇక, టీడీపీలో ఉండనని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేస్తూ లేఖ పంపిన వంశీ ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలతో ఆయన వైసీపీలోకి మారుతారా లేదా అనే చర్చ మొదలైంది. అదే సమయంలో బీజేపీ నేతలు సైతం వంశీ తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. ఇక, టీడీపీ అధినేత …
Read More »పవన్ కళ్యాణ్ కు షాకిచ్చిన మరో నేత..త్వరలో వైసీపీలో చేరిక
గడిచిన ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దెబ్బ తగలబోతోంది. జనసేన పార్టీకి మరో నేత షాక్ ఇవ్వనున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీని వీడనున్నారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో ఆకుల జనసేన తరపున రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో …
Read More »దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వం ప్రతీపనిలో చిత్తశుద్ధి, పారదర్శకతతో ముందుకు వెళ్తుందని, నాలుగునెలలల్లో 4లక్షల ఉద్యోగాలిచ్చిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కరపలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో కన్నబాబు మాట్లాడుతూ ప్రజారంజక పాలన అందిస్తూ దేశంలోనే ఆదర్శ ప్రాయుడిగా జగన్ మారారన్నారు. 2019 ఎన్నికల శంఖారావాన్ని కాకినాడ నుంచే జగన్ పూరించారు. దేశంమొత్తం తిరిగి చూసే విధంగా ఎన్నికల …
Read More »కుటుంబంనుంచి నలుగురు ఆ నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యేలుగా పనిచేశారు…ఇప్పుడు వైసీపీలో చేరిక
తెలుగు దేశం పార్టీని 30 ఏళ్లుగా భుజాలపై మోసి అలసిపోయామని, అయినా చంద్రబాబుకు తాము అంటే చులకనగా ఉందని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి మూడు దశాబ్ధాలకాలంపాటు ఎనలేని సేవలందించి వెన్నుదన్నుగా నిలిచిన పర్వత కుటుంబం టీడీపీని వీడేందుకు నిర్ణయించుకుంది. దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉండగానే హఠాత్తుగా మరణించారు. ఆయన పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆ కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే …
Read More »వైఎస్సార్సీపీలోకి ఊపందుకున్న వలసలు.. జగన్ సమక్షంలో చేరికలు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన ముఖ్యనేతలు వైసీపీలో చేరారు. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, జయసుద, జైరమేష్ లు వైసీపీ చేరారు. తాజాగా టీడీపీకి చెందిన కొందరు మాజీ ఎంపీలు, ఆ పార్టీ కీలక నేతలు వైసీపీలో చేరేందుకు సిద్దమయినట్టు తెలుస్తోంది. అలాగే జై రమేష్ సోదరుడు దాసరి బాలవర్ధన్ రావు గతంలో గన్నవరం శాసనసభ్యుడిగా …
Read More »