ప్రభుత్వరంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) సివిల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో సివిల్ విభాగంలో ఇంజినీర్లు, సూపర్‌వైజర్ పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు ఈనెల 24 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ పోస్టులను నిర్ణీత కాల వ్యవధికి భర్తీ చేయనున్నారు. మొత్తం …
Read More »తల్లీకూతుళ్లకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు
చదువు ఆపేసిన పన్నెండేళ్లకు తిరిగి ప్రారంభించి ఏకంగా లెక్చరర్ ఉద్యోగం సాధించిన ఘనత తల్లిది. చిన్న వయసులో చైల్డ్ డవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగం తెచ్చుకున్న ఘనత కూతురిది. ఇద్దరూ ఒకే ఏడు పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకున్నతల్లి రౌతు పద్మ పటేల్ , మరియు కూతురు అలేఖ్య పటేల్ (రిజిస్టర్డ్ నేమ్ ) సక్సెస్ ఇది. తల్లీ కూతుళ్లు పోటీ పడి చదువుకోవడం ఈ రోజుల్లో …
Read More »నిరుద్యోగ యువతకు ఏపీ సర్కారు షాక్
ఏపీలో ప్రభుత్వోద్యోగాలకు వయోపరిమితి పెంపుపై నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే వయోపరిమితిని ఐదేళ్లు సడలిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది మే 31తో ఎస్సీ, ఎస్టీలకు పెంచిన వయోపరిమితి గడువు ముగిసింది. ఇప్పుడు దీనిని 2026 మే 31 వరకు పెంచారు. అయితే ఓసీ, బీసీ, ఈబీసీలకు ఈ సడలింపు ఇవ్వకపోవడంపై నిరుద్యోగ యువత భగ్గుమంటోంది. …
Read More »త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వనున్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపెల్లిగూడెం గ్రామంలో ఆదివారం ఆయన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి రూ.3.80 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా అని ఓట్ల కోసం వచ్చే బీజేపీ …
Read More »ఇస్రోలో జాబ్స్.. నెలకు రూ.63 వేల వరకు జీతం..
హెవీ వెహికిల్ డ్రైవర్: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్/10వ తరగతి ఉత్తీర్ణత. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు చెల్లిస్తారు లైట్ వెహికిల్ డ్రైవర్: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ/మెట్రిక్/10వ తరగతి ఉత్తీర్ణత. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.19,900 నుంచి రూ. 63,200 వరకు చెల్లిస్తారు కుక్: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత. కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 …
Read More »తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో రాష్ట్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంగళవారం మంత్రివర్గం సమావేశమైంది. ఇకపై ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. ఈ మేరకు అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్’ను …
Read More »నిరుద్యోగ యువతకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50,000 (యాభై వేలు) ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సిఎం ఆదేశించారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ …
Read More »అన్ని ప్రాంతాలకి ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని మంత్రి శ్రీ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు సుదీర్ఘ కసరత్తు, గొప్ప విజన్ తో జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి, అమలులోకి తీసుకువచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ …
Read More »కొత్త వైద్య, నర్సింగ్ కాలేజీల్లో సిబ్బంది నియామకానికి ప్రభుత్వం
తెలంగాణ రాష్ర్టంలోని కొత్త వైద్య, నర్సింగ్ కాలేజీలకు సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాత్కాలికంగా సిబ్బందిని నియమించుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు మెడికల్ కాలేజీలకు 2,135 పోస్టులు, 13 కొత్త, 2 పాత నర్సింగ్ కాలేజీలకు 900 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. ఈ నియామకాలను తాత్కాలిక ప్రతిపాదికన చేపట్టాలని ఆదేశించింది. 2022 మార్చి నెలాఖరు వరకు సేవల వినియోగానికి అనుమతి ఇచ్చింది.
Read More »విప్రో కంపెనీ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్
ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ అయిన విప్రో కంపెనీ ఉద్యోగులకు ఈ ఏడాది రెండోసారి జీతం పెరగనుంది. జూనియర్ ఉద్యోగులకు జీతాలను పెంచుతున్నామని.. బ్యాండ్ B3 ఉద్యోగుల (అసిస్టెంట్ మేనేజర్ మరియు దిగువస్థాయి)కు పెరిగే జీతాలు సెప్టెంబర్ 1 నుంచి అమలవుతాయని సంస్థ తెలిపింది. 2021 జనవరిలోనే ఒకసారి వీరి జీతాలు పెరగ్గా.. తాజాగా మళ్లీ పెరగనున్నాయి. మొత్తం కంపెనీ ఉద్యోగుల్లో బ్యాండ్ B3 కేటగిరీ వారు 80శాతం వరకు …
Read More »