ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల క్యూ2 వార్షిక ఫలితాల్లో సంస్థ ఆదాయం తగ్గడంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల పనితీరును ప్రశ్నించారు. దీంతో వచ్చే వార్షిక ఫలితాల నాటికి పర్ఫార్మెన్స్ బాగాలేని ఉద్యోగులను గూగుల్ తొలగిస్తుందని పలు పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం గూగుల్ నియామకాలను నిలిపివేసింది.
Read More »టీఎస్‌పీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు కొలువులకై ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. తాజాగా టీఎస్‌పీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర రవాణాశాఖలో 113 అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో 54 పోస్టులు మల్టీ జోన్-1లో ఉండగా, 59 పోస్టులు మల్టీ జోన్-2 పరిధిలో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు నెల …
Read More »త్రివిధ దళాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఎన్నో తెలుసా..?
త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్రం తెలిపింది. ఆర్మీలో 1,16,464, నేవీలో 13,537, ఎయిర్పోర్స్లో 5,723 ఖాళీలున్నట్లు పేర్కొంది. అగ్నివీరుల భర్తీ సంఖ్య కంటే సగటు నియామకాల సంఖ్య ఎక్కువగా ఉందా? అయితే సాయుధ దళాల్లో సిబ్బంది కొరత ఎలా తీరుస్తారు? అన్న ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇవ్వలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీం పరిధిలో ఉందని బదులిచ్చింది.
Read More »తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. టీఎస్‌ఎన్పీడీసీఎల్ (తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ)లో 82 అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులను ఈ నెల 27 నుంచి జూలై 11వరకు స్వీకరించనున్నారు. ఆగస్టు 14న ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఈ పోస్టులకు 18 ఏండ్ల నుంచి 44 ఏండ్ల వయస్సు కలిగిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్ …
Read More »నిరుద్యోగ యువతకు శుభవార్త
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్రంలోని ఉన్నత విద్యా శాఖలో భర్తీ చేసేందుకు 5,083 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వీటి భర్తీని సత్వరమే నోటిఫై చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. వాటిలో యూనివర్సిటీల్లో అత్య ధికంగా 1,892 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ కమిషనరేట్ (1,523), కళాశాల విద్య కమిషనరేట్ (546), సాంకేతిక విద్య కమిషనరేట్ (568), 11 యూనివర్సిటీల పరిధిలో 2,374 పోస్టులు ఖాళీగా …
Read More »దాంతో తెలంగాణకు కేంద్రం పెద్ద దెబ్బ కొట్టింది: కేటీఆర్
ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గతంలో హామీ ఇచ్చారని.. అది ఏమైందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.32లక్షల జాబ్స్ భర్తీ చేసిందని.. త్వరలో మరో లక్ష చేస్తుందని చెప్పారు. ప్రైవేట్ …
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో మరో 1,433 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. మున్సిపల్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని వివిధ హోదాల్లో ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే గ్రూప్ 1 కింద 503 పోస్టులకు, పోలీస్, రవాణా, అటవీ, ఎక్సైజ్, బేవరేజెస్ కార్పొరేషన్ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. తాజా అనుమతులతో మొత్తం పోస్టుల …
Read More »తెలంగాణలో కొలువుల జాతర
తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి వైద్యుల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, పీహెచ్సీలలో పనిచేయడానికి ఈ పోస్టులను భర్తీ చేస్తామని.. గ్రామాల్లో పనిచేయడానికి ఇష్టపడే వారి సర్వీసును కౌంట్ చేస్తూ, పీజీ అడ్మిషన్లలో 30శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేండ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలి అని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సిఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు …
Read More »తెలంగాణలో మరో కొలువుల జాతర
తెలంగాణ రాష్ట్రంలో భారీ మొత్తంలో ‘విద్యుత్తు’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వెయ్యి జూనియర్ లైన్‌మెన్, 201 సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) ఆదివారం నోటిఫికేషన్ జారీచేసింది. జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు ఈ నెల 19 నుంచి దరఖాస్తులు స్వీకరించనుండగా, జూన్ 17న రాత పరీక్ష నిర్వహిస్తారు. సబ్ ఇంజినీర్ పోస్టులకు జూన్ 15 నుంచి దరఖాస్తులు స్వీకరించి, జూలై 31న రాత …
Read More »