తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరాజు 8 సంవత్సరాలు పాటు టీటీడీ జేఈవోగా పనిచేశారు. మరోవైపు వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న బసంత్‌కుమార్‌కు టీటీడీ జేఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆయన్ను ప్రభుత్వం ఆదేశించింది.
Read More »