Home / Tag Archives: janasena (page 14)

Tag Archives: janasena

అమలాపురం ఘటనల వెనుక టీడీపీ, జనసేన: మంత్రి విశ్వరూప్‌

అమలాపురం ప్రజానీకం ఎప్పుడూ తప్పుడు ఆలోచనతో లేరని ఏపీ మంత్రి విశ్వరూప్‌ అన్నారు. కోనసీమలోని దళిత సామాజిక వర్గానికి చెందిన వారెవరూ రోడ్లపైకి రావొద్దని.. రౌడీషీటర్ల ఉచ్చులో పడొద్దని కోరారు. అమలాపురంలో ఆందోళనకారులు తగులబెట్టని తన ఇంటిని మంత్రి పరిశీలించారు. గత 50 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ఆందోళలో కొంతమంది రౌడీషీటర్లు చేరారని విశ్వరూప్‌ ఆరోపించారు. అమలాపురంలో జరిగిన ఘటనల వెనుక టీడీపీ, జనసేన నాయకులు ఉన్నారన్నారు. …

Read More »

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ: పవన్‌

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మృతిచెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించి ఆర్థికసాయం అందించారు. వలిగొండ మండలం గోకారం, కోదాడలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా కోదాడలో మీడియాతో పవన్‌ మాట్లాడారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో జనసేనకు 5వేలకు పైగా ఓట్లు ఉన్నాయన్నారు. ఆ ఓట్లతో గెలవలేనప్పటికీ రాజకీయాలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని …

Read More »

పవనే తమ వెంట పడుతున్నాడని అమిత్‌షా చెప్పారు: కేఏ పాల్‌

వచ్చే ఎన్నికల్లో 175 లోక్‌సభ స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పాల్‌.. గురువారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పని అయిపోయిందని.. అపోజిషన్‌ స్థానాన్ని తామే భర్తీ చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను అమిత్‌షాతో చర్చించినట్లు పాల్‌ తెలిపారు. …

Read More »

మళ్లీ మా 151 సీట్లు మాకే: కొడాలి నాని

జగన్‌ రాజకీయాల్లో లేకపోతే ఇళ్ల కోసం పేదల ప్రజలు అల్లాడిపోయేవారని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. జగన్‌ కోసం పేద ప్రజలంతా ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. గుడివాడలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. తన నియోజకవర్గంలో తనకు ఇల్లు లేదని ఏ ఒక్క పేదవాడు అడిగినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని …

Read More »

పవన్‌.. ప్రజలకైనా ఓ క్లారిటీ ఇవ్వు: పెద్దిరెడ్డి

2024 ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుకోక తప్పదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబుకు ప్రజల్లో విశ్వసనీయత లేదని.. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం సాధ్యం కాదని ఆయనకీ తెలుసన్నారు. అందుకే పొత్తుల కోసం చేయాల్సిన అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నారని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. జగన్‌కు ప్రజల్లో అభిమానం ఉందని.. అందుకే వైసీపీ ధైర్యంగా ఒంటరిగా పోటీ …

Read More »

పొత్తులపై ప్రజల్ని ఫూల్స్‌ చేయాలనుకుంటున్నారు: సజ్జల

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని చెప్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.. టీడీపీతో పొత్తు ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. పొత్తులపై జనసేన, టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయన్నారు. వైసీపీ సెంట్రల్‌ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు. చంద్రబాబు కూడా త్యాగాలకు సిద్ధం అంటూ కూటమినే నడిపిస్తామని చెప్పడమేంటని సజ్జల …

Read More »

పవన్‌.. ఇంకెన్నాళ్లు ఈ డిపెండింగ్‌ పాలిటిక్స్‌?

‘దరువు.కామ్‌’ ప్రత్యేక కథనం అది మార్చి 14, 2014.. మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడిగా, ప్రముఖ సినీనటుడిగా ఉన్న పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీని ప్రకటించిన రోజు. తనకు అధికారం ముఖ్యం కాదని.. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో అటు ప్రజలు,ఇటు అభిమానులు అప్పట్లో పవన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాలకి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి ఎంతో ఉద్ధరిస్తారని జనం భావించారు. సీన్‌ కట్‌ చేస్తే ఈ ఎనిమిదేళ్ల జనసేన …

Read More »

పవన్‌ కల్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు

అమరావతి: జనసేన ఆవిర్భావ సభ ఆ పార్టీ ప్రమోషన్‌ కోసం కాదని.. పార్టీని అమ్ముకునేందుకని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సభకు ఇన్ని వేల మంది హాజరయ్యారు..నాకెంత ప్యాకేజీ ఇస్తారని అడిగేందుకే పవన్‌ కల్యాణ్‌ ఈ సభ పెట్టారని ఆరోపించారు.  ఏపీ అసెంబ్లీ వద్ద ద్వారంపూడి మీడియాతో మాట్లాడుతూ పవన్‌పై  విమర్శలు చేశారు. సినిమాల్లో పదిమందిని కొట్టినంత మాత్రాన హీరో కాదని పవన్‌ను ఉద్దేశించి ద్వారంపూడి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో …

Read More »

పవన్ కళ్యాణ్ పై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత,పవర్ స్టార్..సీనియర్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వేదికగా ఏపీ రాజకీయాలు నడుస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు మొదలు మంత్రుల వరకు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై,,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. దీంతో పవన్ కు ఘాటుగా రిప్లై ఇచ్చారు …

Read More »

పొత్తులపై పవన్‌ క్లారిటీ.. 2014 సీన్‌ రిపీట్‌ అవుద్దా?

మంగళగిరి: వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేనదే అధికారమని.. సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని చెప్పారు. పార్టీలు వ్యక్తిగత లాభాలను వదిలి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చినపుడు ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిస్తామని క్లారిటీగా చెప్పారు. ఈ విషయంలో బీజేపీ నేతలు రోడ్‌మ్యాప్‌ ఇస్తే దాని ప్రకారం ముందుకెళ్తామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat