ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్న ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులకు ఓట్లు పడేలా పలు రకాలుగా ఓటర్లకు తాయిలాలు పంచే పనిలో బిజీబిజీ అయ్యాయి. ఈ క్రమంలో రేపు సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ . సోమవారం జరిగే ఎన్నికలకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ …
Read More »ఏపీ విద్యార్థులకు అలెర్ట్
ఏపీలో ఈనెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే ఇంటర్ పరీక్షలు జరగనున్న సంగతి తెల్సిందే. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను జ్ఞానభూమి పోర్టల్ లో ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల లాగిన్లలో అప్ లోడ్ చేసినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. వెంటనే విద్యార్థులకు వాటికి అందించాలని కాలేజీలకు సూచించింది. సందేహాలుంటే 18004257635 టోల్ నంబర్కు ఫోన్ చేయాలని పేర్కొంది. పరీక్షలకు 10.03 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని, …
Read More »ఏపీ బీజేపీలోకి మాజీ సీఎం
ఉమ్మడి ఏపీలో సీఎంగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నరు కిరణ్ కుమార్ రెడ్డి.. అయితే అయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ అధిష్టానంతో కిరణ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపారు.. జాతీయ స్థాయిలో ఆయనకు పదవి ఇచ్చేందుకు హామీ …
Read More »విద్యార్థులకు ఏపీ సర్కారు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల వసతి, భోజనం ఖర్చుల కోసం సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించడంలో భాగంగా మార్చి 2 నుంచి మధ్యాహ్న భోజనంలో రాగి జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది. వారానికి మూడు రోజులపాటు అందజేసేందుకు అదనంగా రూ.86 కోట్లను ఖర్చు చేయనుంది.
Read More »మంత్రులు,ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అభద్రతాభావంలో ఉన్నారని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నాయకులు.. ఫోన్లు మాట్లాడుకునే ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై ప్రభుత్వం భయపడుతోందని… విచారణ జరిగితే మిగిలిన వారి ట్యాపింగ్ విషయాలు బయటపడతాయని వెనకడుగు వేస్తోందని చెప్పారు. మేయర్తోపాటు 11 మంది కార్పోరేటర్లు తనతోపాటు ఉన్నారని కోటంరెడ్డి తెలిపారు.
Read More »వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాక్
ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భద్రత తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఆయనకు 2+2 సెక్యూరిటీ ఉండగా, దాన్ని 1+1కు తగ్గించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డితో సంతకం పెట్టించుకుని వెళ్లారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై విమర్శలు …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు
ఏపీ అధికార వైసీపీకి చెందిన మాజీ మంత్రి సుచరిత పార్టీ మారుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి విదితమే. తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై మాజీ మంత్రి సుచరిత స్పందించారు. తాను మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం సీఎం జగన్ వెంటే ఉంటాను. పార్టీ మారితే ఇంటికే పరిమితం అవుతానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ …
Read More »నెల్లూరు జిల్లా వైసీపీలో పెను దుమారం
ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేల వివాదం ఇంకా తీవ్రరూపం దాల్చుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీలో పెను దుమారం రేపింది. ఈ క్రమంలో ఆయన చేసిన రాజ్యాంగంపై వ్యాఖ్యల గురించి ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని వెంకటగిరి ఇంఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి అన్నారు. అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం ఆనం అని మండిపడ్డారు. వయసు …
Read More »ఏపీలో దారుణం-టీడీపీ నేతపై కాల్పులు
ఏపీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి.ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ మండలాధ్యక్షుడు బాల కోటిరెడ్డిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆయన ఇంట్లోకి వెళ్లిన ప్రత్యర్థులు కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది. కాగా కాల్పుల్లో గాయపడిన బాలకోటిరెడ్డిని ఆయన కుటుంబసభ్యులు వెంటనే నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన జరిగిన …
Read More »తారకరత్న ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు లోనైన సినీనటుడు తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్న విషయం తెలిసిందే. తారకరత్న తాజా ఆరోగ్యపరిస్థితిపై నందమూరి రామకృష్ణ అప్‌డేట్ అందించారు. ఆయన ఇవాళ బెంగళూరులో ఆస్పత్రి ప్రాంగణంలో రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. …
Read More »