తన పాదయాత్ర, ఎన్నికల మేనిఫెస్టోలో 25లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామని మాటిచ్చామని.. అదనంగా మెరుగైన సౌకర్యాలతో కట్టిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. అనకాపల్లి జిల్లా పైడివాడ అగ్రహారం లే అవుట్‌లో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో సొంతంగా ఇల్లు లేని కుటుంబం ఉండబోదని మాటిచ్చామని.. ఇచ్చిన మాటకంటే మెరుగైన సౌకర్యాలతో కట్టించి తీరుతామని …
Read More »అంచెలంచెలుగా ఎదిగిన మల్లాది సందీప్ – వైఎస్ఎస్ఆర్ స్టేట్ కో-ఆర్డినేటర్‌గా నియామకం
మల్లాది సందీప్ కుమార్..ఇప్పుడు ఈ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో అందరి నోటా వినిపిస్తోంది. నమ్ముకున్న వ్యక్తులకు ఏనాటికైనా మంచి జరుగుతుందన్న నిజం మల్లాది సందీప్ ఎదుగుదలే నిదర్శనం. సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అత్యున్నత స్థాయికి ఎదిగి, చేపట్టిన పదవులకు వన్నె తీసుకొచ్చి, వైఎస్ఆర్‌టీపీలో తన సామర్థ్యం చాటుకొని, స్వశక్తితో అంచలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయికి చేరిన మల్లాది సందీప్‌ను ఇటీవల ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలమ్మ …
Read More »వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు వీళ్లే..
వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఇటీవల మంత్రి పదవులు దక్కని వారికి పార్టీలో కీలక పదవులు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వారికి అవకాశం కల్పించారు. తొలి నుంచీ పార్టీకి సేవలందించిన వారితో పాటు మరికొందరికి ఇందులో చోటు కల్పించి గౌరవించారు. జిల్లా అధ్యక్షులు రీజినల్ కోఆర్డినేటర్లు
Read More »సీఎం జగన్ దేవుడు -ఏపీ ఉప ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని దేవుడితో పోల్చారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయన స్వామి. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న బడుగులకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యం చూసి తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదనే భావనలో రెడ్లు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తామంతా దేవుడి ఫొటో బదులు సీఎం జగన్మోహాన్ రెడ్డి గారి ఫొటోతో చాంబర్లోకి ప్రవేశించి బాధ్యతలు స్వీకరించామని …
Read More »Mp టీజీ వెంకటేష్ పై కేసు నమోదు..?
ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అతని సోదరుడు విశ్వ ప్రసాద్ పై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహీల్స్ లో కేసు నమోదైంది. నగరంలోని బంజారాహీల్స్ రోడ్ నెంబర్ పదిలో ఉన్న అర్ధ ఎకరం తమదేనంటూ ఆధీనంలో తీసుకునేందుకు దాదాపు తొంబై మంది అక్కడకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకెళ్లి దొరికిన అరవై మూడు మందిని అరెస్ట్ చేసి కోర్టుకు …
Read More »అప్పుడు చాలా బాధపడ్డా: మంత్రి రోజా
టీడీపీలో ఉన్నప్పుడే మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నారని మంత్రి ఆర్కే రోజా గుర్తుచేసుకున్నారు. వైఎస్‌ఆర్‌తో కలిసి రాజకీయాల్లో పనిచేయాలని కలగన్నా.. ఆయన అకాల మరణంతో ఆ అవకాశం రాకపోవడంతో చాలా బాధపడ్డానని చెప్పారు. ఆ సమయంలో ఐరన్ లెగ్ అంటూ తనను టీడీపీ వాళ్లు అవహేళన చేశారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ తనకు దేవుడని.. ఆయన ఆశయాల సాధన కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని …
Read More »ఏపీలో మళ్లీ 5 మంది డిప్యూటీ సీఎంలు.. మంత్రుల శాఖలివే..
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కేబినెట్ కొలువుదీరింది. నూతన మంత్రులుగా 25 మంది ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వారితో ప్రమాణం చేయించారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శాఖలను కేటాయించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. పీడిక రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ,అంజాద్ బాషా, నారాయణస్వామికి డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. నారాయణస్వామి గత మంత్రివర్గంలోనూ డిప్యూటీ …
Read More »మాజీ మంత్రి మేకతోటి సుచరిత రాజీనామాపై క్లారిటీ
ఏపీకి చెందిన మాజీ మంత్రి మేకతోటి సుచరితను వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కలిశారు. మంత్రి సుచరితతో మాట్లాడిననంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సుచరితకు తప్పక న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. వివిధ సమీకరణాల వల్ల కొందరు మంత్రులు చోటు కోల్పోయారు. సుచరిత రాజీనామా చేయలేదు’ అని అన్నారు. అయితే అంతకు ముందు సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిందని ఆమె కుమార్తె రిషిత తెలిపారు. రాజీనామా చేసినప్పటికీ తన తల్లి …
Read More »మంత్రిగా విడదల రజిని రికార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత చిన్న వయస్కురాలిగా ఎమ్మెల్యే విడదల రజిని నిలిచారు. ఎమ్మెల్యే రజిని 31 ఏళ్లకే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 1990లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జన్మించిన రజిని ఓయూలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశారు. 2014లో టీడీపీలో చేరిన ఆమె 2018లో వైసీపీకి వచ్చారు. 2019లో తన రాజకీయ గురువు, అప్పటి మంత్రి …
Read More »ఏపీలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. వాళ్లకి ఆహ్వానాలు వెళ్లాయ్!
ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 11న మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానపత్రాలు, పాస్‌లు పంపుతున్నారు. పాత, కొత్త మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు ఈ ఆహ్వానపత్రాలు వెళ్తున్నాయి. ప్రజాప్రతినిధుల స్థాయిని బట్టి Aa, A1, A2, B1, B2 కేటగిరీలుగా పాస్‌లను జారీ చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్‌తో తేనీటి …
Read More »