ఏపీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ (59) కన్నుమూశారు. ఇటీవల కరోనా సోకడంతో వైజాగ్‌లోని ఓ దవాఖానలో చేరిన ఆయన ఊపిరితిత్తులు దెబ్బతినడంతో చికిత్సపొందుతూ ఆదివారం సా యంత్రం తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్ధం నగరంలోని పెద్దవాల్తేరు డాక్టర్స్‌కాలనీలోని ఆయన నివాసం వద్ద ద్రోణంరాజు పార్థివదేహాన్ని ఉంచనున్నారు. సోమవారం మధ్యా హ్నం మూడుగంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు శ్రీవాస్తవ తెలిపారు. ద్రోణంరాజు విశాఖ వన్‌టౌన్ …
Read More »తెలంగాణ నీటి వాటాలను వెంటనే తేల్చాలి
ఆది నుంచీ తెలంగాణపై కేంద్రానిది ఇదే సవతి తల్లి ప్రేమ. దీన్ని ఎండగడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్‌కు ఘాటుగా లేఖ రాశారు. తెలంగాణ వాదనను, వేదనను ఇకనైనా పట్టించుకోవాలని అందులో హితవు చెప్పారు. బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ విద్యావంతులకు, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో సమగ్రంగా అందులో వివరించారు. నదీ జలాల్లో వాటా- కేటాయింపుల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి.. …
Read More »ఏపీ సీఎం జగన్ మామ మృతి
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మామ, వైఎస్ భారతి తండ్రి, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. హైదరాబాద్ నుంచి ఆయన భౌతికకాయాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం పులివెందులకు తీసుకురానున్నారు. ఇప్పటికే సీఎం జగన్ తల్లి విజయలక్ష్మి తాడేపల్లి నుంచి పులివెందులకు బయలుదేరారు. అలాగే 11 గంటలకు ముఖ్యమంత్రి కూడా పులివెందులకు వెళ్లనున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డి.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స …
Read More »ఏపీలో కొత్తగా కొత్తగా 7,073 కరోనా కేసులు..
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 7,073 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,61,458కి పెరిగింది. మరోవైపు 8,695 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవరీలు 5.88 లక్షలకు పెరిగాయి. ఇక కరోనాతో పోరాడుతూ మరో 48మంది చనిపోయారు. చిత్తూరులో 8, ప్రకాశంలో 8, అనంతపురంలో 6, కృష్ణాలో 5, పశ్చిమ గోదావరిలో …
Read More »ఏపీలో 6.5లక్షల మార్కును దాటిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 6.5 లక్షల మార్కుని దాటేశాయి. గురువారం కొత్తగా 7,855 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 6,54,385కి పెరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మరోసారి వెయ్యికిపైగా కేసులు నమోదవగా.. ప్రకాశంలో 927 కేసులు బయటపడ్డాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 8,807 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో మరో 52 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. చిత్తూరులో 8, అనంతపురంలో 6, …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్‌తో గెలిచిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్… ‘అనధికారికం’గా వైసీపీలో చేరిపోయారు. ఆయన శనివారం తన ఇద్దరు కుమారులతో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. వాసుపల్లి కుమారులకు జగన్ వైసీపీ కండువాలు కప్పారు. ఆ పక్కనే వాసుపల్లి నిలుచున్నారు. ఈ కార్యక్రమం ముగించుకుని బయటకు వచ్చాక.. ‘‘నా కుమారులు వైసీపీలో చేరడం ఆనందంగా ఉంది. జగన్ గట్స్ ఉన్న నాయకుడు’’ అని ప్రశంసించారు. …
Read More »ఏపీ మంత్రికి లోకేష్ లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత రంగాన్ని కాపాడేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీ లోని పొందూరు, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ప్రాంతాల్లో చేనేత గొప్ప వారసత్వ సంపదగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం అఖిల భారత చేనేత బోర్డు, అఖిల భారత హస్తకళల బోర్డు, అఖిల …
Read More »ఏపీ ఒకప్పటి బీహార్, యూపీ మాదిరిగా ఉంది-దేవినేని
ఏపీ ఒకప్పటి బీహార్, యూపీని తలపిస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఎన్నడూ లేని అరాచకానికి అడుగే దూరమంటున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారని జగన్‌ను ప్రశ్నించారు. ‘‘పై స్థాయిలోనే ధిక్కారం, లెక్కలేని స్వరం, కింది స్థాయిలో పతాక స్థాయికి దౌర్జన్యాలు, ఉన్నతాధికారులనూ నిలబెట్టి బెదిరించడమే, కప్పం కట్టకపోతే భూములు వెనక్కి, దళితులపై దాడులు. ఒకప్పటి బీహార్, యూపీని తలపిస్తున్న ఏపీ, ఎన్నడూలేని అరాచకానికి అడుగే …
Read More »తిరుమలకు సీఎం జగన్
తిరుమలలో ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ 23వ తేదీన తిరుమలకు రానున్నట్టు సమాచారం. ఏటా బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టువస్ర్తాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ ఏడాది కొవిడ్-19 నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో భక్తులరద్దీ లేని కారణంగా పూర్వసంప్రదాయాన్ని పాటిస్తూ గరుడవాహనం జరిగే 23వ తేదీనే ముఖ్యమంత్రి …
Read More »అవినీతిపై జగన్ బ్రహ్మస్త్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని, అవినీతిని కూకటివేళ్లతో పెకలించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతి చేయాలంటే భయపడే స్థాయికి రావాలన్నారు. అవినీతికి ఆస్కారం లేని విధానాలతో ముందుకు వెళ్లాలని చెప్పారు. అవినీతి నిర్మూలనపై ముఖ్యమంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. 14400 కాల్ సెంటర్, కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, ఐఐఎం అహ్మదాబాద్ నివేదిక, రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ తదితర అంశాలను …
Read More »